బ్లీడింగ్ తగ్గాలంటే ఏం చేయాలి | అధిక రుతుస్రావం తగ్గాలంటే ఏం చేయాలి ?
బ్లీడింగ్ తగ్గాలంటే ఏం చేయాలి :- రుతుస్రావం సమయంలో చాల మంది అధిక బ్లీడింగ్ పోవడం వల్ల ఎక్కువగా బాధపడుతు ఉంటారు. ఒక అమ్మాయి 15 సం,,రాలు నిండగానే పుష్పవతి అవుతారు. పుష్పవతి అయిన తర్వాత ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. ఇలాంటి సమయంలో కొంత మందికి బ్లీడింగ్ ఎక్కువగా పోవడం జరుగుతుంది.
దీని వల్ల వారు నీరసనికి గురి అవుతారు. అధిక బ్లీడింగ్ తగ్గాలని మెడికల్ షాప్ లో దొరికే మందులు వాడినా కూడా ఈ సమస్య కంట్రోల్ అవ్వదు. అయితే అలాంటి సమయంలో బ్లీడింగ్ తగ్గాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.
Home Redmi For Period Control | పీరియడ్స్ లో బ్లీడింగ్ ఆగాలంటే ఏం చేయాలి?
అధిక బ్లీడింగ్ తో బాధ పడుతున్నవారు కింద ఇచ్చిన హోం రేమిడీస్ ఉపయోగించడం వల్ల తగ్గించుకోవచ్చు.
- పిరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే అలాంటి టైంలో రాత్రి పూట మొంతులు నీటిలోకి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.
- వీలునప్పుడల్లా బెల్లంని తినాలి. తినడం వల్ల చాలా వరకూ ఉపశమనముంటుంది.
- ఒక స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ తీసుకొని, బియ్యం కడిగిన నీటిలోకి ఈ పౌడర్ ని కలిపి తాగడం వల్ల అధిక రుతుస్రావం నుంచి బయటపడొచ్చు.
ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలి
బ్లీడింగ్ అవుతున్నప్పుడు బాడీ ఐరన్‌ని కూడా పోగొట్టుకుంటుంది. ఐరన్ తగ్గితే ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో నీరసం, కళ్ళు తిరగడం, శరీరం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎనీమియా రాకుండా ఉండాలంటే ఆయిస్టర్స్, చికెన్, బీన్స్, టోఫూ, పాలకూర ఎక్కువగా తీసుకోండి. వీలుంటే ఐరన్ పాత్రల్లో వంట చేయండి.
విటమిన్-సి ఫుడ్స్ తినాలి
విటమిన్-సి వల్ల శరీరం ఐరన్‌ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఐరన్ సరిగ్గా ఉండడం వల్ల ఎనీమియా రాకుండా ఉంటుంది. అన్ని నిమ్మజాతి పండ్లలోను విటమిన్-సి ఉంటుంది. వీటితో పాటు క్యాప్సికమ్, కివీ, స్ట్రాబెర్రీస్, బ్రకోలీ, టొమేటో లలో కూడా విటమిన్-సీ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఎక్కువగా బ్లీడింగ్ అయియే సమయంలో వీటి వల్ల ఉపశమనం లభిస్తుంది.
నీళ్ళు ఎక్కువ తాగాలి
పీరియడ్స్‌లో బ్లీడింగ్ హెవీగా ఉంటే మీకు చాలా రక్తం పోతోందని దాన్ని బాలెన్స్ చేయాలంటే రోజూ మామూలుగా తాగే నీటి కంటే నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీరు తాగండి. అదే విధంగా ఉప్పు ఎక్కువ తీసుకోండి. ఇలా తగ్గడం వల్ల ఎక్కువ బ్లీడింగ్ కాకుండా కంట్రోల్ చేయవచ్చు.
రుతుక్రమంలో అధిక రక్తస్రావానికి కారణాలు ఏమిటి ?
అధికంగా బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం.
రక్త స్రావ అసమానతలు
రక్తం గడ్డ కట్టడానికి ఇబ్బంది కలిగించే రక్త స్రావ అసమానతలు చాలా సార్లు రుతుక్రమంలో అధిక రక్త స్రావానికి దారి తీస్తాయి. గుండె, చాతీ, రక్త సంస్థ వారి ప్రకారం, వాన్ విల్లెబ్రాండ్ వ్యాధి రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే రక్తస్రావ అసమానత కలిగించే వ్యాధి.
ఈ వ్యాధి వున్న వారిలో రక్తం తక్కువ పరిమాణంలో గడ్డ కడుతు౦ది. రక్తం పలుచన చేసే మాత్రలు తీసుకునే ఆడవారిలో కూడా రుతుక్రమంలో అధిక రక్త స్రావం అవుతుంది.
ఇంట్రా యుటేరైన్ డివైజేస్
ఐ యు డి సాధనాలు వాడే స్త్రీలలో రుతుక్రమం సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంది.
హార్మోన్ల అసమతౌల్యం
యుక్త వయసు లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల అసమతౌల్యం అన్నిటికన్నా సాధారణ కారణం. యుక్త వయసులో మొదటి సారి రుతుక్రమం వచ్చాక, మెనోపాజ్ మొదలయ్యే కొన్ని ఏళ్ళ ముందు, హార్మోన్ల స్థాయి మారుతూ వుంటుంది, దీని వల్ల అధిక రక్త స్రావం అవుతూ వుంటుంది.
FAQ
- పీరియడ్స్ తొందరగా రావాలి అంటే ఏ ఫ్రూట్ తినాలి ?
జవాబు :- బొప్పాయి ఫ్రూట్ తినాలి, ఈ పండు తినే ముందుగా వైదుడిని సంప్రదించండి, ఎందుకు అనగా ఈ ఫ్రూట్ ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియచేస్తారు. ఎక్కువగా తినకూడదు.
2. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కల ఇతర కారణాలు ఏమిటి
జవాబు :- బాగా బరువు తగ్గడం, ఎక్కువగా బరువు పెరగడం, ఒత్తిడికి గురవ్వడం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు.
3. పీరియడ్స్ ఆపడానికి మాత్రలు వేసుకోవడం మంచిదా ?
జవాబు : – పీరియడ్స్ ఆపడానికి మాత్రలు అసలు ఉపయోగించరాదు. దీని వల్ల ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఒకవేళ మీరు మాత్రలు వేసుకోవాలి అనుకొంటే, ఉపయోగించే ముందుగా వైదుడిని తప్పనిసరిగా సంప్రదించండి.
4. డేట్ రావడానికి టాబ్లెట్ పేరు ?
జవాబు :- రేజేస్ట్రోనే 5 MG టాబ్లెట్. ఈ టాబ్లెట్ వాడె ముందుగా డాక్టర్ ని సంప్రదించండి.
5.వెంటనే పీరియడ్స్ రావడానికి ఏ టాబ్లెట్ఉపయోగించాలి ?
జవాబు :- ప్రొజెస్టెరాన్ టాబ్లెట్. ఈ టాబ్లెట్ తగిన మోతాదులలో తీసుకోవచ్చు, ఈ టాబ్లెట్ వినియోగించడం వలన కొన్ని సమస్యలకి దారి తిస్తుంది. ఈ టాబ్లెట్ ఉపయోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి.
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం మాకి అందిన ఇంటర్నెట్ ద్వారా మీరు తెలియచెస్తున్నాం. మీకు దీని మీద ఒక అవగాహనా కోసమే తెలియచేస్తున్నం. అధిక బ్లీడింగ్ తో బాధ పడుతున్న వారు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-