నేను గాంధీని ఎందుకు చంపానంటే – నాధూరామ్ గాడ్సే

0

why nathuram godse shot gandhi in telugu :

మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే మరియు అతనికి మద్దతిచ్చిన హిందూ అతివాదులు గాంధీ ని ఎందుకు చంపారో అనే విషయాన్ని వాళ్ళు సమర్థించుకుంటారు.

2 ప్రధాన కారణాలు::- (Assassination of Mahatma Gandhi)

ముస్లింలకు ప్రత్యేకమైన దేశాన్ని గాంధీ సమర్థించాడు. ముఖ్యంగా పాకిస్థాన్ ఏర్పాటుకు గాంధీనే ప్రధాన కారణం. పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ దురాక్రమణకు మొదలుపెట్టినప్పుడు గాంధీ ప్రభుత్వం యొక్క మెడలు వంచి పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇప్పించాడు. గాంధీజీ అవలంభించిన బుజ్జగింపు ధోరణి వల్లనే పాకిస్తాన్ ముస్లింల లో దురాక్రమణ పెరిగిపోయింది. చరిత్రలో జరిగిన ఇలాంటి మత ఘర్షణలను పరిశీలిస్తే, ఈ అల్లర్లు ప్రజల్లో ఎలాంటి చిచ్చు పెట్టాయి అనేది మన అందరికీ అర్థమవుతుంది. ఆ రోజుల్లో గాంధీజీ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించేవాడు.

దేశ విభజన ప్రతిపాదన, దానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లు, అవి దారితీసిన ఉద్రిక్తతలు మనందరికీ తెలిసినవే. మత ఘర్షణల ఫలితంగా అనూహ్యమైన రీతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మత ప్రాతిపదికన పాకిస్తాన్ ప్రత్యేక దేశం ఏర్పాటుకు గాంధీ వ్యతిరేకిస్తున్నారని ముస్లింలు భావించగా, ముస్లింల యొక్క వేధింపులపై ప్రతీకారం తీర్చుకునేందుకు గాంధీ తమకు అడ్డుపడుతున్నాడని హిందు తీవ్రవాదులు భావించారు. ఇలాంటి హిందూ తీవ్రవాదుల వర్గానికి చెందిన వ్యక్తే నాథూరామ్ గాడ్సే.

దశాబ్దాల పాటు ఒక క్రమ పద్ధతిలో జరిగిన విష బోధనల ఫలితమే గాంధీజీ హత్య. గాంధీజీ తమ పాలిట ముళ్లచెట్టుగా మారాడని భావించి, కరుడుగట్టిన హిందూ తీవ్రవాదులు ఆయనపై పెంచుకున్న వ్యతిరేకతే క్రమంగా ఫోబియా గా రూపాంతరం చెందింది. 1934 ఆరంభం నుంచి దాదాపు 14 సంవత్సరాల పాటు గాంధీని హత్య చేసేందుకు దాదాపు ఆరు సార్లు విఫల ప్రయత్నాలు జరిగాయి. చివరిగా 1948 సంవత్సరం జనవరి 30వ తేదీ గాడ్సే ఈ పని లో విజయాన్ని పొందాడు.

గతంలో 1934లో ఒకసారి, 1944లో జూలై సెప్టెంబర్ లో రెండు సార్లు, 1946 సెప్టెంబర్లో ఒకసారి, 1948 జనవరి 20న ఒకసారి, గాంధీ హత్యకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులో రెండు ప్రయత్నాల్లో గాడ్సే ప్రమేయం ఉన్నది. 1934, 1944 ,1946లో విఫలమైన ప్రయత్నాల వెనుక దేశ విభజన ప్రతిపాదన పై వ్యతిరేకత పాకిస్థాన్ కు 55 కోట్ల పరిహారం చెల్లింపు పై ఆగ్రహం వంటివి గాంధీ హత్యకు కారణాలు కాదు. వీటికి ముందే గాంధీ హత్యకు కుట్ర జరిగింది. అత్యంత హేయంగా వారు చేసిన ఈ పనిని సమర్థించుకోవడానికి వెంటనే పైన పేర్కొన్న కొన్నింటిని కారణాలను తెలియజేశారు. వీటిని మనం ఇప్పుడే పరిశీలించాము కదా!!

ఈ కుట్రదారులు అందరూ అతితెలివితో తప్పుడు మార్గాన్ని అనుసరించారని ఒక అభిప్రాయం కలుగుతున్నది కదా!!
దేశ విభజన సమయంలో విస్తృత ప్రాంతాలలో “”మీ నాథూరామ్ గాడ్సే వోల్టాయ్”” అనే నాటకం వీరి ఆలోచన ధోరణికి చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు. వీరి ఆలోచన ధోరణి గాంధీ హత్యను మన మనసులో నుంచి చెరిపోయకపోయినట్లు గా ఉన్నదనే విషయం మనకు తెలిసిందే.

కోర్టులో గాంధీ హత్య గురించి గాడ్సే ఇచ్చిన చివరి వాంగ్మూలం ఒకసారి పరిశీలన చేస్తే, గాంధీ హత్య తర్వాత గాడ్సేని అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గాడ్సే 1948 మే 20వ తేదీ మొదలైన విచారణ 1949 ఫిబ్రవరి 10వ తేదీకి ముగిసింది. ఈ విచారణ ప్రక్రియను అంతా ఆనాటి ప్రభుత్వం కెమెరాలో రికార్డు చేసింది విచారణ పూర్తయ్యాక గాడ్సేకు మరణ శిక్ష విధించారు.

దీనిపై అప్పటి పంజాబ్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ గాడ్సేకు అక్కడ సానుకూల పరిస్థితి లభించలేదు. కోర్టు ఇచ్చిన తీర్పుని ఉన్నత న్యాయస్థానం కూడా సమర్థించిందిఇది చివరిగా తన గాంధీ ని ఎందుకు హత్య చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఇలా తెలిపాడు 1949 మే 5వ తేదీన గాడ్సే కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు
గాడ్సే పై న్యాయ విచారణ చేసిన న్యాయమూర్తుల్లో ఒకరైన జె డి కోశ్లా, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరూ గాడ్సే చేసుకున్న అప్పీలు పై నిర్ణయం తీసుకుంటే గాడ్సే నిర్దోషి అని మెజారిటీ తీర్పు ఇచ్చేవారు అని అన్నాడు.

సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను హిందూ మతాన్ని ,హిందూ చరిత్రను, హిందూ సంస్కృతిని నియమనిష్టలతో ఆచరించి గడిపిన ఆరాధిస్తూ అనుసరిస్తూ వచ్చాను. వయసు పెరిగేకొద్దీ ఆలోచనలకు స్వేచ్ఛ పెరిగి పరిపక్వత వచ్చింది. ఈజాలు రాజకీయాలు మతపరమైన మూఢనమ్మకాలు దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు అందుకే అస్పృశ్యతా నివారణ జన్మ ఆధారిత కుల నిర్మూలనకు చాలా చురుగ్గా పని చేశాను. ఆర్ఎస్ఎస్ కు సంబంధించి కుల వ్యతిరేక ఉద్యమంలో చేరి హిందువుల అందరికీ సమాన హక్కులు ఉంటాయని సామాజిక, మతపరమైన హక్కులలో ఎవరు ఎక్కువ, ఈ ఎవరు తక్కువ కారని ప్రచార ఉద్యమంలో పాల్గొన్నాను.

హిందువులు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు వంటి అన్ని కులాల వారితో కలిసి సహపంక్తి భోజనాలలోపాల్గొన్నాను. చాణక్యుడు, రావణుడు, దాదాబాయ్ నౌరోజీ, గోపాలకృష్ణ గోకులే, బాలగంగాధర్ తిలక్ వంటి మహా ప్రముఖులు వ్రాసిన గ్రంధాలు ఎన్నో చదివాను. వీటితోపాటు పురాణ గ్రంథాలు, ఇతిహాసాలు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా వంటి దేశాల చరిత్రలను అధ్యయనం చేశాను. అదేవిధంగా సోషలిజం, మార్క్సిజం వంటి విధానాలు కూడా అధ్యయనం చేశాను.

అయితే వీటన్నింటికన్నా వీరసావర్కర్, గాంధీజీ చేసిన ప్రసంగాలు రచనలు నా ఆలోచన ధోరణికి చాలా దగ్గరగా కనిపించాయి. గత 30 ఏళ్లుగా భారతీయ ఆలోచనా ధోరణిని, జీవనాన్ని మలచిన ఈ రెండు సిద్ధాంతాలు ఇతర అంశాల కన్నా నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. ఇవన్నీ చదివిన నేను ఒక దేశభక్తుడిగా, ఒక ప్రపంచ పౌరుడిగా హిందూ దేశానికి, హిందూ ప్రజలకు సేవచేయడం నా ప్రథమ కర్తవ్యం అని భావించాను.

దేశంలోని 30 కోట్ల మంది హిందువుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడగలిగి తే యాంత్రికంగా దేశానికి స్వేచ్ఛ లభించడంతో పాటు భారత దేశానికి కూడా ప్రయోజనకరమని భావించాను. ఈ భావన నన్ను నిజంగానే హిందూ సిద్ధాంతాలవైపు, కార్యక్రమాల వైపు నడిపించింది.  నా మాతృభూమి హిందుస్థాన్ కు స్వాతంత్రాన్ని లభించేలా పరిరక్షించుకోగలిగితే నేను ఈ యుద్ధంలో గెలిచినట్లేయని విశ్వసించాను.


ఇదే మానవాళికి, భరతమాతకు అందించే నిజమైన సేవ అని నేను విశ్వసించాను. లోకమాన్య తిలక్ అస్తమించిన 1929 నాటి నుంచి కాంగ్రెస్ పార్టీపై గాంధీజీ యొక్క అజమాయిషీ పెరుగుతూ ఆయన్ను పార్టీకి అధినేతగా చేసింది. ప్రజలను చైతన్య పరచడానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా సత్యం, అహింస అనే నినాదాలతో అతనిని దేశానికి ఒక శక్తివంతమైన నాయకుడిగా చేశాయి, అయితే వీటి పట్ల ఏ ఒక్కరూ కూడా ఆసక్తి చూపలేదు.

వాస్తవంగా ఇందులో కొత్త ఏమీ లేదు. ఇవి ప్రతి ప్రజా ఉద్యమం లోనూ కనిపిస్తాయి. వీటిని తమ దైనందిన జీవితం లో ఎవ్వరు కూడా అనుసరిస్తారని భావించలేము, అలా భావించడం కేవలం మన ఊహ మరియు కలగానే మిగిలిపోతుంది. అంతే కానీ వాస్తవ రూపం ధరించలేదు. వాస్తవానికి నిజాయితీ మరియు కర్తవ్య పాలన అనేవి కేవలం వ్యక్తిగతమైనవి మాత్రమే! మన చుట్టూ ఉన్న పరిస్థితులే అహింసను దూరం చేసి బల ప్రయోగాన్ని ప్రేరేపిస్తాయి.

దురాక్రమణ లపై సాయుధ ప్రతిఘటన అన్యాయమని నేను ఎన్నడూ భావించలేదు. ఇంకా చెప్పాలంటే ఇది మన నైతిక బాధ్యత. శత్రువులు బలప్రదర్శనకు దిగినప్పుడు సాయుధ ప్రతిఘటనలు తప్పనిసరి. రామాయణంలో సీత కు విముక్తి కలిగించే సమయంలో రాముడు రావణాసురుని వధించాడు.మహాభారతంలో కంసుని లో ఉన్న రాక్షసత్వానికి తెరదించేందుకు ఆ కంసుని కృష్ణుడు వధించాడు.

ఇక మహాభారత యుద్ధంలో అర్జునుడు ఆత్మీయులు, మిత్రులు అనేకమందిని వధించాడు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన భీష్మపితామహుడు దుర్మార్గం వైపు నిలిచి ఉన్నందునే అర్జునుడి చేతిలో మరణించాడు. ఈ హింస విషయంలో రాముడు, కృష్ణుడు, అర్జునుడు వంటి వారు కూడా అతీతులు కారు.


