మాల గోత్రం :- తెలుగు పర్యాయపద నిఘంటువు మాల అనే కులం మల్ల అనే పదం నుండి వచ్చింది. మాల వారు అన్ని ప్రాంతాలలో ఉన్నారు. మాల వారిని ప్రభుత్వం తక్కువ అధికం ఉన్నవారిగా గుర్తించి వీరికి వివిధ రంగాల్లో స్థానం కల్పించినది. మాల గోత్రం కూడా వివిధ రకాల గోత్రాలు ఇంటి పేర్లు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.
గోత్రం అంటే ఏమిటి ? | Gothram in Telugu
గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.
హిందువులు అయితే ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.
మాల కుల గోత్రాలు మరియు ఇంటిపేర్లు | Mala Gothram List In Telugu
- కంఠ గోత్రం :- శరీరానికి కంఠం ఎలాగో వీరు మాల కులానికి అలాంటివారు. ఈ గోత్రం ఇప్పుడు అంతరించిపోయింది. అలాగే ఇంటి పేర్లు కూడా కనుమరుగు అయిపోయాయి.
- సరిండ్ల గోత్రం :- బూరి, బల్లెం, బత్తుల, బొమ్మిడి, చల్లా, చింతల, డబ్బు, గాలి, కర్ణ, కాకి, కాండ్రు, ముడి, మద్దిలి, మల్లెల, పుట్టా, పాముల, పగిడి, సమ్మెట, ఉయ్యాల.
- సావు గోత్రం :- యుద్ధాల్లో పాల్గొనే వారికి ఈ గోత్రం కేటాయించారు. ఈ గోత్రం కూడా పూర్తిగా అంతరించిపోయింది. కానీ కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ నివసిస్తున్నరు వీరి ఇంటిపేర్లు జంగం.
- సైండ్ల గోత్రం:- నేతకాని వ్యవస్థకు ఏర్పాటు చేయబడిన గోత్రం.
- దైండ్ల గోత్రం :- దాసరి, గంజి, దొడ్డి, కొమ్ముల, యెడ్ల, మర్రి, పాల, పోవాకు, పరిసే, తుమ్మల, తుమ్మ.
- రెడ్డి భూములు గోత్రం :- అవుక, బండి, బొమ్మల, బొల్లెద్దు, బెజ్జం, తోట, దక్కు, దిండ్ల, దోమా, గేరా, కైలా, కటిక, నత్తల, పైడి, పిల్లి, రాయి, సముద్రాల, శీలం, తండా.
- పాకనాటి గోత్రం :- అల్లం, దారా, గడి, గుర్రం, మగ్గం, మైలారి, పర్వత, పిండి, పస్సల.
- మురికినాటి, ఆరవ గోత్రం :- ఆరవ అంటే విదేశీ లేదా బయట వారు అనినార్థం. ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా ప్రాంతాల మాల సంబంధ కులాలకు ఇచ్చిన గోత్రం.
ఈ కులానికి చెందిన వారు వేరు వేరు ప్రాంతాలకి వలస వెళ్లి, ఆ ప్రాంతంలో ఉన్న మాల కులానికి ఏ గోత్రం ఉన్నదో ఆ గోత్రమే వీరు కూడా పెట్టుకోoటారు. ఇలా చాల మంది తమ గోత్రాలను మార్చుకోవడం జరుగుతుంది.
గమనిక :- పైన ఇచ్చిన సమాచారం కేవలం మీకు అవగాహనా కోసమే, ఇందులో ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు. ఈ Matter మీద సందేశం ఉంటె కామెంట్ పెట్టండి తప్పకుండ రిప్లై ఇస్తాం.
ఇవి కూడా చదవండి :-