AP లో భారీగా అసిస్టెంట్ జాబ్స్ | IIPE Notification 2025

0
IIPE Notification 2025

IIPE: ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) అనేది భారత ప్రభుత్వ పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ (MoPNG) ఆధ్వర్యంలో పనిచేసే ప్రత్యేక విద్యాసంస్థ.  పెట్రోలియం,ఎనర్జీ మరియు సంబంధిత రంగాల్లో నిపుణులను తయారు చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది.IIPE ని 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రారంభించారు.

భారతదేశ పెట్రోలియం & ఎనర్జీ రంగాల్లో నిపుణుల కొరతను తీర్చడం,పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన విద్య అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యంగా చెప్పుకోవచ్చు.ఈ IIPE లో కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

IIPE Notification 2025

ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో జూనియర్ అసిస్టెంట్,ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారి చేశారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది.దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీలో 14 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.ఇంతకి పోస్టులు ఏంటి?,ఎన్ని ఖాళీగా ఉన్నాయి? వీటికి శాలరీ ఎంత ఇస్తారు? అనే విషయాల గురించి క్రింద పట్టికలో క్లియర్ గా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesReservation
1Junior Assistant10SC1,OBC2,EWS1,UR6
2Lab Assistant
(Mechanical Engineering)
1UR1
3Lab Assistant
(Chemical Engineering)
1UR1
4Lab Assistant
(Computer Science)
1OBC1
5Lab Assistant (Chemistry)1UR1
Total14

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ IIPE జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 30 మధ్య ఉండాలి.
  •  రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.
  • డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • 2 సంవత్సరాల ఎక్స్ పిరియన్స్ ఉండాలి.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే  ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.

HPCL Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ IIPE  జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 32,000/- 35,000 వరకు స్యాలరి ఇస్తారు.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఆన్లైన్ లో ఈ IIPE జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు 100/- ఫీజు ఉంటుంది.ఇంకా రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు.అంటే వారు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది15-3-2025
అప్లికేషన్ లాస్ట్ తేది31-3-2025

Job Selection Process

ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్నవంటి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.రాత పరీక్షలో క్రింది తెలిపిన వాటి నుంచి క్యూషన్స్ అడుగుతారు  అవి ఏంటంటే:

  • రీజనింగ్
  • ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్
  • ఆప్టిట్యూడ్.

Apply Process

ఫ్రెండ్స్ ఈ IIPE జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

IIPE Notification 2025