వరలక్ష్మి వ్రతం ఇలా చేస్తే జన్మ జన్మల పుణ్యం వస్తుంది !

0
వరలక్ష్మి వ్రతం పూజా విధానం

వరలక్ష్మి వ్రతం పూజా విధానం | Varalakshmi Vratham Puja Ela Chestaru  

వరలక్ష్మి వ్రతం పూజా విధానం :- శ్రవణ మాసం మొదలు అయినప్పటి నుండి ప్రతి రోజు ఆడవాళ్ళూ ఏదో ఒక పూజ చేయడం జరుగుతుంది. శ్రవణ మాసంలో రెండో వారంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఈ వ్రతాన్ని ఏంతో భక్తిశ్రద్ధలతో చేయాలి.

వరలక్ష్మి వ్రతం ఎవరికీ తెలిసిన విధంగా వారు జరుపుకొంటారు. అలాగే ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుపుకొంటారు. ఈ వ్రతం చేసుకోవాలి అనుకొంటే, వారం ముందే ఇంటిని అంత శుభ్రం చేసుకొని ఏంతో భక్తిశ్రద్ధలతో వ్రతం పూర్తి అయ్యేంత వరకు ఉండాలి.

ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం.

వ్రతానికి అవసరమైన పూజ వస్తువులు 

 1. కుంకుమ ఒక ప్యాకెట్
 2. పసుపు ఒక ప్యాకెట్
 3. ఒక డబ్బ గంధం
 4. గులాబీలు, తెల్ల, పసుపు రంగు చామంతులు, సుగంధారాలు, చెండుపూలు, మల్లెపూలు,తామర పుష్పం, బ్రంహ కమలం, కనకంరాలు, లిల్లీ పూలు మొదలైనవి.
 5. పూల దండలు – 3
 6. తమల పాకులు – కట్ట
 7. వక్కలు  100 గ్రాముల
 8. ఖర్జూరములు 50 గ్రాములు
 9. అగరవత్తులు ఒక ప్యాకెట్
 10. కర్పూరము ఒక ప్యాకెట్
 11. 50 రూపాయి నాణాలు
 12. ఒకటి వైట్ టవల్
 13. జాకెట్ పిసెస్ మీకు ఎన్ని అవసరం అయితే అని తీసుకోండి
 14. మామిడి ఆకులు
 15. డజన్ అరటిపండ్లు, యాపిల్, ఆరెంజ్, ద్రాక్ష, పైన్ యాపిల్. మీకు నచ్చిన ఐదు పండుల్లు పెట్టుకోవచ్చు
 16. అమ్మవారి ఫోటో లేదా బొమ్మ
 17. చీరా
 18. కలశం
 19. కొబ్బరి కాయలు
 20. తెల్లదారము
 21. పసుపు రాసిన కంకణం
 22.  స్వీట్లు బాక్స్ మూడు
 23.  బియ్యం 2 కిలోలు
 24. పంచామృతనికి కావాల్సిన పదార్థాలు
 25. ఆవుపాలు
 26. దీపాలు
 27. గంట
 28. హారతి ప్లేటు
 29. స్పూన్స్
 30. ఆవు నెయ్యి
 31. బియ్యంతో తయారు చేసిన పిండి వంటకాలు.

ఇంకా మీకు కావాల్సిన వస్తువులు పూజలో పెటుకోవచ్చు.

వరలక్ష్మి వ్రతం పూజా విధానం

ఇంటిలో వరలక్ష్మి వ్రతం చేయాలి అనుకొన్న వాళ్ళు ఉదయాన్నే లేచి ఇంటిని అంత శుభ్రం చేసుకొని, తల స్నానం చేయాలి. మీ ఇంటిలో అమ్మవారికి ఏ చోట పూజ చేయాలి అనుకొంటే అక్కడ కొన్ని నీరు పోసి అందులోకి పసుపు వేసుకొని కొద్దిగా అలకాలి.

అలికిన ప్రదేశంలో ముగ్గు వేయాలి. తర్వాత అదే ప్రాంతంలో ఒక పిటా పెట్టి దాని మీద కూడా పసుపుతో రాయాలి. పూలు వెయ్యాలి. వేసినాక మీ వద్ద ఫొటో ఉంటె ఫొటో పెట్టుకోవచ్చు లేదా బొమ్మను కూడా పెట్టుకోవచ్చు.

మీరు ఏది పెట్టాలని అనుకొంటే బొమ్మని శుభ్రంగా తుడిచి, పసుపుతో అంత రాసి, బొట్టు పెట్టాలి. పెట్టినక పిటా మీదకు తెల్లని టువాల్ మీదకు పసుపు, కుంకుమ కొద్దిగా వేసి అమ్మవారిని కుర్చోపెట్టాలి.

అమ్మవారిని పెట్టిన తర్వాత వరలక్ష్మి దేవికి మీరు తెచ్చిన పూలతోటి అందంగా అలంకరించాలి, అలాగే మీ వద్ద ఉపయోగించని నగలు, జడ  ఉంటె అమ్మవారికి వేయాలి, జడ పెట్టి పూలతోటి అందంగా అలంకరించాలి.

ఒక కలశం తీసుకొని అందులోకి నీరు పోసి, అందులోకి నాణాలు కొన్ని వేసి, దాని మీదకు ఒక కొబ్బరి కాయ పెట్టి గంధం పూసి, కుంకుమతో బొట్టు పెట్టాలి, కలశం చుట్టురా తమలపాకులు పేర్చాలి, తమలపాకులకి కూడా గంధంతో బొట్టులు పెట్టాలి.

కలశం అంత సిద్ధం అయిన తర్వాత కలశం కింద కొన్ని పసుపు నీరు పోసి దాని మీదకు బియ్యం పోసి బియ్యం మీదకు కూడా పసుపు, కుంకుమ వేసి, పూలు వేసి అమ్మవారి ముందుర కలశం అమర్చాలి.

అమ్మవారి కోసం తెచ్చిన గాజులు, చీరా, తమలపాకులు, వక్కలు, ఖర్జూరములు, అగరవత్తులు, కర్పూరము, దీపాలు మొదలైన వస్తువులు అన్ని దేవి ముందుర పెట్టాలి. తర్వాత మామిడి ఆకులతో ఇంటిలో ఉండే ప్రతి గడపకి మామిడి తోరణం కట్టాలి. ఒకటి అమ్మవారి ముందుర ఒక తోరణం పెట్టాలి.

ఇంటిలో చేసిన పిండి వంటకాలు ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, స్వీట్స్, పండ్లు, పూలు మొదలైనవి అన్ని అమ్మవారి ముందుర పెట్టాలి.

అమ్మవారిని అలంకారం చేసిన తర్వాత అమ్మవారి కోసం తెచ్చిన వస్తువులు ముందుర పెట్టాలి. అమ్మవారికి పులా దండ వేసి, ఐదు రకాల పూలు పెట్టి, నైవేద్యం పెట్టి, అమ్మరి ముందుర దీపాలు పెట్టి అందులోకి ఆవుతో చేసిన నెయ్యి పోసి దీపాలు వెలిగించాలి.

దీపాలు వెలిగించి, ఒక హారతి ప్లేట్ తీసుకొని అందులోకి కర్పూరం వేసుకొని అమ్మవారికి గంట తిప్పుతూ హారతిని ఇవ్వాలి, అగరవత్తులతో దేవిని పూజించాలి. అలాగే పసుపు ముద్ద చేసి అమ్మవారి ముందుర పెట్టాలి, ఆ పసుపు ముద్దను గణపతిగా పుజిస్తారు.

గణపతికి కూడా పూజలు చేస్తారు. చివరిగా ఇంటిలో ఉండే కుటుంబ సభ్యులు అమ్మవారిని నమస్కరం చేసుకొని చివరిలో అందరు ప్రసాదం  తీసుకొంటారు.

వరలక్ష్మి వ్రతం రోజున అనగా ఉదయం లేదా సాయంత్రం పూట అందరి ఇంటికి 9 లేదా 5 మంది ముతైదులు వస్తారు, వారికి గాజులు, తమలపాకులు, వక్కలు, జాకిట్, స్వీట్ ఇస్తారు. ఇలా ఇవ్వడం వలన అందరికి మంచి జరుగుతుంది అని నమ్మకం.

కంకణం ఎలా తయారుచేసుకోవాలి ?

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అనగా ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకోవాలి.

పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకొనే విధానం.

వినాయక పూజ ఎలా చేయాలి ?

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి,

పూజాం కరష్యే వక్రతుండ మహాకాయ,

కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం,

కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా,

ఆగచ్చ వరసిద్ధ వినాయక,

అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ,

నమస్తే గణనాయ. అంటూ శ్లోకం చదివి గణపతిపై అక్షతలు చల్లాలి.

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి శ్లోకం 

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః.

వరలక్ష్మి వ్రత కథ

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. ఓ మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆవ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి.

స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం.

ఈ వ్రతం శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పమని కోరింది. కాత్యాయనీ పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది.

ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

గమనిక : పైన పేర్కొన్న వరలక్ష్మి వ్రతం గురించి మాకి అందిన ఇంటర్నెట్ సమాచారం ద్వారా మీకు తెలియచేసాo. ఇదీ కేవలం మీకు అవగాహనా కోసమే అందచేసాo. ఈ వ్రతం మీద ఎలాంటి సందేశాలు ఉన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండ రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-