Table of Contents
Navaratnalu : AP Govt Schemes List In Telugu
Navaratnalu 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నూతనంగా ప్రవేశపెట్టిన, ప్రభుత్వ పథకాల లిస్ట్ ఇప్పుడు ap.gov.in లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలతో కూడిన AP YSR government schemes list 2021 ను చెక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా, నవరత్నాలలో వాగ్దానం చేసిన అన్ని పథకాలను అమలు చేస్తున్నది . ఇందుకోసం AP బడ్జెట్ 2020-21 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి సిఎం జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలలో ప్రకటించిన విధంగా వివిధ సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపులు చేశారు.
AP Navaratnalu list in telugu :వైయస్సార్ నవరత్నాలు
రైతులు, విద్యార్థులు, తల్లులు, వృద్ధాప్య వ్యక్తులు, ఆటో వాలాస్, లబ్ధిదారులకు, చేనేత సంఘం, మత్స్యకారుల సంఘం, OC, BC, SC,ST సమాజంలో మంచి జీవనం కోసం మైనారిటీలు మరియు ఇతరులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అవసరం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో , ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన నవశకం లో ఒక భాగమే నవరత్నాలు. నవరత్నాలు కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, సమాజంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్ర ప్రజలు ఆనందమైన జీవితం గడపడం.
Navaratnalu login process | navaratnalu.ap.gov.in లాగిన్ విధానం
- నవరత్నాలు వెబ్ సైట్ లాగిన్ అవ్వడానికి మీరు ఇంటర్నెట్ సహాయంతో “http://navaratnalu.ap.gov.in/” వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి.
- వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీ లో మీరు “ login ” option ను search చేసి, దానిమీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద, “యూజర్ ఐడి”, “పాస్‌వర్డ్” మరియు “క్యాప్చా కోడ్” లను ఎంటర్ చేయాల్సిన కొత్త వెబ్ పేజీ స్క్రీన్ మీద చూపిస్తుంది.
- లాగిన్ కోసం, “కాప్చా కోడ్” పక్కన ఇచ్చిన “login” option ను క్లిక్ చేయండి.
Ysr Navaratnalu Scheme List In Telugu 2021 | వైయస్సార్ నవరత్నాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన తొమ్మిది నవరత్న సంక్షేమ పథకాలు గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలియజేస్తున్నాను. కంప్లీట్ లిస్ట్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి.
AP Navaratnalu pdf Download Link
1). వైఎస్సార్ రైతు భరోసా
2). ఫీజు రీయింబర్స్మెంట్
3). వైయస్సార్ ఆరోగ్యశ్రీ
4). జలయజ్ఞం
5). మద్యపాన నిషేధం
6). అమ్మ ఒడి
7). వైయస్సార్ ఆసరా
8). పేదలకు ఇల్లు
9). పెన్షన్ల మొత్తం పెంపు
ఈరోజు ఈ ఆర్టికల్ లో ఈ తొమ్మిది రకాల నవరత్నాలు గురించి ఒక్కొక్కటి వివరిస్తాను.
1. వైయస్ఆర్ రైతు భరోసా | ysr rythu bharosa – Navaratnalu list
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో రైతులకు పెద్ద పీట వేసింది. రైతులకు రూ .50 వేల ఆర్థిక సహాయం అందిస్తామని వైఎస్‌ఆర్‌సిపి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే, ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ 12,500 ఇవ్వబడుతుంది.
అదనంగా సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేసింది. మరియు రైతులు తమ పొలాల్లో ఉచితం గా బోర్ వేసుకునే సదుపాయం కల్పించింది. వీటన్నింటితో పాటు, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసింది.
2. ఫీజు రీయింబర్స్మెంట్ :-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన వెంటనే, సమగ్ర ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అందించాలని ఏర్పాట్లు చేసింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాశశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లో భాగంగా, ప్రతి విద్యార్థికి రూ .20,000 ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.
3. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం :-
నవరత్నాలు లో భాగంగా, ఈ వైయస్సార్ ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ .1,000 పైన ఖర్చు ఉన్న అన్ని రకాల వైద్య చికిత్సలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా వర్తిస్తుంది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ఆసుపత్రి ఉన్న ప్రదేశంలో, అన్ని వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది.
4. జలయజ్ఞం :-
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని నవరత్నాలలో చేర్చడం జరిగింది. ఈ జలయజ్ఞం పథకం కింద లక్షలాది కుటుంబాలకు నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ జలయజ్ఞం పథకం లో భాగంగా నే, రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన ప్రాజెక్టులను త్వరిత గతిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసమే యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చురుకుగా చేపడుతున్నారు.
5. మద్యపాన నిషేధం :-
2019 ఎన్నికల ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి జరిపిన ప్రజా సంకల్ప యాత్ర లో రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరికీ మద్యపాన నిషేధం గురించి హామీ ఇవ్వడం జరిగింది. దీనికోసం మూడు దశల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించనున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి తగిన ఏర్పాట్లు అమలు జరుపుతూ ఉన్నది.
6. అమ్మ ఒడి :-
పాఠశాలకు వెళ్లి, చదువుకునే పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో (వై.ఎస్.ఆర్.సి.పి) YSRCP రూ15,000 రూపాయలు పిల్లలను పాఠశాలకు పంపే తల్లులందరికీ, వారి బ్యాంకు ఖాతాల్లో కి ప్రతి సంవత్సరం జమ చేస్తుంది. మీ అమ్మ ఒడి పథకం పరోక్షంగా అక్షరాస్యత అభివృద్ధిలో భాగం కానున్నది.
7. వైయస్ఆర్ ఆసరా :-
రాష్ట్రంలో ఉన్న ప్రతి డ్వాక్రా మహిళలకు ఆసరా కల్పించడం కోసం ఈ వైయస్సార్ ఆసరా పథకం అమలు జరుగుతుంది. ఈ వైయస్సార్ ఆసరా పథకం లో లో మహిళల డ్వాక్రా సంఘాలు మరియు సహకార సంఘాలకు సంబంధించిన అన్ని రకాల రుణాలు మాఫీ చేయబడతాయి. దీనితో పాటుగా అదనంగా, సున్నా-వడ్డీ రుణాలు కూడా అంద చేయబడతాయి.
ఇందులోనే వైయస్ఆర్ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనారిటీ వర్గాల మహిళలు, 45 ఏళ్లు పైబడిన వారు అందరికీ మద్దతు ఇవ్వాలని వైయస్సార్ సిపి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తున్నది.
8. పేదలందరికి ఇల్లు :-
రాష్ట్రంలోని బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఐదేళ్లలో పేదలకు 25 లక్షల గృహాలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం కింద ఇంటి స్థలం మంజూరు చేసి , ఇంటి నిర్మాణం బాధ్యత కూడా ప్రభుత్వమే చేపడుతుంది.
9. Navaratnalu : పెన్షన్ల పెంపు | Ysr Pension Kanuka
పెన్షన్లకు 65 సంవత్సరాల అర్హత వయస్సు ప్రమాణాల లో మార్పులు చేస్తూ, 60 సంవత్సరాలకు తగ్గించబడినది. వృద్ధాప్య పింఛన్లు లో భాగంగా, 60 ఏళ్లు పైబడిన వారికి రూ .2,250 ఇస్తుండగా , శారీరకంగా వికలాంగులకు ₹ 3000 పెన్షన్ ఇస్తారు.
YSR navaratnalu helpline number | ysr navaratnalu Toll Free number
వైయస్సార్ నవరత్నాలు కు సంబంధించి ఎలాంటి సందేహాలు కోసమైనా, ప్రజలు ఫోన్ చేసి తెలుసుకోవడానికి అనుగుణంగా నాలుగు సంఖ్యలతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ షార్ట్ కోడ్ టోల్ ఫ్రీ నెంబర్ 1902 ను నవరత్నాలు హెల్ప్‌లైన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.
ముగింపు
Navaratnalu : AP ప్రభుత్వ పథకాల యొక్క ప్రాధమిక లక్ష్యం ఏమనగా, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం. అధిక-నాణ్యత విద్య మరియు ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలలో ఉత్పాదకతను పెంపొందించడం. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటిలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి కల్పన ద్వారా ఇది సాధ్యమవుతుంది.
మొత్తంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తమ రాష్ట్ర ప్రజలకు మంచి పాలనను అందించాలని కోరుకుంటుంది. ఏ ఒక్కరూ కూడా ప్రాథమిక సౌకర్యాలను కోల్పోకూడదు అనే లక్ష్యంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగుతున్నది. ఈ విధమైన పథకాల ద్వారా వారి జీవనోపాధి పద్ధతులను పెంపొందించు కోవచ్చును.
ఈ ఆర్టికల్ లో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడితే, ఇతరులకు షేర్ చేయండి.