Sudigali Sudheer biography

0

Sudigali sudheer biography in telugu :అనుకోకుండా వచ్చిన కష్టాలను తీర్చుకోవడానికి, అమ్మ కష్టాలను తీర్చడానికి అమ్మ కన్న కలలను నిజం చేయడానికి హైదరాబాద్ కి వచ్చాడు సుధీర్. సుడిగుండంలో చిక్కుకుని సింకులో నీరు తాగుతూ ఏ మాయా మర్మం తెలియని తను మ్యాజిక్కులు చేస్తూ చిక్కుముడులు విప్పుకుంటూ సుడిగాలి సుదీర్ గా ఎదిగి బుల్లి తెరపై తన ప్రస్థానాన్ని విరామం లేకుండా కొనసాగిస్తున్నాడు. ఎంతో మంది ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సుధీర్ గురించి తెలుసుకుందాం.

sudigali sudheer family: 1987 మే 19వ తేదీన దేవ్ ఆనంద్, నాగరాణి దంపతులకు విజయవాడలో జన్మించాడు సుధీర్. సుధీర్ కి అక్క శ్వేత, తమ్ముడు రోషన్ ఉన్నారు.సుధీర్ నాన్న ఒక థియేటర్ లో మేనేజర్ గా పని చేస్తుండడం వల్ల ఆర్థికంగా బాగానే ఉండేవారు. ఐదవ తరగతి లో చదువుకునేటప్పుడు తన మామగారు నేర్పిన ఒక మ్యాజిక్ ట్రిక్ నేర్చుకుని చూపేవాడు. ఆ మ్యాజిక్ చూసిన పిల్లలు వారికి తోచిన డబ్బులు ఇచ్చారు.ఆ డబ్బులు అన్నీ తన నటరాజ్ జామెట్రీ బాక్స్ లో వేసుకొని తన మొదటి సంపాదన గా భావించాడు. వాళ్ళ నాన్నగారికి 93 రూపాయల ముప్పావలా ఇచ్చాడు. ఇదే తన మొదటి సంపాదన అని చెప్తాడు. సహజంగా సుధీర్ ఇంట్లో జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ ఉంటే, వాళ్ళ అమ్మగారికి తన కుమారుడు సుధీర్ ను ఎలాగైనా తెరపై చూడాలని కోరిక ఉండేది.

ఈ విధంగా వాళ్ళమ్మ సుధీర్ తో నువ్వు సినిమా ఆర్టిస్ట్ అయితే బాగుండేది అని అంటూ ఉండేది.సుధీర్ కూడా సహజంగానే సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండడం వల్ల సినిమాలకు వెళ్లి నటించాలని కోరిక ఉండేది. దీనికితోడు వాళ్ళమ్మ మనసులోని కోరిక బయటపడడం వల్ల ఇతనికి ఎలాగైనా సినిమాల్లో ప్రయత్నించాలని కోరిక బలంగా మారింది. పదవ తరగతి తరువాత ఇంట్లో పిల్లలందరినీ చదివించడం కోసం ఖర్చులు ఎక్కువయ్యాయి, ఆదాయం తక్కువ అయింది.పదవ తరగతి పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు కృష్ణానగర్లో ఉంటూ సినిమా ప్రయత్నం చేశాడు. ఎవరిని కలవాలో తెలియక, ఎవరితో కలవాలో తెలియక చేతిలో ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి. తిరిగి విజయవాడకు వెనక్కి వెళ్ళిపోయాడు.

sudigali sudheer education – first salary

మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులు మీద ఇష్టం ఉండడంతో ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివాడు. అయితే చదువు కంటే సినిమాలు మీద ఇష్టం ఎక్కువ ఉండడంతో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాడు. తర్వాత తనకు తెలిసిన నాలుగైదు క్లాసికల్ స్టెప్స్ తో ఇంట్లోనే డాన్స్ క్లాసులు మొదలుపెట్టాడు. ఒక్కొక్కరి దగ్గర 300 రూపాయలు వసూలు చేసేవాడు. ఒక స్కూల్ లో డాన్స్ మాస్టర్ గా చేరి నెలకు 2,500 సంపాదించేవాడు. విలువైన టైమ్ని ఇలాగ చేయడంతో సెకండియర్ కూడా ఫెయిల్ అయ్యాడు. సరిగ్గా ఇదే సమయంలో నే వాళ్ళ నాన్న గారికి ఆక్సిడెంట్ అయింది. ఇక ఆర్థికంగా చితికి పోవడం తో ఏం చేయాలో తెలియక పెద్దకొడుకు గా తన ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు.

ఆర్థికంగా నిలబడాలంటే డాన్సులు ద్వారా వచ్చే నాలుగు వేల రూపాయలు ఇంటికి సరిపోవని సినిమాల్లో అవకాశాలు రావాలన్నా, అక్కను తమ్ముడి ని చదివించాలని, నాలుగు డబ్బులు సంపాదించాలంటే హైదరాబాదే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు.పరిచయం ఉన్న వాళ్ల ద్వారా తనకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్స్ క్వాలిఫికేషన్ గా చూపిస్తూ రామోజీ ఫిలిం సిటీలో 2004 డిసెంబర్ లో 15 వేల రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరాడు. అక్కడ వచ్చిన తొలి జీతం జనవరిలో తీసుకుని సంక్రాంతి కావడంతో ఇంట్లో వాళ్లందరికీ 11 వేల రూపాయలు పెట్టి బట్టలు కొని, మిగిలిన నాలుగు వేలు వాళ్ల అమ్మగారి చేతికి ఇచ్చాడు. కానీ వాళ్ళ నాన్న ఎంతగానో బాధ పడి, నేను పెంచి పెద్ద చేయాల్సిన నా పెద్దకొడుకు నా స్థానంలో ఉండి, చిన్న వయసులోనే పెద్ద దిక్కు అయ్యి బాధ్యత తీసుకున్నాడని ఎంతగానో ఆవేదన చెందాడు.

అయితే రామోజీ ఫిలిం సిటీ లో ఎక్కువగా సెలవులు ఇవ్వరు. 365 రోజులు పని చేయాల్సిందే. ఇలాగే రెండున్నర సంవత్సరాలు పనిచేసి తన జీతాన్ని 30 వేల రూపాయల వరకు పెంచుకున్నాడు. అక్కడ పనిచేసిన రెండున్నర సంవత్సరాలలో కేవలం నాలుగే రోజులు సెలవు పెట్టాడు. ఇక్కడ ఉంటే తనకు వేరే ప్రపంచం తెలియదని, తన గురించి వేరే ప్రపంచానికి తెలియకుండా అవుతుందని పెరుగుతున్న జీతం, ఎదుగుదల లేని జీవితం తో ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకుని దాన్ని వదిలేశాడు. తర్వాత అమీర్ పేట్ లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం మరలా ప్రయత్నాలు చేశాడు. ఇలా తిరుగుతున్న సమయంలోనే గెటప్ శీను పరిచయమయ్యాడు. ఇలా అవకాశాల కోసం తిరుగుతూ ఉంటే చేతిలో ఉన్న డబ్బులు అయిపోయాయి. ప్రియా పచ్చడి అన్నంలో కలుపుకొని తినేవాడు. వాటర్ బాటిల్ బయటకు తీసుకెళ్లి పబ్లిక్ టాప్ లో నీళ్లు పట్టుకుని తాగేవాడు. వాటర్ బాటిల్ కూడా లేని సమయంలో సింక్ లో ఉన్న నీరు తాగి కాలం గడిపేవాడు.

ఇక చివరికి చేతిలో డబ్బులు అయిపోగానే పరిస్థితి దిగజారిపోయి, లాభం లేదనుకుని ఇంటికి వెళ్లిపోయాడు. సుధీర్ గురించి తెలుసుకున్న తన మామయ్య ఓల్డ్ సిటీలో ఉన్న తన మిత్రుడు మెజీషియన్ అలీ గారికి ఫోన్ చేసి, నా మేనల్లుడు సుధీర్ మీ దగ్గరికి వస్తాడని, అతన్ని మీ శిష్యునిగా చేర్చుకోవాలని చెప్పాడు. దాంతో సుధీర్ హైదరాబాద్కు వచ్చి అలీ గారి దగ్గర శిష్యుడిగా చేరాడు. అలీ గారి దగ్గర పనిచేస్తూ గెటప్ శీను ఉంటున్న రూమ్ లో ఉండేవాడు.అలీ గారి దగ్గర మ్యాజిక్ షోలు నేర్చుకుంటూ ఇంగ్లీష్, హిందీ మీద బాగా పట్టు సాధించాడు. ఆ తర్వాత తనే సొంతంగా ఒక ఈవెంట్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈవెంట్స్ చేసుకోవడం బాగా మొదలు పెట్టి డబ్బులు బాగా సంపాదించేవాడు. అంటే రోజుకు రెండు వేల వరకు సంపాదించేవాడు. ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు. కానీ సుధీర్ మాత్రం అమ్మ కోరికలు తీర్చ లేక పోయాను అని బాధతో ఉండేవాడు.

Jabardasth entry :

2013 ఫిబ్రవరి మొదటి వారంలో గెటప్ శీను కి నల్ల వేణు ఫోన్ చేసి ఈటీవీలో జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రాం కు ఒక షో స్టార్ట్ చేస్తున్నారు. నన్ను టీం లీడర్ గా ఉండమన్నారు, కాబట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నువ్వు ఉండాలి రా అని అన్నాడు. ఆ సమయంలో శీను లోకల్ టీవీ లో పనిచేస్తూ ఉండటం వల్ల నేను రాలేను అన్నా, నా ఫ్రెండ్ సుధీర్ అని ఒకడు ఉన్నాడు వాడ్ని పంపిస్తాను అని చెప్పాడు. దానికి బదులుగా వేణు ఎవడు ఆ మ్యాజిక్ షోలు చేస్తాడు వాడేనా? వాడు ఏం చేస్తాడు రా అని అన్నాడు. లేదు అన్నా, ఒకసారి వాని ఆక్టింగ్ చూడన్నా అప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పాడు.

సరేనని నల్ల వేణు సుధీర్ కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు.రేపు నైట్ షూటింగ్ కాబట్టి నువ్వు రేపు మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకు రావాలని చెప్పాడు. కానీ సుధీర్ కి మరుసటిరోజు పటాన్చెరువు లో ఒక ఈవెంట్ లో ఉండడం వల్ల అది పూర్తి చేసుకుని అన్నపూర్ణ స్టూడియో కి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలు అయింది. దాంతో నల్ల వేణు కు కోపం వచ్చి వేరే వాన్ని పెట్టేశాడు.సుధీర్ రావడం చూసి నువ్వు లేటుగా రావడం వల్ల వేరే వాడిని పెట్టేసాను సుధీర్ అని చెప్పాడు. సరేలే అన్నా పర్వాలేదు లే అని, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు సుధీర్.

సరే అన్నా ఆకలిగా ఉంది, టిఫిన్ చేసి వస్తానని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక టిఫిన్ కొట్టు దగ్గర టిఫిన్ తింటుండగా, మళ్లీ నల్ల వేణు ఫోన్ చేసి కారు వేసుకుని అక్కడికే వచ్చి సుధీర్ ని ఎక్కించుకుని ఫ్రెష్ అప్ అయ్యి వద్దామని ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఒక విషయం చెప్పాడు వేణు, ఒరేయ్ సుదీర్ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ కి వేరే వాన్ని పెట్టాను, వాడు బాగా చేయలేకపోతున్నాడు ఈటీవీ లో మొదటిసారిగా చేస్తున్న ప్రోగ్రాం ఇది. పైగా ఆరు మంది టీం లీడర్ లలో నా స్కిట్ బాగా లేకపోతే దరిద్రంగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు రా అని అన్నాడు. దానికి సుధీరు నువ్వేం టెన్షన్ పడకు అన్నా, నువ్వు ఓకే అంటే నేను చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు రా? మరో గంటన్నర లో షూటింగ్ మొదలవుతుంది. పైగా స్క్రిప్ట్ కూడా నీకు తెలియదు కదా అని అన్నాడు. దాంతో సుధీర్ వాళ్ళు ప్రాక్టీస్ చేసిన డైలాగులన్నీ ఎక్కడా గుక్కతిప్పుకోకుండా చెప్పేసాడు. అది విన్న వేణు ఆశ్చర్యపోయి ఆ క్యారెక్టర్ని నువ్వే చేసేయ్ అని చెప్పాడు.

2013 ఫిబ్రవరి 3వ తేదీన జబర్దస్త్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అయితే వేణు చేసిన స్కిట్ లో కేవలం సుదీర్, వేణు మాత్రమే చేశారు.ఇందులో వేణు కి మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసి, ఆ స్క్రిప్ట్ సక్సెస్ అయ్యేలా చేశాడు సుధీర్. దాంతో సుధీర్ స్టేజ్ కింద కు గానే ధనరాజు, మిగతా వాళ్లంతా చాలా బాగా చేశావ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ కాంప్లిమెంట్ తో మరింత నమ్మకం వచ్చింది సుధీర్ కి.

