Ruler Twitter Review :
ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం తరువాత, నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సన్నద్ధమవుతున్నారు. ‘జై సింహా’ ఫేమ్ కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రోమోలు మరియు లిరికల్ సాంగ్స్ ప్రజలతో సరైన పల్స్ ని పట్టగలిగాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావడంతో, మంచి అంచనాల మధ్య Ruler ఈ రోజు ( డిసెంబర్ 20) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చాడు .
డ్యూయల్ రోల్ లో బాలయ్య బాబు నటించిన ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్, విషాదం, కామెడీ మరియు అనేక భావోద్వేగాలతో మిళితమైన ఒక ఫక్తు మసాలా కమర్షియల్ మూవీ గ చెప్పబడింది. రెండు ట్రెయిలర్లు హీరో ఎలివేటింగ్ దృశ్యాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, బ్రహ్మాండమైన హీరోయిన్స్, ఆకట్టుకునే డైలాగులు, ఘోరమైన విలన్లు కలిసి ఈ సినిమా ని విజయవంతం చేయడానికి రెడీ గ ఉన్నాయి.
పాపులర్ movie ఎవెంజర్స్ సిరీస్ నుండి టోనీ స్టార్క్ పాత్రను పోలి ఉన్న బాలయ్య యొక్క ఉబెర్-కూల్ లుక్‌తో పాటు, బాలీవుడ్ బాంబ్‌షెల్ సోనాల్ చౌహాన్ మరియు వేధిక యొక్క హాట్ అందాలు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణలు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరియు ప్రముఖ హీరోయిన్ భూమికా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటివరకు వచ్చిన రివ్యూస్ ప్రకారం, కమర్షియల్ ఎంటర్టైనర్ల విషయానికి వస్తే బాలకృష్ణ మరోసారి తన సత్తాని నిరూపించుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ లో సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగా ఉంది అంటున్నారు. తమకు తోచిన విధానంగా ruler movie review and ratings ఇస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాలంటే కనీసం ఈవెనింగ్ వరకు అయిన వేచి ఉండాలి మరి.ఎంతైనా మన బాలయ్య కదా, ఆ మాత్రం సమయం కావాలి మరి.