పంటి నొప్పి పోవాలంటే ఏం చేయాలి !

0

పంటి నొప్పి పోవాలంటే ఏం చేయాలి | Panti Noppi Nivarana Telugu

పంటి నొప్పి పోవాలంటే ఏం చేయాలి :- చాల మంది పంటి నొప్పి వల్ల బాధ పడుతుంటారు. ఈ పంటి నొప్పి అనేది వివిధ రకాల ఆహరం తీసుకోవడం వల్ల వస్తుంది లేదా వేరే కారణాల వలన కూడా వస్తుంది. కొన్ని సార్లు పంటి నొప్పి ఎక్కువ అవ్వడం ద్వారా పన్ను తొలగించవాల్సి వస్తుంది. అయితే ఈ పంటి నొప్పి పోవాలంటే కొన్ని నివారణ పద్దతులను అనుసరిద్ధం.

పంటి నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి | Panti Noppi Thaggalante

పంటి నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం. పంటి నొప్పి నివారించడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. 

ఐస్ ముక్కలు

పన్ను నొప్పి ఉన్న చోట ఐస్ ముక్కలను ఐదు నిమిషాల నుండి పది నిమిషాల పాటుగా ఉంచడం ద్వారా పంటి నొప్పిని తగ్గించవచ్చు.

పంటి నొప్పి తగ్గాలంటే
వీట్ గ్రాస్ జ్యూస్

గోధుమ గడ్డి రసం దంత క్షయం కోసం ఒక మౌత్ వాష్ ఉపయోగిస్తారు. మీ చిగుళ్ళ నుండి విషక్రిములు బయటకు పంపటానికి సహాయపడుతుంది, బ్యాక్టీరియా అభివృద్దిని తగ్గించి పంటి నొప్పి నుంచి విముక్తి కలిగిస్తాయి.
పంటి నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి

ఆవ నూనె మరియు ఉప్పు

ఆవనూనె లో కొంచెం ఉప్పు కలుపుకొని పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. ఆవ నూనె లో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ ను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పంటి నొప్పి తొందరగా తగ్గాలంటే ఏం చేయాలి

గోరువెచ్చని నీరు మరియు ఉప్పు

పంటి నొప్పి ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలుపుకొని ఆ నీటిని నోట్లో వేసి పుక్కిలించి ఉమ్మి వేయాలి. గోరువెచ్చని నీరు, ఉప్పు సహజ యాంటీసెప్టిక్ లా పనిచేస్తాయి. దీంతో దంతాలలో ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండి నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.
పంటి నొప్పి నివారణ

లవంగాలు మరియు ఆలివ్ ఆయిల్

లవంగాల పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న దంతాలపై రాస్తే నొప్పి నుంచి నివారణ పొందవచ్చు. ఇలా చేయడంతో మంచి ఫలితం ఉంటుంది.
పంటి నొప్పి నివారణ మార్గాలు

ఉల్లిపాయ

ఉల్లిపాయ  క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పంటి నొప్పిని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఉల్లిపాయను రెండు నిమిషాలు నమిలితే దంతాలలో ఇన్ఫెక్షన్  కారణంగా చేరిన బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. దాంతో నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
panti noppi nivarana telugu

వెల్లుల్లి అండ్ లవంగాలు

వెల్లుల్లి, లవంగాలు పంటి నొప్పిని తగ్గించడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. వెల్లుల్లి లవంగాలు తీసుకుని దాన్ని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే నొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
panti noppi home remedy

గమనిక :- పైన ఇచ్చిన information మాకి అందిన ఇంటర్నెట్ సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఈ Matter కేవలం మీకు అవగాహనా కోసమే, పంటి నొప్పి వల్ల బాధపడుతున్న వారు వెంటనే వైదుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-