Cinema chance :

ఇలా జబర్దస్త్ జరుగుతుండగా ఒక రోజు వేణు, సుధీర్ ను తీసుకెళ్లి అడ్డా సినిమా లో కామెడీ క్యారెక్టర్ కోసం సినిమా డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ సుధీర్ ని చూసిన డైరెక్టర్ సుధీర్ కి కూడా ఒక చిన్న క్యారెక్టర్ ను ఇస్తాను చేస్తావా అని అడిగాడు. దాంతో ఆశ్చర్యపోయిన సుధీర్ మొదటిసారి 70mm స్క్రీన్ మీద నటిస్తున్నానని ఆనంద పడిపోయి, అలా అడ్డా సినిమాలో నటించాడు. అయితే స్టేజ్ కి, సినిమా షూటింగ్ కి డిఫరెన్స్ ఉంటుందని తెలీక ఎలా పడితే అలా నటిస్తుండడంతో, వేణు పక్కకు తీసుకెళ్లి కొన్ని మెలకువలు నేర్పించాడు. ఇక సుధీర్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఆ తర్వాత వేణు జబర్దస్త్ లో నుండి వెళ్లిపోవడంతో రాంప్రసాద్, సన్నీ, వీళ్ళు నలుగురు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి సుదీర్ ను టీం లీడర్ గా ఉండమన్నారు. కానీ సుధీర్ మాత్రం గెటప్ శీను ని టీం లీడర్ గా ఉండాలి అని చెప్పాడు. కానీ శీను ఒప్పుకోకపోవడంతో సుధీర్ ని కంటిన్యూ చేశారు. జబర్దస్త్ లో బాగా సక్సెస్ కావడంతో కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అడ్డా తోపాటు ఆర్య చిత్ర, రేసుగుర్రం, చక్కిలిగింత, బ్రదర్ అఫ్ బొమ్మాలి, టైగర్, సుప్రీమ్, వేర్ ఈజ్ విద్యాబాలన్, షేర్, సినిమా చూపిస్త మావా, నేను శైలజ, దృశ్య కావ్యం, సర్దార్ గబ్బర్ సింగ్, బంతిపూల జానకి, సెల్ఫీరాజా, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఓం నమో వెంకటేశాయ, చిత్రాంగద, నేనోరకం, తియ్యని కలవో, ఎందుకో ఏమో ఇలాంటి ఎన్నో చిత్రాల్లో చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు.

అయితే తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో నువ్వేం చేస్తావో చెప్పు అదే ఈ సినిమాలో ఇస్తామని చెప్పి అడిగినప్పుడు, సుధీర్ ఆనంద పడిపోయాడు. అలాగే ఒక రోజు సర్దార్ షూటింగ్ సెట్లో కి చిరంజీవి గారు వచ్చినప్పుడు సుధీర్ ను చూసి సుడిగాలి సుదీర్ అని చిరంజీవి నోటి వెంట రావడంతో, జబర్దస్త్ కు నేను ఎన్నో విధాలుగా రుణపడి ఉంటాను అని మనసులో అనుకున్నాడు. మల్లెమాల వారు నిర్మించే జబర్దస్త్ తో పాటు తన టాలెంట్ని మెచ్చుకుని ఢీ 9,10,11 లకు అవకాశం ఇచ్చారు.

Megastar in TV channel :

అలాగే ఈటీవీ ప్లస్ లో వస్తున్న పోవే పోరా ప్రోగ్రాం కి హోస్ట్గా కూడా ఛాన్స్ ఇచ్చారు. జెమినీ టీవీలో వస్తున్న జాక్పాట్ 25 ఎపిసోడ్ లకు హోస్ట్గా చేశాడు. ఇలా చేస్తూ తన టాలెంట్ నిరూపించుకున్న సుధీర్ ఎంతో మందికి చేరువయ్యాడు. బుల్లితెర మెగాస్టార్ గా ఎదిగాడు.బుల్లితెర తో పాటు వెండితెర మీద తనదైన నటనను చూపించి సినిమాలు చేస్తూ వాళ్ళమ్మ గారి కోరికను నెరవేర్చాడు. ఒక మంచి కొడుకు అని అనిపించుకున్నాడు. వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చి, హ్యాపీ ఫ్యామిలీ గా మార్చి వేశాడు.

