అమెరికా లో కరోనా ఎఫెక్ట్ – కోటి దాటిన నిరుద్యోగులు

0

ప్రపంచ వ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తున్న భయంకరమైన కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటివరకు అమెరికా లో 464865పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు మొత్తం 16498 మంది చనిపోయారు. ఇక 25343 మంది కోలుకున్నారు.

నిరుద్యోగుల పుట్ట:-
ప్రపంచ దేశాల్లో అగ్ర రాజ్యం ఐన అమెరికా లో ఒక వైపు కరోనా వైరస్ మరో వైపు నిరుద్యోగం విలయ తాండవం చేస్తున్నాయి. అమెరికా లో ఉద్యోగాలు లేక గడిచిన 3 వారాల్లో 1కోటి 66 లక్షల మంది నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరుతూ అప్లై చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఎంత దారుణం గా ఉందో ఊహించవచ్చు. 1948 తర్వాత అక్కడ ఇలాంటి సంక్షోభం రావటం ఇదే మొదటిసారి. రోజు రోజుకు పెరిగి పోతున్న కరోనా వైరస్ వ్యాప్తి కి ప్రజలు పిట్టలు లాగా రాలిపోతున్నారు.