కానీ మహాత్ముడు మాత్రం మానవ చర్యల తో తన భావోద్వేగాలను నిర్లక్ష్యం చేసి హిందువులకు ద్రోహం చేశాడని నా అభిప్రాయం. ఇటీవల చరిత్రను గమనిస్తే ముస్లింల రాజ్యాన్ని కూలదోసినది ఛత్రపతి శివాజీ వీరోచిత పోరాటం అని చెప్పక తప్పదు. అఫ్జల్ ఖాన్ వంటి దురాక్రమణ దారుల ను చంపకపోతే శివాజీ వంటి నాయకులకు ప్రాణాలకు ముప్పు వచ్చేది.
శివాజీ, రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ లాంటి నాయకులను దారితప్పిన వ్యక్తులుగా చెప్పడం ద్వారా గాంధీజీ తన స్వార్థం ప్ర దర్శించుకున్నాడు.

సత్యం, అహింస అనే పేర్లతో భారత దేశానికి ఎంతో ప్రమాదకరమైన ఉత్పాతాలను తీసుకువచ్చిన గాంధీ హింసాత్మకమైన అహింసావాది! సత్యం పేరు చెప్పే అహింసావాది! రాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, శివాజీ లాంటి గొప్ప వ్యక్తులు స్వేచ్ఛ స్వతంత్ర భావాలను దేశానికి అందించిన వారిగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు. 32 సంవత్సరాలుగా నాలో పెరుగుతున్న ఈ కసి గాంధీ చివర్లో ముస్లింలకు అనుకూలంగా చేసిన ఆమరణ నిరాహార దీక్షతో పెరిగిపోయింది.

నా కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే గాంధీ జీవితానికి తెరదించాలని అనుకున్నాను. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల ను గట్టిగా సమర్థించి, వారి సంక్షేమ కోసం కృషి చేయడం ద్వారా గాంధీ చాలా మంచి పని చేశాడు.
మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతనిలో ఆత్మస్తైర్యం స్థాయి పెరిగిపోయింది.తాను చేస్తున్న పని తప్పు-ఒప్పు అతనొక్కడే నిర్ణయించుకోవడం ఈ మనస్తత్వం ఉన్న వారి యొక్క లక్షణం.

దేశం ఆయన నాయకత్వాన్ని కోరుకుంటే ఆయన ఖచ్చితత్వాన్ని కూడా ఒప్పుకోవాలి, లేకపోతే ఆయన కాంగ్రెస్ కు దూరంగా తన పనులు తాను చేసుకుని పోయేవాడు. ఇటువంటి ధోరణి గల వ్యక్తిగా సగం సగం నిర్ణయాలు తీసుకోవటం సరికాదు. కాంగ్రెస్ పార్టీ ఆయన ధోరణికి అనుగుణంగా వ్యవహరించాలి లేదా గాంధీ ని వదిలేసి తన సొంత మార్గాన్ని చూసుకోవాలి.తాను తీసుకుంటున్న నిర్ణయానికి, తాను చేయబోతున్న ప్రతి కార్యక్రమానికి తానే కర్త, కర్మ, క్రియ అని గాంధీ భావించేవాడు.

సహాయ నిరాకరణ ఉద్యమంలో ఇతనే సూత్రధారి.అయితే ఈ ఉద్యమం యొక్క సూత్రం ఏమిటో ఎవరికీ తెలియదు! ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాలో ఎప్పుడు విరమించాలో కూడా తెలియదు! ఇది అంతా గాంధీ పైనే ఆధారపడి ఉండేది. ఏదైనా ఉద్యమం కానీ కార్యక్రమం కానీ విజయమైనా, విఫలమైనా, అది తీవ్రమైన దుష్ఫలితాలను ఇచ్చినా, రాజకీయ వ్యతిరేకత ఏర్పడినా కూడా గాంధీ యొక్క ఖచ్చితత్వం లో ఏ మాత్రం మార్పు ఉండేది కాదు.

సత్యాగ్రహి ఎన్నడూ విఫలం కాడు అనేదే ఆయన సూత్రం. ఇంతకు సత్యాగ్రహి అంటే ఏమిటో ఆయనకు తప్ప మరెవ్వరికీ తెలిసేది కాదు! అలా గాంధీ తనకుతానే న్యాయమూర్తిగా వ్యవహరించేవాడు. ఈ పిల్ల చేష్టలు, అతి విశ్వాసమే గాంధీని తిరుగులేని నాయకునిగా చేశాయి. గాంధీజీ యొక్క రాజకీయాలు హేతుబద్ధమైనవి కావు అని ఎంతోమంది విశ్వసించేవారు. అయితే అలాంటి వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగడం లేదా గాంధీ పాదాలకు దాసోహం కావడం జరిగేది. ఇలాంటి బాధ్యతారహితమైన పనుల్లో ఆయన ఒక దాని తర్వాత ఒకటి తప్పు మీద తప్పు చేస్తూనే అపజయాలు మూటకట్టుకునే వాడు.

భారత జాతీయ భాష విషయంలో ముస్లింల పట్ల ఆయన వ్యవహరించిన మొండి వైఖరి మరోసారి నిరూపించింది. భారతదేశంలో తన కెరీర్ ను ప్రారంభించిన తొలి రోజుల్లో గాంధీ హిందీ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు.అయితే ముస్లింలు ఆ భాషను ఇష్టపడటం లేదని తెలుసుకుని ఆ భాషను హిందుస్తానీ భాష గా మార్చేశాడు. హిందూస్థానీ పేరుతో భాష లేదనే విషయం భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు!

దానికి వ్యాకరణం కానీ ఉచ్చారణ కానీ లేనేలేవు, అది కేవలం మాట్లాడే భాష మాత్రమే, దాన్ని రాయలేము. కానీ హిందూస్థానీ భాషను జాతీయ భాషగా మారిస్తే ముస్లింలు మెచ్చుకుంటారని గాంధీ భావన. ఆయన ఈ దిశగా ఒత్తిడి తెచ్చాడు. ఆయన్ని గుట్టుగా అనుసరించేవారు ఆయనకు మద్దతుగా నిలిచి ఆ భాష ను ఉపయోగించడం ప్రారంభించారు.
ఈ విధంగా ముస్లింలను సంతోషపెట్టడం కోసం ఎంతో స్వచ్ఛత కలిగి, సౌందర్యాన్ని కలిగిన హిందీ భాష ను బజారున పడేసాడు.

గాంధీ ఎన్ని ప్రయోగాలు చేసినా అవన్నీ హిందువులపై చేసిన ప్రభావమేనని స్పష్టంగా చెప్పవచ్చు. 1946 ఆగస్టు తర్వాత ముస్లింలీగ్ లోని ప్రైవేటు సైన్యం హిందువులను ఊచకోత కోయడం ప్రారంభించాయి. వారిని అణచి వేసేందుకు గాను అప్పటి అధికారంలో ఉన్న వైస్రాయి లార్డ్ వోవెల్ కొంత వెనుకంజ వేశాడు.దీనిపై హిందువుల వ్యతిరేక దాడులతో తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన కరాచి వరకు హిందువుల యొక్క రక్తపుటేరులు పారాయి.

సెప్టెంబర్ లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి ముస్లింలీగ్ వెన్నుపోటు పొడిచింది.ఆ ప్రభుత్వంలో ఉన్న ముస్లిం లీగ్ సభ్యులందరూ ప్రభుత్వానికి అవిధేయంగా ఉంటూ ద్రోహం చేశారు. ఇందులో వారికి గాంధీ ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉండేది.పరిస్థితులను చక్కదిద్ద లేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని భావించి లార్డ్ వోవెల్ తన పదవి నుంచి తప్పుకున్నాడు.

ఆయన స్థానంలో లార్డ్ మౌంట్బాటెన్ వైస్రాయ్ గా వచ్చాడు. అప్పటి వరకు జాతీయ వాదం, సమైక్యవాదం అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కు బాయ్ నెట్ గురి పెట్టడంతో దీనికి లొంగిపోయి పాకిస్థాన్ ఏర్పాటుకు రహస్యంగా అంగీకరించింది. అప్పటి వరకు భారతదేశంలో మూడోవంతు భాగమైన పాకిస్తాన్ మనకు పరాయి దేశం గా 1947 ఆగస్టు 15 తర్వాత పరాయి దేశం గా మారిపోయింది.

