వేముల.పులివెందల ;యురేనియం కాలుష్యం ఇక్కడ విపరీత మౌతుంది. ఇక్కడ జీవించ లేక పోతున్నాం.టైలింగ్ పాండ్ వ్యర్థ జలాలు భూమిలోకి పాతుకుపోయి వ్యవసాయ బోర్లు కలుషితం అవుతున్నాయి.పంటలు సాగు చేయడం కష్టమవుతుంది. రేడియేషన్ ప్రభావంతో అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి .టేలింగ్ పాండ్ ఇతర గ్రామాల నుంచి ప్రజలు మరియు రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం మండలంలోని కె, కొట్టాల గ్రామం లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టిడిపి మాజీ మంత్రులు, కాల్వ శ్రీనివాసులు, అఖిల ప్రియ, శాసన మండలి మాజీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి లతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఓబుల కొండయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య,ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రకటించారు.
ఈ సందర్భంగా రాములవారు బాధిత రైతులు తమ సమస్యలను, వారు పడుతున్న ఇబ్బందులను, వీరికి వివరించారు. కలుషితమైన నీటిని త్రాగడం వలన అనేక వ్యాధులు పడుతున్నామని,శరీరంపై దురద మంట వంటి విచిత్రమైన రోగాలు వస్తున్నాయి, అలాగే చిన్నపిల్లల్లో కడుపు నొప్పి ఎక్కువగా ఉందని వారు అన్నారు. యు సి ఐ ఎల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలతో ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.
యుసి ఐఎల్ వైద్యులు ఇచ్చే మందులతో ఏ వ్యాధులు తగ్గడం లేదు. పిల్లలకు పెద్దలకు అందరికీ కలిపి ఒకే రకమైన మందులు ఇస్తున్నారు.అందువలన ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇంతకుముందు ఇక్కడ 200 నుండి 300 అడుగుల లోతులో నీళ్లు ఉండేవని, కానీ ఇప్పుడు యురేనియం తవ్వకాలతో 1000 నుండి 1500 అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదని వారు వాపోయారు.
భూగర్భ జలాలు ఇంకిపోవడం వలన పంటలు సాగు చేయలేక బీడు భూమిగా వదిలేయమని అక్కడి రైతులు వివరించారు.ఒకవేళ నీళ్లు పడినా కూడా కలుషిత నీటిని ఇవ్వడం వల్ల పంట దెబ్బతిని పెట్టుబడులు కూడా రావడం లేదని,సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టైలింగ్ పాండ్ ను సందర్శించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యర్థ జలాలు భూమిలోకి కుంగిపోయి భూగర్భ జలాలు కలుషితం కావడంతో పంటలు పండించుకునే పరిస్థితి లేదన్నారు.కలుషితమైన నీటి తో పంటలు దెబ్బ తినడమే మాత్రమే కాకుండా ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నాకేంద్ర ప్రభుత్వం,రంగ సంస్థ యుసిఐఎల్ పట్టించుకోకపోవటం చాలా బాధాకరం అన్నారు. యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని జాతీయస్థాయిలో ఉద్యమం చేపడతామని ఆయన వివరించారు.