బక్రీద్ పండుగ రోజు గొర్రెలు,మేకలు ఎందుకు బలి ఇస్తారు ?

0

Barkid పండుగకు మరొక పేరే “ Eid-al-adha ( ఈద్ అల అధ ) “ లేదా “ Eid Quirban “. తెలుగులో చెప్పాలంటే  త్యాగాల పండుగ అని అర్థం.

బక్రీద్ ఇస్లాం మతస్తుల రెండవ అతిపెద్ద పండుగ.బక్రీద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గొర్రె, మేకలు మొదలగు జంతువులను బలివ్వడం. మరి చాలామందికి ముస్లింల అతి పెద్ద పండుగ అయిన  రంజాన్ రోజు కాకుండా బక్రీద్ రోజున ఇలా ఎందుకు చేస్తారు అనే సందేహం ఉంటుంది. దీనికి ఒక బలమైన కారణమే ఉందండోయ్, దాని గురించి మీకు క్షుణ్ణంగా నాకు తెలిసిన విషయాలను షేర్ చేస్తాను.దీని గురించి మీకు తెలియాలి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలి ఉంది,కొంచెం సేపు మనసుపెట్టి చదవండి.

 పూర్వకాలంలో సౌదీ అరేబియాలో  అల్లాహ్ పంపించిన ప్రవక్తల్లో ఇబ్రహీం చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయనకు ఇస్మాయిల్ అనే కొడుకుండేవాడు.పెళ్లయిన నా చాలు ఏళ్ల తర్వాత పుట్టిన కొడుకంటే ఇబ్రహీం కి ప్రేమ చాలా ఎక్కువ. ఒకరోజు అల్లాహ్ ఇబ్రహీం దైవభక్తిని ప్రత్యక్షంగా చూడాలని  ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. అదేంటంటే ఇబ్రహీం గాఢనిద్రలో ఉన్న సమయంలో అల్లా ప్రత్యక్షమయ్యి “ నా పైన నీ భక్తిని నిరూపించుకో అని అడిగాడు, ఇబ్రహీం ఎలా నిరూపించుకోవాలి అని అడగగా, అల్లాహ్ ఇబ్రహీం కొడుకు ఇస్మాయిల్ ను బలి ఇవ్వమని సమాధానమిచ్చాడు”. 

ఆ మరుసటి రోజే ఇబ్రహీం తన కొడుకును వెంటబెట్టుకొని బలి ఇవ్వడానికి అడవిలోకి బయలుదేరాడు. ఈ విషయం ఎలాగోలా ఇస్మాయిల్ కి కూడా తెలిసింది కానీ తన తండ్రి మాటని శిరసావహించాలని నిర్ణయించుకున్నాడు. ఇబ్రహీం సరిగ్గా గొడ్డలితో కొడుకును బలివ్వబోతుండగా, తన భక్తి శ్రద్ధలను మెచ్చుకొని అల్లాహ్ ఒక గొర్రె పిల్ల ను ప్రసాదించాడు. ఇబ్రహీం కొడుకుకి బదులుగా అల్లాహ్ ఇచ్చిన గొర్రెను బలిచ్చాడు.ఇబ్రహీం చేసిన ఈ త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం గొర్రెలను బలివ్వడం ఆనవాయితీగా వస్తుంది. 

  ఈ కథ లో దాగి ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం జంతువులను బలి ఇవ్వడం మాత్రమే కాదు, అవి మనల్ని గుర్తు పట్టే విధంగా  పెంచి పోషించాలి. అలాగే మనం కూడా బలి ఇచ్చే జంతువు పై అమితమైన ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బలి దానానికి ఒక అర్థం ఉంది.  బలి ఇచ్చిన తర్వాత వచ్చిన మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి, ఒక భాగాన్ని పేదలకు, ఒక భాగాన్ని బంధువులకు మిగిలిన భాగాన్ని మన సొంత ఇంటికి సమానంగా పంచుకోవాలి.పండుగ రోజు కూడా మాంసం కొనలేని  పేదలకు పంచడమే బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

మరి ఈ సారాంశం ద్వారా ఎంతో కొంత విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను.ఇలాంటి మరెన్నో అంశాల గురించి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను.ఇట్లు,మీ పటాన్.

—-Happy Bakrid In Advance My Dear Friends.