అప్పటి వరకు పనిచేసిన వైస్రాయిలలో లార్డ్ మౌంట్బాటెన్ చాలా గొప్పవారు అని కాంగ్రెస్ అతనిని పొగడడం మొదలు పెట్టింది. వాస్తవానికి 1948 జూన్ 30వ తేదీ అధికారం అప్పగించడానికి నిర్ణయించినప్పటికీ లార్డ్ మౌంట్బాటెన్ తన అసంబద్ధమైన సర్జరీతో మూడు ముక్కలైన భారతదేశాన్ని ఆరు నెలల ముందుగానే మనకు అప్పగించడం జరిగింది.
దాదాపు మూడు దశాబ్దాలు పాటు కాంగ్రెస్ పార్టీలో నియంతలా వ్యవహరించిన గాంధీజీ సాధించిన విజయం ఇది ఒక్కటే!!

దీన్నే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం అని, శాంతియుత అధికార బదిలీ అని చెప్పుకున్నది. అప్పటి వరకు రకరకాల మెరుపులు మెరిపించిన హిందూ-ముస్లింల ఐక్యత అనే ఒక పెద్ద బుడగ పగిలిపోయింది. నెహ్రూ మరియు ఆయన స్కందా రావాల సమ్మతితో ఏర్పడిన దేశాన్ని వారు త్యాగాలతో సాధించుకున్న swarajyam అని చెప్పుకున్నారు. మనం దైవంగా భావిం చిన గాంధీ సమ్మతితో కాంగ్రెస్ లోని అగ్రనేతలు అంతా కలిసి దేశాన్ని చీలికలు-పేలికలు గా మార్చారు.

అప్పుడే నాకు గుండె మండిపోయింది కోపం కట్టలు తెంచుకుంది. దేశంలో హిందూ శరణార్థులు తలదాచుకున్న మసీదులను ముస్లింలకు అప్పగించాలని గాంధీ తన ఆమరణ నిరాహార దీక్ష విరమణకు పెట్టిన షరతుల్లో ఇది ఒకటి. పాకిస్తాన్ లో హిందువులపై జరుగుతున్న హింసా చర్యలపై అక్కడి ప్రభుత్వం మరియు సంబంధిత ముస్లిములపై విమర్శలు చేయడానికి కానీ ఆయన నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు.

ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన అప్పుడు పాకిస్థాన్లోని ముస్లింలు పై కనీసం ఒక్క షరతు విధించినా, ఆయన మరణించినప్పుడు అక్కడ ఒక్క ముస్లిం కూడా కనిపించి ఉండేవాడు కాదు!! అందుకోసమే ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ముస్లిములపై ఎటువంటి షరతులు విధించలేదు. తన నిరాహార దీక్షతో జిన్నా మరియు అతనికి సంబంధించిన ముస్లింలీగ్ లోని ముస్లింల పై ఎలాంటి ప్రభావం చూపదని విషయం గాంధీ కి ముందే తెలుసు.

నిజం చెప్పాలంటే వారు ఎవరూ కూడా గాంధీకి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. గాంధీని మనందరం జాతిపిత అని పిలుస్తున్నాం, అదే నిజమైతే దేశవిభజనకు సమ్మతి తెలిపి పెద్ద కుమారుడు వంటి భారతదేశానికి ద్రోహం చేయడం ద్వారా ఆయన తన ధర్మాన్ని నెరవేర్చడంలో ఘోరంగా విఫలం అయ్యాడని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.

పాకిస్తాన్ జాతిపిత గా తనను తాను నిరూపించుకున్నాడు. అంతేగాక ఆయన అంతరాత్మ, ఆధ్యాత్మిక చింతన, అహింసా మార్గాలు అనే విషయాలు ఏవీ కూడా జిన్నా ఉక్కు హృదయం ముందర నీరుగారిపోయాయి. క్లుప్తంగా చెప్పాలంటే నేను జీవితంలో ఇంతలా దిగజారి పోతానని కలలో కూడా ఊహించలేదు. మీరు నా నిజాయితీని కోల్పోయినప్పుడు ప్రజల నుంచి ఎదురయ్యే ద్వేషం నామ మాత్రమే. కాబట్టి గాంధీని చంపగలిగితే అది నా జీవితానికి అత్యుత్తమమైనటువంటి విషయం.

