Ammavodi డబ్బులు రాలేదా ? అందరికి రూ.15000 వస్తాయి తొందరలో..!

1

jagananna ammavodi amount రాలేదా ?

మీ ఖాతాలోకి జగనన్న అమ్మ ఒడిడి డబ్బులు పడలేదా! అయితే ఈ ఒక్క కారణం కావచ్చు!

రాష్ట్రవ్యాప్తంగా jaganannaammavodi కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అట్టహాసంగా చిత్తూరు జిల్లాలో గురువారం ప్రారంభించారు. సీఎం గారు ఈ పథకం ప్రారంభించి మూడు రోజులు కావస్తున్నా ఇప్పటికీ చాలామంది తల్లులకు అమ్మ ఒడి డబ్బులు 15000 రూపాయలు జమ కావడం లేదు.

మీరు అన్ని ఫారాలు సబ్మిట్ చేసినా, అమ్మబడి సెలక్షన్ జాబితా లో మీ పేరు ఉన్నా కూడా మీ ఖాతాలోకి డబ్బులు ఎందుకు జమ కావడం లేదో అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు దీని గురించి క్లారిటీ ఇచ్చారు.

పేద విద్యార్థుల చదువుల కోసం వారి తల్లుల ఖాతాలోకి అమ్మ ఒడి పథకం కింద 15 వేల రూపాయలను జమ చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా రోజుకు 10 లక్షల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.

అయితే రెండవ శనివారం తర్వాత ఆదివారం ఇలాంటి వరుస సెలవుల కారణంగా చాలామంది ఖాతాలోకి డబ్బులు జమ కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.అందువల్ల మరల సోమవారం నుంచి యధావిధిగా అర్హుల ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. jaganannaammavodi status check online కోసం ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఖాతాలోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు.
ఈ విషయానికి సంబంధించి అమ్మ ఒడి అర్షుల జాబితాలో పేరు ఉన్నవారు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

సోమవారం నుండి సంక్రాంతి పండుగ లోపల ప్రతి ఒక్కరికి 15000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని చెబుతున్నారు. కాబట్టే సంక్రాంతి వరకు అందరూ వేచి ఉండాల్సిందిగా కోరుతున్నారు.

1 COMMENT

  1. మాకు కరెంట్ బిల్ 300units రాకుండనే ineligible లిస్ట్ లో కరెంట్ ఎక్కువ వచ్చింది అని అన్నారు help me sir plz…..