sarileru neekevvaru vs ala vaikunta puram lo collections 3 days
తెలుగువారి సంప్రదాయ మైన పండగ సంక్రాంతి సందర్భంగా సినిమా వాతావరణం కూడా సంక్రాంతి సందడిగా మారినది.
సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలాంటి కమర్షియల్ సినిమాల విజయాలు తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సరిలేరు నీకెవ్వరు విజయాల పరంపరలో ముందుకు దూసుకెళ్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లేడి అమితాబ్ గా పేరుపొందిన విజయశాంతి కీలకమైన పాత్రలో నటించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జనవరి 11న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ పరంగా బెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు నటన ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి యాక్షన్ మూవీ గా రూపుదిద్దుకున్నది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు తనదైన మార్కు కామెడీతో ,పోకిరి లాంటి చిత్రాల్లోని సరికొత్త డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
sarileru neekevvaru 3 days collection
సరిలేరు నీకెవ్వరు చిత్రం మూడు రోజుల కలెక్షన్లు ఏరియా వైజ్ గా గమనిస్తే ఇలా ఉన్నాయి.
నైజాం 7.5 కోట్లు
సీడెడ్ 3.95కోట్లు
UA 4కోట్లు
ఈస్ట్ 3కోట్లు
వెస్ట్1.8కోట్లు
గుంటూరు 5.2కోట్లు
క్రృష్ణా 3.2కోట్లు
నెల్లూరు 1.3కోట్లు
టోటల్ గా ఎపి మరియు తెలంగాణ 30.77కోట్లు
కర్ణాటక 3.2 కోట్లు
ROA 48 కోట్లు,OS 5 కోట్లు
టోటల్ గా 35.40కోట్లు
గ్రాస్ 57 కోట్లు గా నిలిచింది.
మరి ఈ సినిమాకు పోటీ గా ఒక్క రోజు తేడాతో విడుదల అయింది బన్నీ సినిమా అల వైకుంఠపురం లో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. మిడిల్ క్లాస్ కుర్రాడి గా బన్నీ నటన అద్భుతం గా ఉందని, ఆయన ఇగో లెస్ గా పెర్ఫార్మెన్స్ బాగుంది అని, తన క్యారెక్టర్ లో తన దైన శైలిలో నటించాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక బన్నీ ఫ్యాన్స్ ఐతే ఈ సినిమా ను పిఛ్ఛ గా ఎంజాయ్ చేస్తున్నారు.
పూజ హెగ్డే నటన, ఎంటర్ టైన్ మెంట్, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు కూడా సినిమా కు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్ . కేవలం సంగీతం మాత్రమే కాకుండా నేపధ్య సంగీతం పరంగా బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు.
ala vaikunta puram lo 3 days collection
సరిలేరు నీకెవ్వరు చిత్రం తో పోలిస్తే అల వైకుంఠపురం లో 3 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం 7.7కోట్లు
సీడెడ్3.51కోట్లు,UAE 3.7 కోట్లు
ROA 44లక్షలు,ఈస్ట్ 2.8కోట్లు
వెస్ట్ 2కోట్లు, గుంటూరు 3.84కోట్లు, క్రృష్ణా 3.1కోట్లు
నెల్లూరు 0.97కోట్లు,ఇక ఎపి తెలంగాణ 29.5కోట్లు కాగా, కర్ణాటక 2.9కోట్లు
OS 5.1కోట్లు
టోటల్ గా 36కోట్లు సాధించగా, గ్రాస్ 56కోట్లు గా నిలిచింది.
మొత్తంగా ఈ రెండు సినిమాల్లోనూ కంపేర్ చేస్తే ఏదీ కూడా ఒక పాయింట్ ముందు ఒక పాయింట్ వెనుక అనే తేడా లేకుండా కలెక్షన్లు సాధించాయి. కాకపోతే అల వైకుంఠ పురం లో జస్ట్ ఒక ఇంచు ముందు ఉన్నట్లు కనిపిస్తోంది.
కాబట్టి ముందు ముందు అల వైకుంఠ పురం లో చిత్రం సరిలేరు నీకెవ్వరు ను బీట్ చేసి ముందుకు వెళ్తుందా లేక గతంలో లాగా మహేష్ బాబు తన రికార్డులను తిరగరాస్తాడా !!! వేచి చూద్దాం.