YSR Pelli kanuka : ఎలా అప్లై చేయాలి ? స్టేటస్ ని ఎలా చెక్ చేయాలి ? ఫుల్ డీటెయిల్స్

0
ysr pelli kanuka status

Ysr Pelli Kanuka Details : Online Status Check & Apply Online

YSR Pelli kanuka ఉద్దేశం :- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్లల పెళ్లి కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయిన తరువాత అత్త వారింటికి వెళ్ళి అక్కడ అభద్రతా భావంతో ఉండకుండా గౌరవంగా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకాన్ని అమలులోకి తీసుకు రావడం జరిగింది.

ఈ YSR Pelli kanuka పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు ముఖ్యంగా వివాహం రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ”వైఎస్సార్ పెళ్ళికానుక” ముఖ్య ఉద్దేశ్యం.

Ysr Pelli Kanuka Scheme Details In Telugu 2021

2021 సంవత్సరానికి గాను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కానుక పథకం లో భారీ మార్పులు తీసుకువచ్చారు. YSR PELLI KANUKA SCHEME అమలు చేయడం ద్వారా నూతన వధూవరులు లేదా కొత్త పెళ్లి జంటలందరికీ అనేక ఆర్థిక ప్రోత్సాహకాలు అందించబడతాయి. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ఆర్టికల్ లో, వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం యొక్క ప్రత్యేకతలను గురించి ప్రతి ఒక్కరి కి అర్థమయ్యే విధంగా తెలియ చేస్తాం.

ఇంకా ఈ ఆర్టికల్ లో పెల్లి కానుక పథకం కోసం మీరు APPLY చేసుకునే విధానాన్ని మేము దశల వారీ వివరిస్తాము. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎంపిక ప్రక్రియ, అవసరమైన పత్రాలు వంటి ముఖ్యమైన వివరాలను మీకు తెలియజేస్తున్నాము. ఈ ఆర్టికల్ లో ఇచ్చిన వివరాల ద్వారా మీరు మీ అప్లికేషన్ స్టేటస్ ని కూడా ట్రాక్ చేయవచ్చు.

YSR PELLI KANUKA STATUS 2021

వైయస్ఆర్ పెళ్లి కానుక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూతన వధూవరులకు ఆర్థిక ప్రయోజనాలు అందించబడతాయి.

వైయస్సార్ పెళ్లి కానుక పథకం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వధువులు తమ వివాహాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఎంటర్ చేయడం ద్వారా ఆర్థిక సహాయం పొందగలుగుతారు. నూతన వధూవరులు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక వివాహం యొక్క అధికారిక చట్టం ద్వారా వివాహాన్ని రిజిస్టర్ చేసుకుంటే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Aim of YSR PELLI KANUKA SCHEME : వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం యొక్క లక్ష్యం

ఆడపిల్లల వివాహ వేడుకకు పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు భద్రత కల్పించడం. మరియు బాలికలను బాల్య వివాహం నుండి రక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.

Ysr pelli kanuka scheme అధికారిక వెబ్‌సైట్ : http://ysrpk.ap.gov.in

Ysr Pelli Kanuka Eligibility 2021

వైయస్సార్ పెళ్లి కానుక పథకం కోసం అప్లై చేయడానికి, అప్లై చేసే వారు ఈ క్రింది విధమైన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

  1. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి
  2. దరఖాస్తుదారుడు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
  3. దరఖాస్తుదారు యొక్క సంవత్సర ఆదాయం ₹ 200000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి
  4. అప్లై చేసుకునే వారి వివాహం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగి ఉండాలి.
  5. వితంతువులు మరియు విడాకులు తీసుకున్నవారు ఈ పథకానికి వర్తించరు.

Ysr Pelli Kanuka Required Documents List

వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం యొక్క అప్లికేషన్ ఫారమ్ నింపేటప్పుడు ఈ క్రింది డాక్యుమెంట్స్ / సర్టిఫికెట్స్ అవసరం: –

  1. జనన ధృవీకరణ పత్రం
  2. వరుడు మరియు వధువు పుట్టిన తేదీని పేర్కొనే SSC సర్టిఫికేట్.
  3. కుల ధృవీకరణ పత్రం
  4. ఆధార్ కార్డు
  5. రెండు కుటుంబాల యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం
  6. వివాహ ఆహ్వాన కార్డు / పెళ్లి పత్రిక
  7. పాస్ పోర్ట్ సైజు ఫోటో
  8. బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ
  9. రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు

వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం కింద అందజేసే ప్రోత్సాహకాలు/ ఇన్సెంటివ్స్ | ysr pelli kanuka amount details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కుల, వర్గాలకు చెందిన నూతన వధూవరులకు ఈ క్రింది విధంగా ప్రోత్సాహకాలు అందించబడతాయి.

