Table of Contents
SBI బ్యాంకు సేవింగ్ అకౌంట్స్ వివరాలు
SBI Savings Account: ఫ్రెండ్స్ మన అందరికి sbi బ్యాంకు గురించి తెలిసే ఉంటుంది. మన దేశాలోనే అతి పెద్ద బ్యాంకు. ఎక్కువ మంది ఖాతాదారులను కలిగిన బ్యాంకు. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల సేవలు అందిస్తుంది.
SBI బ్యాంకు లో మనం చాలా రకాల అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా వినియోగించే అకౌంట్ సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ లో చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
Sbi Savings Account Types In Telugu
ఫ్రెండ్స్ SBI లో 8 రకాల సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి.అవి:
- sbi Basic savings Bank Deposit Account
- sbi Basic savings Bank Deposit Small Account
- sbi Savings Bank Account
- sbi Savings Account For Minors
- sbi Savings Plus Account
- sbi Insta Plus Savings Bank Account Through Video Kyc
- sbi Motor Accidents Claim Account
sbi savings account maximum balance
ఇప్పుడు మనం ఈ అకౌంట్స్ అంటే ఏమి?, ఈ అకౌంట్స్ లో మినిమం ఎంత బ్యాలెన్స్ మైంటైన్ చేయాలి?, ట్రాన్స్ యాక్షన్ చేస్తే వాటికీ ఏమైనా లిమిట్ ఉందా ? అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1.SBI Basic savings Bank Deposit Account In Telugu
ఫ్రెండ్స్ sbi బ్యాంకు లో ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్స్ లో బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాసిట్ అకౌంట్ మొదటిది. దీనిని పేదవారు ఎక్కువగా use చేస్తుంటారు. ఎందుకంటే ఈ అకౌంట్ లో ఎటువంటి చార్జీలు, ఫీలుపే చేయాల్సిన పని ఉండదు.
వీడియో kyc కావాల్సిన డాకుమెంట్స్ ఉన్నవారు అందరూ ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. పేద ప్రజలలో పొదుపు అలవాటును ప్రోత్సహించడమే ఈ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్ద్యేశం.
SBI Basic savings Bank Deposit Account Features In Telugu
ఈ క్రింద ఈ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ సేవింగ్ అకౌంట్ కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఫ్రెండ్స్ మనం ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన పని లేదు. అంటే మినిమం బ్యాలెన్స్ 0. అందుకే చాలా మంది ఈ ఖాతాను వినియోగిస్తున్నారు.
2.Transaction Limit
ఫ్రెండ్స్ మనం ఈ బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాసిట్ అకౌంట్ లో ట్రాన్స్యాక్షన్ లిమిట్ ఉండదు.
3.ఈ అకౌంట్ అన్ని బ్రాంచులలో అందుబాటులో ఉంటుంది.
4.చెక్ బుక్ కూడా ఈ అకౌంట్ లో పొందవచ్చు.
5.బేసిక్ రూపే డెబిట్ కార్డు ని పొందవచ్చు.
6.విత్ డ్రా ఫార్మ్ ని ఫిల్ చేసి బ్రాంచ్లో మని ని విత్ డ్రా చేసుకోవచ్చు.
2.SBI Basic savings Bank Deposit Small Account In Telugu
ఫ్రెండ్స్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ లో ఈ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ ని 18 సంవత్సరాలు పైబడిన వారు ఒపెన్ చేసుకోవచ్చు.పేద ప్రజలు ఎక్కువ ఛార్జీలు లేకుండా పొదుపు చేయడాన్ని ప్రోత్సహించడమే ఈ ఖాతా యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
SBI Basic savings Bank Deposit Small Account Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ రకమైనా సేవింగ్స్ అకౌంట్ లో మనం మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మనం మినిమం బ్యాలెన్స్ 0. మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాలి అనుకుంటే 50,000 రూ.. వరకు ఉంచుకోవచ్చు.
2.Transaction Limit
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో 50,000 రూ. వరకు ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
3.బేసిక్ రూపే డెబిట్ కార్డు ని జారి చేస్తారు.
4.విత్ డ్రా ఫార్మ్ ని ఫిల్ చేసి బ్రాంచ్లో మని ని విత్ డ్రా చేసుకోవచ్చు.
5.ఈ అకౌంట్ ప్రత్యేక బ్రాంచ్‌లు మినహా అన్ని బ్రాంచ్లలో అందుబాటులో ఉంటుంది ఉదాహరణకు పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్‌లు (PBBs), స్పెషల్ పర్సనలైజ్ బ్యాంకింగ్ (SPB), మిడ్ కార్పొరేట్ గ్రూప్ (MCG) మొదలైనవి.
3.SBI Savings Bank Account In Telugu
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ మిగతా అకౌంట్స్ కంటే బెస్ట్ ఫీచర్స్ ని అందిస్తుంది. నార్మల్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి కావసిన డాకుమెంట్స్ ఉంటె ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సేవింగ్ బ్యాంకు అకౌంట్ లో మనం ఏ ఏ ఫీచర్స్ ని పొందగాలమో క్లియర్ గా తెలుసుకుందాం.
SBI Savings Bank Account Features In Telugu
ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Monthly Average Balance
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.ఎందుకంటే ఈ అకౌంట్ లో మనం నెలనెలా యవరేజ్ బ్యాలెన్స్ ని ఉంచాల్సిన పని లేదు ఎందుకంటే ఈ అకౌంట్ లో మంత్లీ యవరేజ్ బ్యాలెన్స్ నిల్. అంటే సున్నా.
2.మొబైల్ బ్యాంకింగ్ ని కూడా చేసుకోవచ్చు.
3.నామినేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
4.అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి ఆర్థిక సంవత్సరంలో మొదటి 10 చెక్కులు ఫ్రీగా పొందవచ్చు.ఆ తర్వాత 40+GST తో 10 లీఫ్ చెక్ బుక్. ఇంకా 25 లీఫ్ చెక్ బుక్ కి రూ. 75-+GST పే చేయాల్సి ఉంటుంది.
5.స్టేట్ బ్యాంకు లో ఎక్కడైనా ఈ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు.
6. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
4.SBI Savings Account For Minors In Telugu
sbi సేవింగ్స్ అకౌంట్స్ లో ఈ అకౌంట్ కూడా చాలా ముఖ్యమైనది. SBI మైనర్‌ల కోసం పెహ్లాకడం మరియు పెహ్లీ ఉడాన్ అనే రెండు పథకాలను అందిస్తుంది. వీటి ద్వారా మైనర్లు అంటే పిల్లలు అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు.
పిల్లకు పోదుపు యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడమే ఈ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. క్రింద ఈ అకౌంట్ గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.
SBI Savings Account For Minors Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ అకౌంట్ ఫర్ మైనర్స్ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
1.Maximum Balance
ఫ్రెండ్స్ మనం ఈ మైనర్స్ ఖాతాలో గరిష్టంగా 10 లక్షల వరకు అమౌంట్ ని సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఖాతాలో మనం మినిమం బ్యాలెన్స్ ని ఉంచాల్సిన పని లేదు.
2.Transaction Limit
ఈ ఖాతాలో మనం మొబైల్ బ్యాంకింగ్ లో రోజుకు 2,000 రూ.. వాడుకోవచ్చు.అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో రోజుకు 5,000 రూ. వాడుకోవచ్చు.
3.బ్రాండెడ్ పాస్‌బుక్ మరియు చెక్ బుక్ ను ఉచితంగా జారీ చేస్తారు.
4. ఈ అకౌంట్లో వడ్డీ ని 4% రోజువారీ బ్యాలెన్స్‌పై లెక్కించబడుతుంది.
5. ఇ-టర్మ్ డిపాజిట్ ఆప్షన్ ఆఫర్ ని కూడా అందిస్తుంది.
6.చెక్ బుక్ ని కూడా ఫ్రీగా అందిస్తుంది.
7 ATM కార్డు ని కూడా ఉచితంగా జారి చేస్తుంది.
5.SBI Savings Plus Account In Telugu
సేవింగ్స్ ప్లస్ ఖాతా అనేది మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీం(MODS)తో అనుసంధానించబడిన ఒక సేవింగ్స్ బ్యాంకు అకౌంట్. ఈ అకౌంట్‌లో నిర్ణీత స్థాయి మించిన తర్వాత ఉన్న అదనపు డబ్బులు ఆటోమేటిక్‌గా టర్మ్ డిపాజిట్లుగా మారిపోతాయి. ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఏమి ఫీచర్స్ ఉన్నాయో క్రింద తెలుసుకుందాం.
SBI Savings Plus Account Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద ఈ సేవింగ్స్ ప్లస్ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ సేవింగ్స్ ప్లస్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఏమి ఉండదు.అలాగే మంత్లి యావరేజ్ బ్యాలెన్స్ కూడా 0. ఇంకా మనం గరిష్టంగా ఎంత డబ్బు నైనా ఈ ఈ అకౌంట్ లో పెట్టుకోవచ్చు. దీనికి లినిట్ అంటూ ఉండదు.
2.Transaction Limit
ఫ్రెండ్స్ మనకి ఈ ఎకౌంటు లో ట్రాన్స్ యాక్షన్ లిమిట్ ఉంటుంది.మనం 10,000 రూ.. వరకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
3.ఒక సంవత్సరానికి 25 చెక్ లీవ్‌లును ఫ్రీగా ప్రోవైడ్ చేస్తుంది.
4. MOD డిపాజిట్లపై లోన్ కూడా పొందవచ్చు.
5.ఫ్రీగా ATM కార్డు ని జారీ చేస్తుంది.
6.మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ రెండింటిని ప్రోవైడ్ చేస్తుంది.
7. SBI అన్ని బ్రాంచ్ లలో ఎక్కడైనా ఈ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు.
6.SBI Insta Plus Savings Bank Account Through Video Kyc In Telugu
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ కూడా నార్మల్ సేవింగ్స్ అకౌంట్ లాగానే ఉంటుంది. కాకపోతే ఈ అకౌంట్ లో వీడియో kyc ఉంటుంది. ఈ అకౌంట్ ని మొత్తాన్ని డిజిటల్ ప్రాసెస్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. క్రింద ఈ అకౌంట్ గురించి ఇంకొంచం వివరంగా తెలుసుకుందాం.
SBI Insta Plus Savings Bank Account Through Video Kyc Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మనకి మినిమం బ్యాలెన్స్ ఉండదు. అంటే ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ 0.
2.Transaction Limit
ఫ్రెండ్స్ మనం ఈ అకౌంట్ లో 1 లక్ష వరకు అమౌంట్ ని ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఇది ఈ అకౌంట్ ఉన్న ఫీచర్స్ లో బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు.
3.ఈ అకౌంట్ ద్వారా రూపే క్లాసిక్ కార్డ్ జారీ చేస్తారు.
4.ఇంటర్నెట్ బ్యాంకింగ్ ,మొబైల్ బ్యాంకింగ్ ద్వారా 24/7 బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.
5.మనం కావాలంటే పాస్‌బుక్ ని ఫ్రీ గా ఇస్తారు.
7.SBI Motor Accidents Claim Account In Telugu
ఫ్రెండ్స్ SBI సేవింగ్స్ అకౌంట్స్ లో మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్ అకౌంట్ కూడా ఒకటి.మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) అనేది ట్రిబ్యునల్ కోర్టు ద్వారా మోటారు ప్రమాద బాధితులు క్లెయిమ్ దారులకు అందించబడిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ యాన్యుటీ డిపాజిట్ పై పరిహారం మొత్తాన్ని వడ్డీని జమ చేస్తుంది. కోర్టు అనుమతి ఉంటేనే ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి..
SBI Motor Accidents Claim Account Features In Telugu
ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం.
- ATM కమ్ డెబిట్ కార్డ్ అందుబాటులో ఉంటుంది.
- ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటుంది.
- చెక్ బుక్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
- పాస్ బుక్ ని కూడా ఇస్తారు.
- నామినేషన్ సౌకర్యం వ్యక్తికి మాత్రమే ఉంటుంది
8.SBI Resident Foreign Currency (Domestic) Account In Telugu
ఫ్రెండ్స్ మన దేశంలో విదేశాల కారేన్సి ని కొందరూ సంపాదిస్తూ ఉంటారు. ఇలా సంపాదించే వారు తమ కరెన్సీ ని ఈ అకౌంట్ లో పొదుపు చేసుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలి అంటే విదేశీ కరెన్సీ ఉన్నవాళ్లు ఈ అకౌంట్ లో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు.
SBI Resident Foreign Currency (Domestic) Account Features In Telugu
ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ అకౌంట్లో USD లో అయితే 500 రూ.., GBP అయితే 250 రూ..,EURO అయితే 500రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది.
2.ఇందులో atm కార్డు ఉండదు.
3. పాస్ బుక్ కూడా ఉండదు. అంటే ప్రోవైడ్ చేయరు.
4.ఇది ఒక వడ్డీ లేని కరెంట్ అకౌంట్.