Ala Vaikunta Puram lo review telugu-బొమ్మ సూపర్ హిట్టు అంతే !

1

ala vaikunta puram review

ala vaikunta puram కథేంటి ?

మురళి శర్మ ఈ సినిమాలో పోషించిన పాత్ర ఇప్పటికీ నిలిచి పోయేలా ఉంది. వాల్మీకి( మురళి శర్మ) ఒక మధ్యతరగతి వ్యక్తి. తన జీవితంలో మధ్యతరగతి సమస్యలతో విసుగు చెంది ఉంటాడు. కానీ తన ఫ్రెండు ఒక ధనవంతురాలు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని ఓవర్నైట్ రీచ్ అవుతాడు. వీరిద్దరికీ ఒకే సమయంలో పిల్లలు పుడతారు, అయితే ఇక్కడే వాల్మీకి తెలివిగా పిల్లలను మార్చేస్తాడు. ఇక బంటు( Allu Arjun ) మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాల్మీకి వద్దనే పెరుగుతాడు, అలాగే రాజ్( సుశాంత్) రిచ్ ఫ్యామిలీ లో ఉంటాడు. దాని తరువాత వీళ్ళిద్దరి వద్ద విధి ఎలా చేంజ్ తెచ్చిందో అనేదే మిగతా కథ.

Allu Arjun నటన ఎలా ఉంది ?

అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పుకోవాల్సింది ఏదీ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా చూసిన ప్రతి సారీ మనం ఏదో ఒక వైవిధ్యతను గమనించవచ్చు. అలాగే అల వైకుంఠపురం లో కూడా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మొత్తం సినిమాని తన భుజస్కంధాల మీద మోసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలలో స్టోరీ మొత్తం ముందే తెలిసిపోతుంది. అలాగే ఈ సినిమాలో కూడా మొదట్లోనే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుంది. అయినప్పటికీ అల్లు అర్జున్ మంచి కామెడీ టైమింగ్, రొమాన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లతో అలరించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అల వైకుంఠపురం సినిమా మొత్తానికి అల్లు అర్జున్ పర్ఫామెన్స్ హైలైట్ గా చెప్పుకోవచ్చు.

త్రివిక్రమ్ శ్రివివాస్ దర్శకత్వం ఎలా ఉంది ?

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం గురించి కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనలో ఇంతకు ముందు ఉన్నటువంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులు, కామెడీ ట్రాక్ అలాగే హీరో ఎలివేషన్ వంటి చాలా విషయాల్లో వెనుక పడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే అల వైకుంఠపురం లో కథనం విషయంలో త్రివిక్రమ్ గారు కొత్తగా చేసిందేమీ లేదు. తన పదునైన సంభాషణలతో సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సినిమాని ఒక బోరింగ్ కామెడీ మరియు యాక్షన్ డ్రామా అని చెప్పలేము, అలాగే చాలా గొప్ప సినిమా అని కూడా చెప్పలేము. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు సాధారణ ప్రేక్షకుడు కూడా ఎంటర్టయిన్ చేయబడతారు. సో ఎలాంటి సందేహం లేకుండా సినిమా కు వెళ్ళండి.

మిగతా పాత్రల నటన ?

ఇక మిగతా పాత్రల గురించి చెప్పుకోవాలంటే పుట్టిన పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ముఖ్య ఆకర్షణ. పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ కచ్చితంగా న్యాయం చేసిందనే చెప్పాలి. ఇక అందరికీ ముఖ్యంగా గుర్తుండిపోయే పాత్ర చేసిన మురళి శర్మ కి అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. రాజ్ పాత్ర చేసిన సుశాంత్ మొత్తం చాలావరకు సైలెంట్ గా ఉంటాడు, అయినప్పటికీ తనదైన ముద్రను వేశాడు. ముఖ్యంగా విలన్ పాత్రలో చేసిన సముద్ర ఖని మరొక మంచి రోల్ ని ఇందులో పోషించాడు.ఇక మిగతా పాత్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ప్లస్ పాయింట్స్

Allu Arjun

పాటలు

ద్వితీయార్ధం

మైనస్ పాయింట్స్

ఊహించగలిగే స్టొరీ

కొంచెం సాగతీత అనిపించే కథనం

చివరగా చెప్పేదేంటి అంటే మన ఫ్యామిలీ తో పాటు అందరు చక్కగా చూసి ఆనందించాల్సి కుటుంబ కథ చిత్రం ఈ ala vaikunta puram lo

ala vaikunta puram review

Rating : 3/5

Note : ఈ సినిమా గురించి నా అభిప్రాయం మాత్రమే చెప్పను. దయచేసి రివ్యూస్ & రాతిన్స్ చూసి సినిమాకు వెళ్ళకండి. ఎవరిని ఉద్దేశించి రాయడం లేదు. సినిమా చూసి ఎలా ఉంది కింద కామెంట్ చేయండి.

1 COMMENT