విలువ కోట్స్ ఇన్ తెలుగు| Viluva Quotes 2022 In Telugu
Viluva Quotes In Telugu :– ప్రతి ఒక్క మనిషికి అవసరమైనది అంటే ఒక్క విలువ మాత్రమే. విలువ లేకుండా సమాజంలో జీవించలేము. ప్రతి వ్యక్తికి విలువ అనేది ఏంతో ముఖ్యం. పది మంది కలిసిన చోటుకి వెళ్ళినపుడు విలువ ఉంటేనే అతన్ని ఎవరు అయిన గౌరవంగా చూస్తారు, ఒకవేళ విలువ లేకుంటే అసలు పట్టించుకోరు.
ఆడవాళ్ళకి అయిన మగవారికి అయిన విలువ అనేది తప్పనిసరిగా ఉండాలి. కోన్ని విలువల కోట్స్ ఈ క్రింద తెలుసుకుందాం.
విలువ కవితలు | విలువ Quotes | విలువ Quotes In Telugu
- మనిషి విలువ మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి నిర్ణయిస్తుంది.
- కష్టాల్ని ఓర్చి పచేసినప్పుడే మనిషికి విజయం యొక్క విలువ తెలుస్తుంది.
- మనం ఎవరికీ అయితే ఎక్కువ విలువ ఇస్తామో, వాళ్ళ దృష్టిలో మనం చాల చౌకగా కనిపిస్తాము.
- బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు బంధాలకి విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు.
- విలువ లేని ప్రేమ చక్కర లేని కాఫీ లాంటిది ఎంత తాగిన తృప్తి ఉండదు.
- విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర ఒక్క గంట ఉండటం మేలు.
- విలువలు పాటించే వారికే విలువల యొక్క విలువ తెలుస్తుంది.
- విజయం సాదించిన వ్యక్తిగా కాదు.విలువలు కలిగిన వ్యక్తిగా మారటానికి ప్రయత్నించు.
- నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట…ఒక పూట… ఒక రోజు నిర్లక్ష్యం చేయి తప్పు లేదు కాని..!!కాని ప్రతి రోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలి అని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు.
- అవసరం కోసం ఏర్పడిన బంధాలివి ఆఖరి క్షణం వరకు తోడు ఉండేవి కావు!!!భోగభాగ్యాల కోసం ఏర్పడిన బంధాలివి బ్రతుకు ప్రయాణంలో తోడు ఉండేవి కావు!!
- మనవి కాని బంధాల వెంట ఎంత తిరిగిన నీ దేహానికి అలసట నీ మనస్సుకి బాధ తప్ప ఇంకేమి ఉండదు.నీదయినది ఎప్పటికి… నిన్ను వీడదు.నీదికానిది ఎప్పటికి నీకు దొరకదు.
- మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది…కానీ….మనస్సు పడే బాధ మనిషిని ప్రతి రోజు చంపుతుంది.
- విలువైన మాటలు చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం.అవి విలువైనవని తెలుసుకోలేక పోవడం మన దురదృష్టం.
- గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు.
- ఎవ్వడు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు.. నీ జీవితం నీకు విలువైనది.విలువలు లేని విలువలు ఇవ్వని మనుషులకి దూరంగా ఉండటం మంచిది.
- గర్వంతో విర్రవీగిన ప్రతి మనషికి పతనం తప్పదు.
- కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు కాని..! కన్నీళ్లు తెప్పించే వారు మాత్రం ఉండకూడదు..!
- చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మరచిపోతావు.రూపాయి కూడా చేతిలో లేన్నప్పుడు ప్రపంచం నిన్ను మరచిపోతుంది.
- విలువ కోసం విలువ లేనిచోట ప్రయత్నిచడం ఉన్న విలువని వదులుకోవటం అవుతుంది.
- దూరం ఉంటె మర్చిపోతారు అనుకుంటారు చాలామంది, కాని దూరం ఎక్కువ అయ్యేకొద్ది ప్రేమ ఇంకా పెరుగుతుంది.ఎందుకంటే దూరం ఉన్నప్పుడే తగ్గరితనం విలువ తెలుస్తుంది.
- కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ అవి మనకి దొరకనప్పుడు తెలుస్తుంది. కొన్నింటి విలువ కాలం గడిచేకొద్ది తెలుస్తుంది.
- ఓ విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తర్వాత!!!
- నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలేక్కువ … నీతిగా ఉన్నవారికీ నిందలేక్కువ.
- ఈ రోజుల్లో విలువలు కలిగి ఉన్న మనిషికన్నా,విలువ కల్గిఉన్న మనుషులకే విలువెక్కువ.
- తెగిపోయిన చెప్పుల్ని అయిన వారం రోజులు నీ ఇంట్లో ఉంచుకోవచ్చు.కాని,ప్రాణం పోయాక నీ శవాన్ని మూడు రోజులు కూడా నీ ఇంట్లో ఉండనివ్వరు.నీలొ ప్రాణం ఉన్నంత వరకే నీ శరీరానికి విలువ.
- వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో,మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యం.
- కస్టపడి బ్రతికేవాడు.. ఎప్పుడు కూడా.. కోటీశ్వరుడే..!ఒకడి కడుపు కొట్టి బ్రతికేవాడే అసలైన పేదవాడు..!
- మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండవచ్చు కానీ,ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు.
- జీవితంలో నిజమైన విలువలు నేర్పించేది విద్య మాత్రమే.
- దైర్యం చెపితే రాదు చేస్తేనే వస్తుంది.చీకటితో చెలిమి చేస్తే వెలుగు బహుమతిగా వస్తుంది. దుఃఖం అర్థం చేసుకున్నప్పుడే ఆనందం విలువ తెలుస్తుంది.
- నిన్న గడిచిపోయింది, రేపు ఎలా ఉంటుందో తెలియదు.ఈ రోజే అన్నింటి కన్నా విలువైనది.
- కాలం కంటే విలువైనది ఏది లేదు,దాన్ని దుర్వినియోగం చేయకూడదు.
- ఓటమి ఎరుగని వ్యక్తీ కన్నా,విలువలతో జీవించే వ్యక్తీ గొప్పవాడు.
- నీవు నీ తల్లితండ్రులకి విలువ ఇవ్వకపోతే,నీ పిల్లలు కూడా నీకు విలువ ఇవ్వరు.
- బంగారంలో ప్రతి సన్నని తీగకు విలువ ఉన్నట్లే మన జీవితంలో ప్రతి క్షణం విలువైనదే.
- విలువలతో బ్రతికినవారే జీవితంలో అసలైన విజేతలు.
- ఇది బాగా గుర్తుంచుకో… మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనము విలువ ఇవ్వాలి.విలువ ఇవ్వని వాళ్ళని అస్సలు పటించుకోవద్దు.వాళ్ళు ఎంత తోపులు అయినా సరే..
- చాల ఎక్కువగా ఎవరిని నమ్మరాదు. చాల ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు.చాల ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు.ఎందుకంటే ఈ చాల ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టవచ్చు.
- డబ్బు పోతే -పర్వాలేదు,ఆరోగ్యం చెడితే -ఇబ్బంది,కాని విలువలు కోల్పోతే అన్ని కోల్పోయినట్లే.
- నాణేలు శబ్దం చేస్తాయి.కాని నోట్లు నిశబ్దంగా ఉంటాయి.అలాగే మన విలువ పెరిగే కోద్ది హుందాగా ఉండాలి.
- మంచి అలవాట్లున్న వ్యక్తికి విలువ పెరుగుతూ వెలుతుంది,దురలవాట్లున్న వారికి విలువ దిగజారుతూ ఉంటుంది.
- మనిషి బ్రతకడానికి నీరు,గాలి,కూడు,గుడ్డ ఉంటె చాలు.కాని మనిషి మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి.
- తప్పు చేశానని చింతించి,తిరిగి అదే తప్పు చూస్తుంటే ఆ బాధకి విలువేముంది.
- అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు ఆకలి విలువ, జాబ్ లేన్నప్పుడు పైసలు విలువ, విడిపోయినపుడు ప్రేమ విలువ, దూరం అయినప్పుడు మనషి విలువ, జాగ్రత్తలేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది.
- కాలం విలువ తెలియని వాడికి,జీవితం విలువ కూడా తెలియదు.
- నేను తగ్గుతున్న అంటే తప్పు చేశాను అని కాదు,బంధాలకి విలువ ఇస్తున్నఅని అర్థం.నమ్మకం లేని చోట వాదన అనవసరం.
- కాలం చాలా విలువైనది.చేజారిన నిమిషాన్ని ఏ సంపాదన వెనక్కి తీసుకురాలేదు.
- చెడ్డవారితో సావాసం,మాట విలువ తెలియని వారితో వాదన ఎప్పటికి చెయ్యకూడని పనులు.
- నీ చిరునవ్వుని మాత్రమే చూసే మిత్రుని కన్నా,నీ కన్నీళ్ళ విలువ తెలిసిన మిత్రుడు మిన్న.
- జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు.విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు.
- కష్టాలు ఎదురయినపుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది…!!
- ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది
- బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువుండదు, కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువుండదు.
- గతాన్ని తలుచుకోవడం మానుకో..భవిష్యత్ గురించి కలలు కనకు ప్రస్తుతంపై మనసు లగ్నం చేయి..!
- ఏడ్పించేవాడికేం తెలుసు ఏడ్చేదాని ఏడుపు విలువ కానీ ఏడ్చేదానికే తెలుసు ఏడ్పించేవాడి అసలు విలువ.
- బంగారు కలంతో లిఖించిన ఉత్తరమైనా..చిరునామా లేనప్పుడు దానికి విలువేక్కేడిది..?
- కడుపు మాడిననాడు మెతుకు విలువ…! ఆడి ఓడిననాడు బ్రతుకు విలువ..!తెలిసివస్తాయి.
- విలువ ఏ ముళ్ళకంపో అయ్యివుంటుంది ముట్టుకున్నవాళ్ళకే గుచ్చుకుంటుంది.
- లేనిచో విలువెందుకు వెతుకుతావు,ఉన్నచోట కాపాడుకో చాలు.
- పలకరింపు బంగారమైతేనే మనిషికి విలువుండేలా ఉంది.
- ఎప్పుడు నేను తగ్గి ఉంటుంటా..ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక.అంతే కానీ…నాలో తప్పు ఉండటం వల్ల మాత్రం కానే కాదు.. అది గతంలోనూ లేనే లేదు.
- మాట్లాడుకుంటే పది నిమిషాల్లో తిరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ పది ఏళ్ళు అయినా తీరని సమస్యగా మారుస్తున్నారు.
- మనిషి విలువ, మనిషి కష్టం విలువ తెలిస్తే చాలు… డబ్బు విలువ తెలియక్కర్లేద్దు.
- మనిషి అసలు రంగు చుదలేకపోతున్నావా..?మరేం పర్లేదు డబ్బు చూపిస్తుందిలే.
- తన అందానికి,ఐశ్వర్యానికి మురుసిపోయే మనిషి ఇంకొక మనిషి విలువను ఎప్పటికి తెలుసుకోలేడు.