గ్యాస్ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి ?

0

గ్యాస్ నొప్పి వలన చాల మంది బాధ పడుతూ ఉంటారు. దాని నివారించడానికి కొన్ని జాగ్రతలు తీసుకోవాలి.

గ్యాస్ నివారణ కోసం కొన్ని మార్గాల గురించి తెలుసు కొందాం :

గ్యాస్  సమస్యలకు జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ జీలకర్రను (Cumin seed) తీసుకుని ఇందులో ఒక స్పూన్ చక్కెర (Sugar) కలుపుకుని నమిలి తినాలి. దీంతో కడుపు నొప్పి సమస్యలను తక్షణమే తగ్గిస్తుంది. మసాలా ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం మంచిది.

భోజనం చేయగానే చాలా మందికి గ్యాస్‌ వస్తుంటుంది. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. గ్యాస్‌ సమస్య తీవ్రంగా ఉంటే ఇలా ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అలాగే కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే సహజసిద్ధంగా గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే.

గ్యాస్ నివారణ 

1. గ్యాస్‌ సమస్యను తగ్గించేందుకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. కొబ్బరినీళ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల కొబ్బరి నీళ్లను తాగుతుంటే గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

2. ఒక టీస్పూన్‌ నిమ్మరసం, ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడాలను తీసుకుని ఒక కప్పు నీటిలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత తాగాలి. దీంతో గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు.

3. పసుపు ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కలిపి రాత్రి పూట తాగాలి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

4. జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించాలి. లేదా భోజనానికి 15 నిమిషాల ముందు అల్లం రసం, తేనెలను కలిపి తీసుకోవాలి. దీంతో గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

5. ఆలుగడ్డలను జ్యూస్‌ చేసి భోజనానికి ముందు తీసుకోవాలి. రోజూ రెండు సార్లు ఇలా తాగితే ఫలితం ఉంటుంది.

6. భోజనం చేశాక 2-3 యాలకుల గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. తరువాత నీటిని తాగాలి. గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.

7. భోజనం చేసిన అనంతరం పుదీనా ఆకులను నేరుగా తినవచ్చు. లేదా పుదీనా డికాషన్‌ తాగవచ్చు. సోంపు గింజల డికాషన్‌ కూడా పనిచేస్తుంది. భోజనం అనంతరం ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేసినా గ్యాస్‌ తగ్గుతుంది.

సమయానికి భోజనం చేయకపోయినా, కారం, మసాలాలు, నూనె పదార్థాలను అధికంగా తిన్నా, తగినంత నీటిని తాగకపోయినా, ఒత్తిడి, ఆందోళనలకు గురైనా గ్యాస్‌ సమస్య వస్తుంది. కనుక ఆయా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు.

నివారణ చర్యలు :

 

  • సరైన వేళకు ఆహారం తీసుకోవడం.
  • నీరు ఎక్కువగా త్రాగండి.
  • వ్యాయామం చెయ్యడం
  • వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడాలి.

మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్‌, టీ, కాఫీలు మానివేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్ళు తినడం మానేయాలి. కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే ఆహారపదార్థాలు తింటే కూడా కడుపులో గ్యాస్‌ పెరుగుతుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. జీవనశైలి, జీవనవిధానంలో మార్పు, ఆహార నియమాలు పాటించడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాకింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌, స్కిప్పింగ్‌ లాంటి ఆటలు, క్రీడలలాంటి శారీరకశ్రమతో కూడిన వ్యాయామాలు, కడుపు నిండుగా ఒకేసారి ఆహారం తీసుకోకుండా ఉండటం చేయాలి. మనం రోజువారి తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచిది. తినేదాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించొచ్చు. కార్బొనేటెడ్‌ కూల్‌డ్రిరక్స్‌, చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల కూడా కడుపులో గ్యాస్‌ పెరుగుతుంది.