టి డి పి నేతలు మద్యం ఫై విమర్శలు

0

ఆంధ్రప్రదేశ్లో లో మధ్య నిషేధం దిశగా వెళ్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.మద్యానికి అలవాటు పడిన వారిని పిండి వేయడానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం .ప్రభుత్వం ప్రారంభించిన మద్యం దుకాణాల్లో ఇప్పుడు నాలుగైదు రకాల అమ్ముతున్నారు.మిగతా వాటిని ఎందుకు అమ్మడం లేదని ఎవరు అడగకూడదు. అడిగినా ఎవరూ చెప్పరు. మందుబాబులు గతంలో ఏ బ్రాండ్ కు అలవాటు పడిన ఇప్పుడు ఏపీ సర్కార్ అమ్ముతున్న నాలుగు రకాలబ్రాండ్ లో దేనికో ఒకదానికి ఫిక్స్ అవుతారు.తప్పదు కదా అని ప్రభుత్వం తన మద్యం దుకాణాల్లో నాలుగైదు బ్రాండ్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వారు చెప్పినంత ధర ఇవ్వాలి ఇప్పటికే 20 శాతంమేరకు రేట్లు పెంచారు,

సర్కారు వారు 20 శాతం మద్యం దుకాణాలు తగ్గించామని చెబుతుంది.ఇలా తగ్గిస్తే ప్రభుత్వానికి ఆదాయం పడిపోవాలి కానీ రెట్టింపవుతుంది.మద్యం నుంచి ఈ ఏడాది ఆరు వేల కోట్లు రూపాయలు అదనంగా పిండేలా రేట్లు పెంచారు.పరిమితమైన బ్రాండ్లనే అందుబాటులో ఉండడం వలనఆయా కంపెనీల బిజినెస్ వందల కోట్లు పెరుగుతుంది.ఆ కంపెనీ యజమానులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుణ్యమా అని అపర కుబేరులు అయిపోతారు మద్యానికి అలవాటు పడిన వారు నిరుపేదల అయిపోతారు.

ఇక ప్రభుత్వం ప్రారంభించిన మద్యం దుకాణాల విషయంలోనూ ఎన్నో అవక తవకలు కనిపిస్తాయి.చాలా చోట్ల షాపుల అద్దె నెలకు లక్ష వరకు పడుతున్నారని అని ప్రచారం జరుగుతుంది.మరికొన్ని చోట్ల చెట్ల కిందనే ప్రారంభించారు.అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జలపల్లి అనే గ్రామంలో చెట్టు కింద మద్యం షాపు ప్రారంభించారు.అక్కడి ఫోటో బయటకు వచ్చింది చాలాచోట్ల గతంలో బెల్టుషాపులు ఉన్న చోట్ల ఇప్పుడు పర్మినెంట్ మద్యం షాపులు ప్రారంభం చేశారని చెబుతున్నారు..

ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే రాజకీయ నాయకుల  తెలివితేటల గురించి సినిమాల్లో చూపించే కుట్ర కోణాలు సులువుగానే అందరికీ గుర్తొస్తాయి.మద్యపాన నిషేధం ముసుగులో ఈ ప్రభుత్వం భారీ స్కామ్ ఉందని  టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం షాపుల్లో నాలుగువేల ఎనిమిది వందల ఎనబే అందులో రెన్యువల్ కానివే ఏడు వందల డెబ్భైఏడూ,ఇక మిగిలిన షాపులు  మూడు వేల ఆరువందల మూడు మరి ప్రభుత్వం అంటున్నట్లు 20 శాతం షాపులు తగ్గిస్తే ఇంకా ఉండాల్సినవి రెండు వేల ఎనిమిది వందలు యనభే మూడు .కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు దుకాణాల్లో  3 వేల ఐదు వందలు .దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం ఎంత బూటకం గా వ్యవహరిస్తుందో తెలుస్తోంది. అంటూ టిడిపి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.