తులసి గింజల వలన ఉపయోగాలు, దుష్ప్రభావాలు ఏమిటి !

0
basil seeds in telugu

తులసి గింజలు అంటే ఏమిటి ? What Is Basil Seeds In Telugu

Basil Seeds In Telugu : తులసి గింజలు ఇవి శరీర ఆరోగ్యానికి శక్తిని అందించి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి. తులసి గింజలను తినడంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

తులసి ఆకులతో పాటు తులసి గింజల లో కూడా అనేక పోషకాలు ఉంటాయి. మనకి హెల్త్ బాగా లేకున్నపుడు ఈ గింజలు రెండు, మూడు మన నోటిలోకి వేసుకొని నమలడం వలన మనకి నీరసం వెళ్లి ఉస్తహంగా ఉంటది.

తులసి గింజలు ఎలా నిల్వ చేయాలి ? 

ఈ తులసి గింజలను ఎలాంటి తేమ ప్రేదేశం లో నిల్వ ఉంచరాదు. పోరాపడిన బాక్స్ లేదా ఇతర డబ్బా లలో నిల్వ ఉంచవచ్చు. గాలి పోకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు తగిలితే ఈ గింజలకి బుజు పట్టే అవకాశం ఉంది.అందుకనే మనం వీటిని బాక్స్ లో నిల్వ ఉంచడం వలన మనం కొద్ది గా ఎక్కువ రోజులు మనం ఉపయోగించవచ్చు.

 

తులసి కషాయం తయారీ: పొయ్యి మీద గిన్నెలో నీళ్లు మరుగుతున్నప్పుడే అల్లంముక్క, దాల్చిన చెక్క, తులసి ఆకులు, సోంపు, మిరియాలు, పసుపు కొమ్ము అన్నీ వేయాలి. అవి పావు కప్పు అయ్యేదాకా మరిగించాలి. ఈ నీటిని వడబోసుకుని కాస్త తేనె కలిపి వేడివేడిగా తాగాలి ఆరోగ్యానికి మంచిది.

తులసి గింజలు ఎలా తినాలి ?  | How To Eat Basil Seeds 

తులసి గింజలు అందరు వీటిని తినడానికి ఇష్టపడరు, అయితే వీటిని తినడం వలన చాల ఉపయోగాలు మాత్రం ఉన్నాయి. ఈ గింజలు తినడానికి చేదుగా, ఒగురుగా ఉంటది. అయ్యితే ఆ చేదు లేకుండా అందులోకి పంచదార లేదా బెల్లం వేసుకొని మనం తినవాచు. ఎలా అయ్యితే ఎలాంటి ఒగురుగ ఉండదు. అందరు హ్యాపీ గా ఆరగిస్తారు.

జుట్టుకు తులసి గింజల ఉపయోగం

  • తలకు తులసి రసం రాసి, రాత్రంతా ఉంచుకొని – మర్నాడు తలస్నానం చేస్తే పేన్లు పోతాయి.
  • తలలో పేలు నశింపజేయడానికి మరో మార్గం కూడా ఉంది. రాత్రి పడుకోబోయే ముందు — ఘాటైన వాసన గల ముదురు తులసి ఆకులు (కోసి ఉంచిన విఎప్పుడైనా) దిండు పై ఒత్తుగా పరుచుకుని – వాటి ఘాటు తలకు పట్టేలా చూసుకున్నా చాలు! తెల్లవారేసరికి పేలు, ఈపులు సహా రాలిపోతాయి.
  • తులసి విత్తులు, నల్ల ఉమ్మెత్త విత్తులు కలిపి తింటే అద్భుతంగా నిద్రపడుతుంది.
  • మానసిక పరమైన ఒత్తిళ్లతో సతమతమయ్యే స్త్రీలకు తులసి దివ్యౌషధం.
  • అందంగా ఉండే స్త్రీల జుట్టు సమస్యలు మొదలై, జుట్టురాలిపోతూంటే రోజూ గుప్పెడు తులసి ఆకుల్ని నమలడం వల్ల ఈ ఒత్తిడి దూరమై గుణం కనిపిస్తుంది. నెల్లాళ్లు గడిచేలోగానే జుట్టు రాలడం తగ్గుతుంది.
  • తులసి ఆకుల రసం కొన్నాళ్ల పాటు రోజూ వెంట్రుకలకు దట్టంగా పట్టించుకొని, ఉదయం పూట శిరః స్నానం చేస్తూంటే ఆరు నెలలుగా తెల్లజుట్టు తగ్గి నల్ల వెంట్రుకలు అధికం అవుతాయి తులసి ఆరోగ్యం ప్రయోజనాలు.

తులసి గింజలు ఎంత మోతాదులో తినాలి | Dosage of basil seeds

తులసి గింజలు మనం ఎక్కువగా తీసుకొన్న అనారోగ్యనికి గురిచేస్తుంది. అది ఎంత తక్కువగా తీసుకొంటే అంతే మేలు, ప్రతి రోజు రెండు లేదా మూడు గింజలను మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తిసుకోకుడదు.

తులసి గింజల వలన ఉపయోగలు ఏమిటి ? | Bsail seeds benefits in thelugu

  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.
  • రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
  • కీటకాల కాటును నయం చేస్తుంది.
  • రక్తపోటును తగ్గిస్తుంది.
  • శ్వాస సంబంధిత రుగ్మతలకు చికిత్స చేస్తుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది.
  • రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే తినడం వలన పైత్యం తగ్గుతుంది.
  • మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఫ్రీ గా ఉంటది.
  • తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
  • 10 గ్రాములు తులసి ఆకులు రసాన్ని, 20-30 గ్రాముల తాజా పెరుగు లేక 2-3 స్పూన్లు తేనెలో కలిపి తినడం వలన క్యాన్సర్ నయం అయ్యే అవకాశం ఉంది.
  • ప్రతి రోజు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది, ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది.
  • తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.

తులసి గింజలు కూడా కడుపు సమస్యలను దూరం చేయడంలో చాలా సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం యాసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.ముఖ్యంగా ఈ తులసి గింజలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

తులసి బీజంలో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ కారణంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు తులసి గింజల్లో చాలా ప్రోటీన్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు కనిపిస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతుంది.

తులసి గింజల వలన దుష్ప్రభావాలు | Basil seeds side effects in Telugu

గర్భిణీ స్త్రీలు అధిక పరిమాణంలో తులసిని తీసుకోవడం వల్ల, తల్లి మరియు బిడ్డ ఇద్దరూ కూడా కొన్ని విధాలుగా సమస్యలు కలిగి ఉంటారు. గర్భిణీ స్త్రీలలో గర్భాశయ సం‌కోచాలు ఏర్పడే అవకాశాన్ని తులసి కలిగి ఉంది.ఇలా కొన్ని రోగాలకి ఈ విత్తనాలు అనేవి సహాయకరంగా ఉండవు. ఈ విత్తనాలు తిసుకోనేతపుడు వైదుడిని సంప్రదించి తీసుకోవాలి. 

ఇవి కూడా చదవండి :-