How to remove cavity from teeth at home in telugu : పుచ్చిపోయిన పళ్ళ లో ఉన్న పురుగులు రాలిపోయి, పుచ్చు పన్ను స్ట్రాంగ్ చేసే నెంబర్ వన్ చిట్కా ఇక్కడ తెలుసుకోండి.
సాధారణంగా పళ్ళ మీద ఉండే ఎనామిల్ పొర చాలా బలమైనది. ఈ ఎనామిల్ పొర గట్టి పదార్థాలు తిన్నా కూడా కరిగిపోదు. ఇంత స్ట్రాంగ్ గా ఉండే ఎనామిల్ పొర దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతూ ఉంటుంది.
ఎనామిల్ ఎంత బలమైనది అంటే దంతాన్ని కొన్ని వందల సంవత్సరాలు భూమిలో పాతిపెట్టినా కూడా దంతం మీద ఎనామిల్ పొర డ్యామేజ్ కాదు. మరి ఇలాంటి ఎనామిల్ పొర డ్యామేజ్ కు కారణాలు తెలుసుకుందాం.
పుచ్చిపోయిన పన్ను కారణాలు / దంత సమస్యలు కారణాలు
- ఎసిటిక్ ఫుడ్ లేదా కెమికల్ ఫుడ్
- కూల్ డ్రింక్స్ మరియు
- సాఫ్ట్ డ్రింక్స్.
దంతాల మీద ఉన్న ఎనామిల్ పొర అతి తక్కువ సమయంలో డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్స్ మరియు కెమికల్ ఫుడ్ అని అనేక పరిశోధనల్లో తేలింది.
కూల్ డ్రింక్స్ యొక్క పీహెచ్ విలువ 2.5 నుండి 3 పాయింట్ 5 వరకు ఉంటుంది. ఇది యాసిడ్ తో సమానమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.
కూల్ డ్రింక్స్ ఎక్కువ రోజులపాటు డబ్బాలలో నిల్వ ఉండడం కోసం ఎసిడిక్ కెమికల్స్ ని అధికశాతంలో కలుపుతారు. ఈ ఎసిడిటీ కెమికల్స్ వల్ల పళ్ల మీద ఉన్న ఎనామిల్ పొర అతి త్వరగా కరిగిపోతుంది.
అతి చల్లగా ఉన్న ఈ కూల్డ్రింక్స్ వల్ల పళ్ళలో ఆ కొద్దిసేపు రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది.
నివారణ :- ఎసిడిక్ ఫుడ్స్ తీసుకోకూడదు. మరియు అతి చల్లని వేడి పదార్థాలు తీసుకోకూడదు.
రెండవ ప్రధాన కారణం వైట్ షుగర్
వైట్ షుగర్ లో ఉండే కెమికల్ కాంపోజిషన్ వల్ల చెడు బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా దంతాలు మీదకు చేరుకుని ఎనామిల్ పొరను గార పట్టేలా చేసి తొందరగా దెబ్బతీస్తాయి. పళ్ళు త్వరగా పుచ్చి పోవడానికి కారణం చక్కెరతో చేసిన స్వీట్స్, చాక్లెట్స్, జామ్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ మరియు కేక్స్.
ప్రధానంగా ఈ బ్యాక్టీరియాలు విడుదల చేసే వ్యర్థ పదార్థాల లో ఎసిడిక్ శాతం అధికంగా ఉండటం వల్ల ఎనామిల్ పొర త్వరగా పాడవుతుంది.
నివారణ:- వీలైనంతవరకూ చక్కెరతో చేసిన పదార్థాలను తీసుకోకూడదు.
మూడవ కారణం కార్బోహైడ్రేట్స్ ఫుడ్
తెల్లటి పిండిపదార్థం తో తయారుచేసిన బేకరీ ఐటమ్స్ వంటివాటిలో ఈ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈ వైట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దంతాలను త్వరగా గార పట్టే విధంగా చేసి ఈ ఎనామిల్ పొరను డేమేజ్ చేసి పళ్ళు పుచ్చిపోయే విధంగా చేస్తాయి.
నివారణ:- పిల్లలకు బేకరీ ఐటమ్స్ తినే అలవాటు మానిపించాలి.
పై విధమైన సూచనలను పాటిస్తూ ఉంటే పుచ్చు పన్ను నుండి పురుగులు తొలగిపోతాయి.
ఇవి కూడా చదవండి :-
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
- ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !