మగవారిపై బల్లి పడితే ఏమ చేయాలో మీకు తెలుసా ?

0
Balli sastram in telugu for male 2021
Balli sastram in telugu for male 2021

మగవాళ్ల శరీరంలో ఏ భాగంలో బల్లి పడితే ఏమవుతుంది ??

Balli sastram in telugu for male : బల్లి, పిల్లి, కుక్క ఇలా మన చుట్టూ ఉన్న జీవులతో మనకున్న అటాచ్మెంట్ ఈనాటిది కాదు. వీటితో ముడిపడిన మన నమ్మకాలు ఈ నాటివి కాదు.

ముఖ్యంగా బల్లి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అవి పొరపాటునో, గ్రహాపాటునో మీద పడుతూ ఉంటాయి. మగవాళ్ల శరీరం మీద బల్లి పడితే కలిగే మంచి, చెడులు ఏమిటో తెలుసుకోండి మరి.

Balli sastram for male in telugu : మగవారిపై బల్లి పడితే ఎం జరుగుతుంది ?

balli sastram in telugu for male 2021
Balli sastram in telugu for male 2021

◆ మగవాళ్లకు తలమీద బల్లి పడితే గొడవలు జరుగుతాయట. స్నేహితులతోనో, లేక పనిచేసే సంస్థలలోనో విభేదాలు వచ్చి లేక ఇతర కారణాల వల్ల  గొడవలు జరుగుతాయని బల్లి శాస్త్రం చెబుతోంది.

◆ ముఖం మీద బల్లి పడితే అసలు ఫీలవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ధనలక్ష్మి మీకోసం పరుగులు పెడుతూ వస్తుందట. వ్యాపారస్తులకు మంచి లాభాలు చేకూరుతాయని కూడా ఉవాచ.

◆ బల్లి కుడి కన్ను మీద పడినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు లేదా వ్యాపారాలు ప్రారంభించకపోవడం ఉత్తమం. ఎందుకంటే అపజయాన్ని చవి చూస్తారని బల్లి శాస్త్రం చెబుతోంది మరి.

◆ నుదురు మీద బల్లి పడితే బంధువులతో గొడవలు జరిగి శత్రుత్వం ఏర్పడుతుందట. అందుకే అలాంటి సందర్భాలలో అంటీ ముట్టనట్టు అందరితో మసలుకోవడం మంచిది.

◆ చేతి వేళ్ళ మీద బల్లి పడితే సంతోషమే మరి. స్నేహితులు కలవడానికి వస్తారట. బాల్య స్నేహితులు కావచ్చు ఆత్మీయ స్నేహితులు కావచ్చు జీవితాల్లో స్నేహితుల పాత్ర చాలా గొప్పది అందుకే సంతోషపడాల్సిన విషయమిది.

◆ఎడమ భుజం మీద బల్లి పడితే చాలా జాగ్రత్తగా ఉండమని పండితుల మాట. ఆ స్థానంలో బల్లి పడటం ఏదో అవమానం జరగడానికి సంకేతమని చెబుతున్నారు. 

◆ కుడి పాదం మీద బల్లి పడితే ఎలాంటి భయాలు అక్కర్లేకుండా హాయిగా ఉండచ్చట. ఎందుకంటే కుడిపాదం మీద బల్లిపడితే సంతోషం వెంట వస్తుందని ఎలాంటి దిగులు, భయాలు లేకుండా సుఖంగా ఉంటారని అర్థమట.

◆ పాదాల వెనుక బల్లి పడితే మాత్రం బట్టలు సర్దాల్సిందే. అవును మరి పాదాల వెనుక బల్లి పడితే ప్రయాణాలు చేయడం ఖాయమని అందుకు సిద్ధమైపొండని చెప్పకనే చెప్పినట్టు కదా మరి.

◆ కాలి వేళ్ళ మీద బల్లి పడితే జేబు ఖాళీ అవ్వడం, జిడ్డు వదలడం ఖాయం అంటున్నారు.  ప్రమాదకరమైన జబ్బులు వచ్చి అనారోగ్యం పాలయ్యే సంఘటనలు జరుగుతాయట.

◆ రెండు పెదవులపై బల్లి పడితే మరణం నీడలా వెంటాడుతుందని, అది ప్రాణ ప్రమాదమైన సంకేతమని చెబుతున్నారు. 

అయితే చెడు కలిగే ఏ స్థానాల్లో బల్లి పడినా బెంగ పడకుండా, ఎలాంటి తడబాటు లేకుండా మొదటగా స్నానం చేసి, ఆ తరువాత ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఒకవేళ కుదిరితే దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటే చాలా వరకు మనసు కుదుట పడి, సమస్య ఏదైనా ఎదురైతే అధిగమించే శక్తి వస్తుంది.

ఇది కూడా చదవండి :- బల్లి శరీరంపై పడితే ఏమవుతుంది ?? బలిశాస్త్రం ఏమి చెబుతోంది ??