2016 లో సుధీర్ ఇల్లు కొన్నప్పుడు ఆహ్వానానికి ఇన్విటేషన్ కోసం చిరంజీవి గారి ఇంటికి తన తమ్ముడు రోషన్తో కలిసి వెళ్ళినప్పుడు, మెగాస్టార్ కిందికి దిగి వచ్చి తనే స్వయంగా లోపలికి తీసుకెళ్లి తనే సొంతంగా షుగర్ వేసి కలుపుతూ పాలు ఇచ్చి సుధీర్ కు, అతని తమ్మునికి ఇచ్చాడు. తర్వాత ఇతనిని ఆశ్చర్యపరుస్తూ వాళ్ళ అమ్మ నాన్న కు తన తరఫున గిఫ్ట్ గా బట్టలు ఇచ్చాడు. సుధీర్ మరింత ఆశ్చర్యపోయాడు.అలాగే తను చేస్తున్న ఖైదీ నెంబర్ 150 లో ఒక క్యారెక్టర్ ఇప్పిస్తానని, నీ గురించి వినాయక్ కు కూడా చెప్తాను అని మాట ఇచ్చాడు. దాంతో మరింత ఉబ్బిపోయాడు సుధీర్.

అనుకున్నట్లుగానే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 లో ఒక మంచి క్యారెక్టర్ ఉందని, ఆ సినిమా డైరెక్టర్ తో సుధీర్ కు ఫోన్ చేయించాడు.కానీ సుధీర్ బ్యాడ్ లక్ ఏమంటే ఆ రోజు ఏదో అవుట్ డోర్ షూటింగ్లో ఉండటం వల్ల ఈ సినిమాలో క్యారెక్టర్ చేయలేకపోయాడు. ఈ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటాడు సుధీర్. ఏదేమైనా ఆ తర్వాత తనే స్వయంగా మెగాస్టార్ దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పాడు. చిరంజీవి గారు మళ్లీ మనం ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని మాట ఇచ్చాడు.

Love affair :

ఆ తర్వాత జబర్దస్త్ లో డాడీ స్కిట్ వేసిన అప్పటినుంచి నాగబాబుగారు అంటే బాగా క్లోజ్ అయ్యారు. అదేగాక నాగబాబు గారి తో లంచ్ లు, డిన్నర్లు చేసుకోవడం వల్ల ఇంకా బాగా దగ్గరయ్యారు. అలాగే సుధీర్ – రేష్మి కాంబినేషన్ హిట్ చేద్దామని డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్లు అనుకొని, వాళ్ళిద్దరి మధ్య కొన్ని స్కిట్లు ప్లాన్ చేయడం వల్ల చాలామంది వీరిద్దరిని లవర్స్ అని అనుకున్నారు. దీనికితోడు, ఢీ జోడు కోసం సుధీర్ రేష్మి ని తీసుకోవడం వల్ల వీరిద్దరి మధ్య మరింత గాసిప్స్ పెరిగాయి. 2018 ఉగాది ఈవెంట్ తో నిజమే అనుకున్నారు అందరూ. కానీ షూటింగ్ అయిపోయాక ఎవరు ఎవరితోనూ మాట్లాడుకోరు. మరలా షూటింగ్ ఉండే రోజు మాత్రమే మాట్లాడుకుంటారు.

నిజం చెప్పాలంటే షూటింగ్లో కూడా డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత మాత్రమే కెమెరా ముందుకు వచ్చి వాళ్ళిద్దరూ నటిస్తారు, మాట్లాడుతారు. తప్ప, కట్ చెప్పిన తర్వాత ఎవరి రూం లోకి వెళ్లి వారే కూర్చుంటారు. అంతేకానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కానీ చాలామంది అనుకున్నట్లుగా అది నిజం కాదు. కేవలం ఇదంతా గాసిప్స్ మాత్రమే.వీళ్ళ కాంబినేషన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటుంది. అంతేకానీ వీళ్ళిద్దరి విషయంలో లవ్ ఏమాత్రం లేదు.

Conclusion :-

ఎక్కడో సింకులో నీరు తాగిన స్థాయి నుంచి స్వయంగా చిరంజీవి నోటి నుంచి సుడిగాలి సుదీర్ అని పిలిపించుకున్న స్థాయికి ఎదిగినా కూడా ఎక్కడా గర్వం అనేది చూపించడు. ఆర్టిస్ట్ సుభాషిని కి హెల్త్ ప్రాబ్లం రావడం, సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వలన ఆమెకు ఆర్థిక సహాయం చేసి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు సుధీర్. ఒకప్పుడు సినిమాల్లో వెలిగి ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న వారికి తనకు తోచిన ఆర్థిక సహాయం చేసి ధైర్యం ఇస్తుంటాడు సుధీర్. తన ఉదారమైన మనసును చాటుకుంటూ ఉంటాడు. ఇతను సినీ రంగంలో మంచి విజయాలు సాధించాలని మనం కూడా కోరుకుందాం.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి.