పీరియడ్స్ వెంటనే రావాలి అంటే ఏం చేయాలి ?

0

మహిళలకి పీరియడ్స్ సుమారుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి వస్తాయి, అయితే, ఈసమయం ప్రతి స్త్రీకీ మారుతుంది. పీరియడ్ కీ పీరియడ్ కీ మధ్య ముప్ఫై ఐదు రోజుల కంటే ఎక్కువసమయం ఉంటున్నా, లేదా ఈ సమయం మారుతూ ఉంటున్నా అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు.

పీరియడ్స్ సాధారణంగా ప్యూబర్టీ సమయంలో మొదలవుతాయి, అంటే సుమారుగా పది నుండి పదహారు సంవత్సరాల మధ్యలో పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పీరియడ్స్ మెనోపాజ్ వరకూ కంటిన్యూ అవుతాయి, అంటే సుమారుగా 45 నుండి 55 సంవత్సరాల మధ్యలో మెనోపాజ్ వస్తుంది.

హార్మోనల్ ఇంబాలెన్స్, మెనోపాజ్ సమయం లో జరిగే హార్మోనల్ ఛేంజెస్, బర్త్ కంట్రోల్ కోసం వాడే పద్ధతులు, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజుల వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావచ్చు. ప్యూబర్టీ సమయం లోనూ, మెనోపాజ్ సమయం లోనూ ఈ సమస్యకి ఎలాంటి చికిత్సా అవసరం లేదు. అయితే, పునరుత్పత్తి వయసులో ఇలా జరుగుతుంటే మాత్రం డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అవసరం. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడానికి అనేక కారణాలుండవచ్చు. చాలా కారణాలు హార్మోంప్రొడ్ అక్షన్ కి సంబంధించి ఉంటాయి. ఋతుక్రమాన్ని ప్రభావితం చేసే హార్మోన్లు రెండు, అవి ఈస్ట్రోజెన్ మరియూ ప్రొజెస్టిరాన్. ఈ హార్మోన్ల వల్లే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.

హార్మోన్ల ప్రభావం

హార్మోన్ల బ్యాలెన్స్ ని ప్రభావితం చేసే వాటిలో ప్యూబర్టీ, మెనోపాజ్, గర్భం ధరించడం, ప్రసవం, పిల్లలకి పాలివ్వడం వంటివి ఉంటాయి. ప్యూబర్టీ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఒక్కొక్కసారి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ బ్యాలెన్స్ కుదరడానికి కొన్నేళ్ళు కూడా పట్టవచ్చు. కాబట్టి, ఈ సమయంలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడం అనేది సహజమైన విషయమే. మెనోపాజ్ ముందు కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవచ్చు. అలాగే, బ్లీడింగ్ ఎక్కువగానో, తక్కువగానో ఉండవచ్చు. వరసగా పన్నెండు నెలల పాటూ పీరియడ్ రాకపోతే అప్పుడు దాన్ని మెనోపాజ్ గా కన్సిడర్ చేస్తారు. మెనోపాజ్ తరువాత ఇంక పీరియడ్స్ రావు. గర్భం ధరించినప్పుడు ఎలాగూ పీరియడ్స్ రావు, అలాగే, పాలిస్తున్నంత కాలం కూడా చాలా మంది మహిళలకి పీరియడ్స్ రావు.

ఇవి కాక, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కల ఇతర కారణాలు

1. బాగా బరువు తగ్గడం
2. బాగా బరువు పెరగడం
3. ఒత్తిడికి గురవ్వడం
4. ఎనొరెక్సియా, బులీమియా వంటి ఈటింగ్ డిసార్డర్స్
5. మారథాన్ రన్నింగ్ వంటి ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజులు

అలాగే, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల వలన కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. వాటి లక్షణాలు ఏమిటో చూద్దాం.

సుమారుగా ఇరవై నాలుగు రోజుల నుండి ముప్ఫై ఐదు రోజుల మధ్యలో పీరియడ్ వస్తూ ఉంటుంది. బ్లీడింగ్ సుమారుగా ఐదు రోజులు ఉండవచ్చు. కొంత మందికి కేవలం రెండు రోజులు మాత్రమే బ్లీడింగ్ అయితే మరికొంత మందికి ఏడు రోజుల వరకూ అవ్వవచ్చు. ఇవి సహజం గా ప్రతి స్త్రీకీ ఒక రొటీన్ లా అలవాటయిపోయి ఉంటాయి. వీటిలో తేడా వచ్చినా, 2.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ డయామీటర్ లో క్లాట్స్ఉన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అనుకోవచ్చు. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి సూచన కావచ్చు, వాటిలో కొన్ని సంతానోత్పత్తి లో సమస్యలకి కూడా దారి తీయవచ్చు.

1. పీసీఓఎస్ అనే కండిషన్ లో ఓవరీస్ లో సిస్టులు డెవలప్ అవుతాయి. పీసీఓఎస్ ఉన్న మహిళల్లో ఓవులేషన్ జరగదు, దాంతో ప్రతి నెలా అండం విడుదల కాదు. ఈ లక్షణాల్లో అసలు పీరియడ్ రాకపోవడం, ఇర్రెగ్యులర్ గా పీరియడ్ రావడం, ఒబెసిటీ, యాక్నే, ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉంటాయి. ఈ కండిషన్ ఉన్న మహిళల్లో మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.

1. కాఫీ

కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ ని స్టిమ్యులేట్ చేస్తుందని అంటారు. దాని వల్ల పీరియడ్స్ సరిగ్గా వస్తాయి. అలాగే, పీరియడ్స్ సమయం లో వచ్చే నొప్పి నుండి కూడా కెఫీన్ రిలీఫ్ ని ఇస్తుంది. ఇది ఇంకా తలనొప్పి, మైగ్రైన్ వంటి సమస్య నుండి కూడా రిలీఫ్ అందిస్తుంది.2. నట్స్

ఆల్మండ్స్, వాల్నట్స్ ని స్నాక్ గా తీసుకోవడం వల్ల మీరు మీ పీరియడ్స్ కి ప్రిపేర్ అయి ఉండవచ్చు. ఈ రెండు రకాల నట్స్ లోనూ ఫైబర్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల లోపల వేడి పెరిగి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. వీటిని మీ పీరియడ్స్ ముందు తినడం వల్ల మీ ఆరోగ్యానికే కాదు, మీ ఫెర్టిలిటీ కి కూడా మేలు జరుగుతుంది.
3. పండ్లు (విటమిన్ సీ ఉన్నవి)

బొప్పాయి వంటి పండ్లలో కెరోటిన్ ఉంటుంది, ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ ని స్టిమ్యులేట్ చేసి పీరియడ్స్ ముందుగా వచ్చేట్లు చేస్తుందని అంటారు. ఇలాంటిదే మరొక పండు పైనాపిల్. ఈ పండు పెల్విక్ రీజియన్ లో హీట్ ప్రొడ్యూస్ చేసి పీరియడ్ వచ్చేట్లు చేస్తుంది. అందుకని, పీరియడ్ టైమ్ కి రావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మామిడి పండుకి కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుందని అంటారు. ఈ పండ్ల లో ఉండే విటమిన్ సీ ఈస్ట్రోజెన్ హార్మోన్ యొక్క లెవెల్ ని పెంచి ప్రొజెస్టిరాన్ హార్మోన్ యొక్క లెవెల్ ని తగ్గిస్తుంది.
4. ఖర్జూరాలు

ఖర్జూరాల వల్ల బాడీలో వేడి పెరుగుతుంది, అందుకే వీటిని శీతా కాలంలో తింటారు. పీరియడ్స్ టైమ్ లో గోరు వెచ్చని ఖర్జూరపు పాలు తాగడం ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. చలికాలం లో ప్రతి రోజూ నిద్రకి ముందు తీసుకోవడం వల్ల మీ రిప్రొడక్టివ్ హెల్త్ బావుంటుంది.5. బెల్లం

పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బాగా తక్కువ అవుతుంటే బెల్లం ఉపయోగపడుతుందని అంటారు, కానీ పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లో కూడా బెల్లం హెల్ప్ చేస్తుంది. నిజానికి, పీరియడ్స్ టైమ్ లో బెల్లం తీసుకోమని కూడా డాక్టర్లు చెబుతారు, ఎందుకంటే బెల్లం లో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే గుణం ఉంది. అయితే, ఇలా తీసుకునేప్పుడు కొద్ది మొత్తంలోనే తీసుకోవాలని గుర్తు పెట్టుకోండి.