గాంధీ లేకుండా భారత దేశ రాజకీయాల్లో ధీటుగా ప్రతి స్పందించగలరని, మరియు సైనిక దళాలు అత్యంత శక్తివంతమైనవి గా అవుతాయని నేను భావించాను. నా భవిష్యత్తు ధ్వంసమైంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పాకిస్తాన్ కబంధ హస్తాలనుంచి నాదేశం రక్షించబడుతుంది. భారత ప్రజలు అందరూ నన్ను పిచ్చివాడుఅని, మతి లేని వాడు అని భావించినా సరే పటిష్టమైన,స్వచ్ఛమైన భారత జాతి నిర్మాణానికి కారణం నేనే అని విశ్వసిస్తారు అనే నమ్మకం నాకుంది.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నేను తుది నిర్ణయానికి వచ్చాను.

అయితే నేను దీని గురించి ఎవ్వరికీ చెప్పలేదు. 1948 జనవరి 30వ తేదీన బిర్లా మందిర్ ప్రార్థన మందిరం మైదానంలో నా రెండు చేతులకు ధైర్యం తెచ్చుకుని గాంధీజీ పై కాల్పులు జరిపాను. లక్షలాది మంది హిందూ జీవితాలను నాశనం చేసిన వాడిపై కాల్పులు జరపడం సరైన చర్యే అని నేను భావిస్తున్నాను. ఇటువంటి నేరస్తులను శిక్షించేందుకు చట్టపరమైన, న్యాయపరమైన ఎటువంటి వ్యవస్థ లేనందునే, నేనే అతన్ని కాల్చి చంపాను.

దీని పట్ల నాకు ఎటువంటి విచార భావన లేదు. ఈ విధంగా ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాల పట్ల నాకు ఎటువంటి గౌరవం లేదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఇటువంటి విధానాలు అన్నీ పూర్తిగా గాంధీ ఉన్నందున అమలు అయ్యాయి. ప్రధానమంత్రి నెహ్రూ చాలా సందర్భాలలో  తను చేసిన ప్రసంగాలు, కుదుర్చుకున్న ఒప్పందాలు తప్పకుండా మరిచిపోతాడు అని నేను ఘంటాపధంగా చెప్పగలను.

భారతదేశాన్ని లౌకిక దేశం గా చెప్పిన నెహ్రూయే పాకిస్థాన్ ఏర్పాటు పట్ల కీలకమైన పాత్ర పోషించాడని చెప్పవచ్చును.
ముస్లింల పట్ల బుజ్జగింపు ధోరణి అవలంభిస్తున్న గాంధీ పనిని ఆయన మరింత సులభతరం చేశాడు. అందుకే ఇప్పుడు కోర్టు ముందు నిలబడి నా నేరాన్ని సంతోషంగా అంగీకరిస్తున్నాను. న్యాయమూర్తి తనకు సరైంది అన్న అభిప్రాయానికి అనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తాడు.

ఇందులో నేను ఎలాంటి క్షమాభిక్ష కోరలేదు, ఎవరిని క్షమాభిక్ష అడిగే ప్రసక్తే లేదు. నైతికంగా నా చర్య సరైనదేనని నేను నమ్ముతున్నాను. నిజాయితీపరులైన చరిత్రకారులు భవిష్యత్తులో ఏదో ఒక రోజు నా చర్యను సరైనదేనని గుర్తిస్తారనే నమ్మకం నాకు చాలా ఉంది.

పైన పేర్కొన్న విధంగా గాడ్సే అతను గాంధీ ని ఎందుకు చంపాడు అనే అభిప్రాయాలను తెలియ జేశాడు. గాంధీజీ అతను చనిపోతూ చివర్లో హే రామ్ అని అన్నాడు అని కొందరు చెబుతారు కానీ, అలాంటి పదము ఏది అనలేదు అని గాడ్సే చెప్పాడు. కోర్టు విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సే మరియు తనకు సహకరించిన నారాయణ ఆప్టే లను 1949 నవంబర్ 15వ తేదీ హర్యానాలోని అంబాలా జైలులో ఇద్దరిని ఉరితీశారు.

స్వతంత్ర భారతదేశంలో ఉరితీయబడిన మొదటి వ్యక్తిగా గాంధీని చంపిన గాడ్సే చరిత్రలో నిలిచిపోయాడు.