Scheme Name      : Department Incentive
YSR Pelli Kaanuka Amount For SC : (S.C) Social Welfare 40,000/-
YSR Pelli Kaanuka : (S.C Intercaste) Social Welfare 75,000/-
YSR Pelli Kaanuka : (Giriputrika) Tribal Welfare 50,000/
YSR Pelli Kaanuka : (S.T Intercaste) Tribal Welfare 75,000/-
YSR Pelli Kaanuka Amount For BC : (B.C) BC Welfare 35,000/-
YSR Pelli Kaanuka : (B.C Intercaste) BC Welfare 50,000/-
YSR Pelli Kaanuka Amount For Minority : (DULHAN) Minorities 50,000/-
YSR Pelli Kaanuka : (Differently Abled) Differently Abled 1,00,000/-
YSR Pelli Kaanuka : (APBOCWWB) AP Building and Other Construction Workers Welfare Board

మీకు తెలుసా : మనకు అందే ప్రతీ పథకం ఏంటో ఇక్కడ చెక్ చేయండి

How To Apply Ysr Pelli Kanuka Online In Telugu

వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం కోసం ఆన్‌లైన్‌లో ఇలా apply చేయవచ్చు. వైయస్సార్ పెళ్లి కానుక పథకానికి అప్లై చేసుకోవడానికి, మీరు ఈ క్రింద ఇచ్చిన సింపుల్ స్టెప్పులను అనుసరించాలి.

  • వైయస్సార్ పెళ్లి కానుక పథకం యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.
    ( http://ysrpk.ap.gov.in )
  • అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఆ అప్లికేషన్ ఫారం లో అన్ని వివరాలను ఎంటర్ చేయండి.
  • మరియు అప్లికేషన్ లో పేర్కొన్న అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
  • ఆ తర్వాత Submit బటన్ పై క్లిక్ చేయండి.

గ్రామీణ ప్రాంత పెళ్లి జంటలకు కొన్ని సూచనలు: గ్రామీణ ప్రాంత పెళ్లి జంటలు , వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు రిజిస్ట్రేషన్లు చేయాలి. దీని కోసం గ్రామీణ ప్రాంత పెళ్లి జంటలు , మండల మహిళా సమాఖ్య లేదా వెలుగు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్-కమ్-హెల్ప్ డెస్క్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.

అర్బన్ ఏరియా లో ఉన్న వారు పెళ్లి కానుక పథకం కోసం – వివాహం తేదీకి కనీసం 5 రోజుల ముందు రిజిస్ట్రేషన్లు చేయాలి. అర్బన్ ఏరియాలో ఉన్న వారు, MEPMA మునిసిపాలిటీ వద్ద రిజిస్ట్రేషన్-కమ్-హెల్ప్ డెస్క్‌ల నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.

How To Check Ysr Pelli Kanuka Status In Telugu

వైయస్ఆర్ పెళ్లి కానుక అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసే విధానం:- అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేయడానికి, మీరు క్రింద ఇచ్చిన విధంగా అనుసరించండి.

  • ఇందుకోసం మొదటగా, పెళ్లి కానుక స్టేటస్ కోసం ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
  • ( http://ysrpk.ap.gov.in )
  •  ఇక్కడ “know your application status” అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి.
  • తర్వాత వధూవరుల ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయండి.
  • ఇప్పుడు “Get status” ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • AP YSR Pelli Kanuka అప్లికేషన్ యొక్క స్టేటస్ స్క్రీన్ మీద చూపబడుతుంది.
YSR Pelli Kanuka Toll Free Number / Helpline Number

వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించవచ్చు. ఇక్కడ జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడమైనది.

S.No. District Name — Toll Free Number
1. Ananthapuramu — 1800 425 5032
2. Chittoor. — 1800 425 5035
3. East Godavari — 1800 425 5041
4. Guntur — 1800 425 5038
5. Kadapa — 1800 425 5033
6. Krishna — 1800 425 5039
7. Prakasam — 1800 425 5037
8. Nellore — 1800 425 5036
9. Kurnool — 1800 425 5034
10. Srikakulam — 1800 425 5044
11. Visakhapatnam — 1800 425 5042
12. West Godavari — 1800 425 5040
13. Vizianagaram — 1800 425 5043

ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే, తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి.