High protein foods for weight loss in telugu : అందరికీ పూర్వ కాలం నుండి ధాన్యాలు, చిరుధాన్యాలు ఆహారంగా ఉన్నాయి. బియ్యం కంటే ముందు అనాదిగా రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, అండు కొర్రలు మరియు సామలు వంటివి ప్రధాన ఆహారంగా ఉండేవి.
బియ్యంతో పోలిస్తే చిరుధాన్యాలు అన్నీ కూడా ఆరోగ్యపరంగా అధిక లాభాలు కలిగిస్తాయి. బియ్యము అతి తక్కువ లాభాలు మరియు అతి ఎక్కువ జబ్బులు కలిగిస్తాయి. చిరుధాన్యాల్లో అతి ప్రధానమైనవి సజ్జలు. అన్ని ప్రాంతాలలో, అన్ని కాలాలలో సరసమైన ధర లో లభిస్తాయి.
పూర్వకాలంలో సజ్జ సంకటి, సజ్జ అప్పాలు, సజ్జలతో చేసిన స్నాక్స్, సజ్జ రొట్టెలు ఇలా అన్నింటికీ సజ్జ లే వాడేవారు. ఇవి భలే రుచిగా ఉంటాయి. బియ్యాన్ని, గోధుమలను వీలైనంత వరకు వాడకం తగ్గించాలి.
సజ్జలో ఉండే పోషకాలు వివరాలు
- 100 గ్రాముల సజ్జల లో 347 గ్రాముల కేలరీల శక్తి లభిస్తుంది. 60 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి.
- 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 5 గ్రాముల కొవ్వులు ఉంటాయి. 11.5 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి.
- సజ్జల లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి. ఈ విధంగా డయాబెటిస్ను కంట్రోల్ చేస్తాయి.
- సజ్జ లో ఉండే ఫైబర్ అంటే పీచు పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనీయకుండా చేస్తాయి.
- సజ్జ రొట్టెలు డయాబెటిస్ పేషెంట్ లకు చాలా మేలు చేకూరుస్తాయి.
- సజ్జల ను ఆహారంగా తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు.
- సజ్జలు లో ఉండే ఫ్యాట్స్ గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తాయి.
- సజ్జల వల్ల హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు మేలు చేస్తాయి.
- సజ్జల లో లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ వల్ల గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకోకుండా ఉపయోగపడుతుంది.
- సజ్జల నుండి లభించే అమైనో ఆసిడ్స్ మజిల్ బిల్డింగ్ కు తోడ్పడతాయి.
- ఈ వివరాలు అన్నీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థవారు అందించినవే.
- సజ్జలు లో ఉండే పీచు పదార్థాలు పేగులను బాగా శుభ్రం చేసి మలబద్ధకాన్ని తొలగిస్తాయి.
- లివర్లో బైల్ జ్యూస్ అధికంగా స్రవించి దాని కారణంగా గాల్బ్లాడర్లో రాళ్లు తయారవుతూ ఉంటాయి.
- సజ్జ లో ఉండే ఫైబరు లివర్ మీద ప్రభావం చూపించి బైల్ జ్యూస్ ద్రవాన్ని తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయించడం ద్వారా రాళ్లు తయారు కాకుండా చేస్తుంది.
- బరువు తగ్గాలనుకునేవారు మరియు షుగరు తగ్గించుకోవాలను కొనేవారు తప్పనిసరిగా సజ్జ రొట్టెలు ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇవి కూడా చదవండి :-
- ఇలా చేస్తే పుచ్చి పోయిన పళ్ళ నుండి పురుగులు వెంటనే పోతాయి
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
- ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !