క్రెడిట్ స్కోర్ ని ఫ్రీగా చెక్ చేసుకోవడం ఎలా?

0
how to check credit score free in telugu

How To Check Credit Score In Telugu

Credit Score : ఫ్రెండ్స్ క్రెడిట్ స్కోర్ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ ని మనం తిరిగి చేలించాగలమా లేదా అనే దానిని ఈ స్క్రోర్ డిసైడ్ చేస్తుంది. ఈ క్రెడిట్ స్కోర్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 900 వరకు ఉంటుంది.300 కంటే ఎక్కువ స్కోర్ ఉంటె బెటర్.

ఈ క్రెడిట్ స్కోర్ ని మనకి 4 క్రెడిట్ బ్యురోస్ అందిస్తాయి అవి:

  1. CIBIL
  2. Equifax
  3. CRIF
  4. Experian

ఈ బ్యురోస్ మనకి క్రెడిట్ స్కోర్ ని ప్రోవైడ్ చేయడానికి కొంత అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది.వీటిలో ఇలా అమౌంట్ పే చేసి చెక్ చేసుకోకుండా కొన్ని వాటిలో మనం ఫ్రీగా క్రెడిట్ స్క్రోర్ ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రీగా మన మొబైల్ లోనే  క్రెడిట్ స్క్రోర్ ని చెక్ చేసుకోవడానికి వీలు ఉన్నటువంటి అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం.అవి:

  1. Paytm
  2. Cred
  3. Paisa Bazaar
  4. BankBazaar
  5. google Pay

ఇప్పుడు మనం పైన తెలిపిన వాటిలో క్రెడిట్ స్క్రోర్ ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

1.How To Check Credit Score In Paytm In Telugu

ఫ్రెండ్స్ మన అందరికి paytm గురించి తెలిసే ఉంటుంది. ఇందులో మనం ఫ్రీ గా క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే :

how to check credit score in paytm telugu 2023

  1. మీ మొబైల్ లో paytm అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. ఆ యప్లో క్రిందికి వెళ్ళితే Loans and Credit Cards లో ‘Free Credit Score ఆప్షన్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి.
  3. మన క్రెడిట్ స్క్రోర్ వస్తుంది.
  4. ఈ యప్లో మనం సిబిల్, Equifax,Experian లో ఉన్నటువంటి స్క్రోర్ ని చెక్ చేసుకోవచ్చు.

Paytm Link 

2.How To Check Credit Score In Cred In Telugu

క్రేడ్ అప్లికేషన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. జనరల్ గా క్రెడిట్ కార్డు సంబంధించిన పేమెంట్స్ చేసుకోవడానికి దీనిని use చేస్తుంటారు. క్రేడ్ యప్లో కూడా మనం క్రెడిట్ స్క్రోర్ ని ఫ్రీ గా చెక్ చేసుకోవచ్చు. అది కూడా CRIF లో మన క్రెడిట్ స్కోర్ ఎంత ఉందొ ఈ అప్లికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

how to check credit score free in cred app in telugu

క్రింద మనం ఈ  అప్లికేషన్ లో క్రెడిట్ స్క్రోర్ ని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

  1. మీ యొక్క మొబైల్ లో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
  2. యాప్ ఓపెన్ చేసిన తర్వాత చివరన MORE ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయండి.
  3. CREDIT SCORE ఆప్షన్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి.
  4. మనకి సంబంధిన క్రెడిట్ స్కోర్ వస్తుంది.
  5. స్కోర్ తో పాటు మనకి ఏవైనా లోన్స్ ఉన్నా కూడా వాటి డిటైల్స్ వస్తాయి.

Cred Link

3.How To Check Credit Score In Paisa Bazaar In Telugu

క్రెడిట్  స్కోర్ ని ఫ్రీ గా చెక్ చేసుకోవడానికి వీలు ఉన్నటువంటి వాటిలో పైసా బజార్ ఒకటి. ఈ పైసా బజార్ అప్లికేషన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ అప్లికేషన్ మనకి  పర్సనల్ లోన్స్ ని ఇస్తుంది.

credit score checking in paisa bazaar in telugu 2023

ఇప్పుడు మనం పైసా బజార్ లో క్రెడిట్ స్క్రోర్ ని ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్ గా తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా పైసా బజార్ వెబ్సైట్ కి వెళ్ళండి.
  2. మీ డిటైల్స్ ఎంటర్ చేయండి. అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ వంటివి ఎంటర్ చేయండి.
  3. మీ మొబైల్ OTP వస్తుంది.దాన్ని ఎంటర్ చేయండి.
  4. మీ క్రెడిట్ స్కోర్ వస్తుంది.
  5. మనకి క్రెడిట్ స్కోర్ అందించే 4 బ్యురోస్ లో ఉన్న క్రెడిట్ స్కోర్ ని మనం ఈ అప్లికేషన్ లో ఫ్రీ గా చెక్ చేసుకోవచ్చు.

Paisa Bazar Link

4.How To Check Credit Score In Bank Bazaar In Telugu 

ఫ్రెండ్స్ మనం bank bazaar లో కూడా క్రెడిట్ స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు.క్రింద మనం ఇందులో క్రెడిట్ స్కోర్ ఫ్రీ గా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

how to check credit score in bank bazaar in telugu

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా bank bazaar వెబ్సైట్ వెళ్ళండి.
  2.  మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి get your free credit score పై క్లిక్ చేయండి.
  3. మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  4. మీ మొబైల్ కి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి.
  5. ఇప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది.
  6. అందులో క్రింద credit score ఆప్షన్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి.
  7. మీ యొక్క క్రెడిట్ స్కోర్ వస్తుంది.

Bank Bazaar Link 

5.How To Check Credit Score In google Pay In Telugu 

ఫ్రెండ్స్ మనలో గూగుల్ పే గురించి తెలియనివారు అంటూ ఎవరు ఉండరు. ఇందులో మనం మని ట్రాన్స్ ఫర్, పేమెంట్స్ చేసుకోవచ్చు. వీటితో పాటు పర్సనల్ లోన్స్ కూడా పొందవచ్చు. ఈ యప్లో మనం మన క్రెడిట్ స్కోర్ ని కూడా ఫ్రీ గా చెక్ చేసుకోవచ్చు.

credit score checking in google pay in telugu

క్రింద మనం గూగుల్ పే లో క్రెడిట్ స్కోర్ ని ఎలా చెక్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

  1. క్రింద ఇచ్చిన లింక్ ద్వారా గూగుల్ పే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
  2. app లో క్రింద check your cibil score free ఆప్షన్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి.
  3. తర్వాత కొన్ని పాయింట్స్ వస్తాయి వాటిని క్లియర్ గా చదువుకొని let’s check పై క్లిక్ చేయండి.
  4. మీ బేసిక్ డిటైల్స్ ఎంటర్ చేసి continue పై క్లిక్ చేయండి.
  5. మీ సిబిల్ స్కోర్ వస్తుంది.

google Pay Link