జిల్లాల్లో ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

0
aasha workers notification

AP Asha Worker Notification 2020

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. భారీ సంఖ్యలో ఈ పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం, కర్నూలు జిల్లాల వాడు సచివాలయాల్లో మొత్తంగా 360 పోస్టులు ఉన్నాయి. ఇందుకుగాను లోకల్ గా ఉన్నటువంటి వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.

Aasha worker Post Qualifications

1. కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయి ఉండాలి.

2. ఈ నెల అక్టోబర్ 1 నాటికి 25 నుండి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

3. తెలుగు బాగా చదవడం రాయడం వచ్చి ఉండాలి.

4. వితంతువులు, విడాకులు పొందినటువంటి మహిళలు అలాగే ఒంటరిగా నివసించే వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారు.

5. ప్రభుత్వానికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన అనుభవజ్ఞుల కు ముందుగా అవకాశం ఇస్తారు.

6. ఆశా వర్కర్లు పోస్టులకు పని చేయాలంటే కుటుంబ ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం మరియు గర్భిణుల సమస్యలపై మంచి అవగాహన ఉండాలి.

7. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అలాగే సమస్యలను సత్వరంగా పరిష్కరించగల గే తెలివి ఉండాలి.

How to Apply Aasha workers posts

1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకోవాలి.

2. జత పరచవలసిన డాక్యుమెంట్లు విషయానికి వస్తే

-> టెన్త్ క్లాస్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, రేషన్ కార్డు ,ఆధార్ కార్డు, ఓటర్ కార్డు , పిల్లలు ఉన్నట్లయితే మాతా శిశు సంరక్షణ కార్డు, పెళ్లి అయినట్లు సొంత డిక్లరేషన్ మరియు బ్యాంకు కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్.

Posts Details :

1. కర్నూలు జిల్లాలో :- ఎమ్మిగనూరు నంద్యాల ఆదోని కర్నూలు కేంద్రాల్లో మొత్తం 139 పోస్టులు ఉన్నాయి.

2. చివరి తేదీ : అక్టోబర్ 13

Official website : http://Kurnool.ap.gov.in

3. విశాఖపట్నం జిల్లాలో: – మొత్తం పోస్టుల సంఖ్య 230

4. చివరి తేదీ : అక్టోబర్ 12

5. Official website : http://Visakhapatnam.ap.gov.in