Skin itching home remedies in telugu : మీ శరీరంలో ఏ భాగంలో నైనా వచ్చే దురదలకు ఈ ఆయిల్ సింగిల్ చుక్క వాడండి చాలు!! కొంతమందికి శరీరంలో గజ్జల భాగంలో, చంకల భాగంలో, మరికొంతమందికి రొమ్ము మీద వెంట్రుకలు అధికంగా ఉన్న భాగంలో దురదలు వస్తూ ఉంటాయి.
దురద కారణాలు
1.శరీరంలోని ఈ భాగాలలో చెమట అధికంగా ఉత్పత్తి కావడం వల్ల, గాలిలో ఉండే ఫంగస్ క్రిములు ఇందులో చేరి దురదలు వస్తూ ఉంటాయి.
2. శరీరంలో గాలి దూరని ప్రాంతాలలో ముఖ్యంగా స్త్రీలు చీర కట్టుకునే నడుము ప్రాంతంలో, పురుషుల్లో అయితే అండర్ వేర్ అంచులలో మరియు గజ్జలలో ఫంగస్ ఎక్కువగా చేరి దురదలు వస్తాయి.
దురద నివారణ
- దురదలు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ తప్పనిసరిగా మూడుసార్లు స్నానం చేయడం మంచిది.
- మూడు సార్లు స్నానం చేయడానికి సమయం లేని వాళ్ళు కనీసం ఉదయం మరియు రాత్రి నిద్రకు ముందు తప్పనిసరిగా స్నానం అలవాటు చేసుకోవాలి.
- దురదలు తో బాధపడేవారు గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.
- గోళ్లను కత్తిరించు పోతే గోళ్లతో దురదలు గోకి నప్పుడు చర్మం పైపొర లేచిపోయి అందులోకి క్రిములు చేరి మరింత ఇన్ఫెక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- క్రమం తప్పకుండా తల స్నానం చేస్తూ శరీరంలో గాలి దూరని ప్రాంతాల్లో మంచి గుడ్డతో చేతులతో బాగా శుభ్రం చేసుకోవాలి.
- ఈ దురదలకు పిప్పర్మెంట్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది.
- కొబ్బరి నూనెలో కి ఈ పిప్పర్మెంట్ ఆయిల్ రెండు చుక్కలు వేసి దురదలు మీద అప్లై చేయాలి.
- దురదలు ఎక్కువ మంట లేకపోతే పిప్పర్మెంట్ ఆయిల్ మాత్రమే అప్లై చేయవచ్చు.
- స్త్రీలు బ్రా లు వేసుకునే చోట మరియు లోదుస్తుల భాగంలో పిప్పర్మెంట్ ఆయిల్ ఉపయోగించి దురదలు తగ్గించుకోవచ్చు.
- దురదలు మీద ఈ పిప్పర్మెంట్ ఆయిల్ ను రోజుకు రెండు సార్లు పూయవచ్చు ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.
- మగవారిలో అండర్ వేర్ వేసుకునే చోట చర్మం పైపొర ఊడిపోతూ ఉంటుంది. ఆ భాగాలలో కొబ్బరినూనె రాయడం వల్ల ఇలా జరగదు.
- మగవారిలో షేవింగ్ చేసుకున్న తర్వాత వచ్చే దురదలకు ఈ పిప్పర్మెంట్ ఆయిల్ ఉపశమనం కలిగిస్తుంది.
- ప్రస్తుతం మాస్కులు ఎక్కువ సమయం ధరిస్తూ ఉండడం వల్ల ఆ భాగంలో చెమట అధికంగా ఉత్పత్తి కావడం వల్ల దురదలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా పిప్పరమెంట్ ఆయిల్ అప్లై చేయవచ్చు.
ఇవి కూడా చదవండి :-
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
- ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు