అల్లం తినేవారు ఈ రెండు తప్పులు అస్సలు చేయకండి – ప్రాణాలకే ప్రమాదం

0
అల్లం ఎలా తినాలి
అల్లం ఎలా తినాలి

వంటింట్లో ఉపయోగించే అన్ని ఔషధాల్లో కి అల్లం చాలా మేలు చేసే రకానికి చెందినది. ఎండకాలం మరియు వర్షాకాలంలో కూడా ఇది అందరికీ మంచే చేస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే జలుబు, దగ్గు, కఫము, వికారము వంటి వాటికి అల్లం బాగా పనిచేస్తుంది.

అల్లం ఎంత మేలు చేస్తుందో అంతే కీడు చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే అల్లాన్ని తీసుకోవాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదం.

అల్లం వాడేటప్పుడు జాగ్రత్తలు:-

  • అల్లాన్ని జాగ్రత్తగా వాడకపోతే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురికావల్సి ఉంటుంది. అల్లం సర్వరోగ నివారిణిగా పేరు తెచ్చుకుంది.
  • కానీ అతిగా వాడితే చెడు ఎక్కువగా జరుగుతుంది.
  • గర్భిణీలు ముఖ్యంగా అల్లం అధికంగా వాడకూడదు.
  • గర్భధారణ సమయంలో అల్లాన్ని తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి.
  • బరువు తక్కువగా ఉన్నవారు అల్లాన్ని మితిమీరి ఉపయోగించకూడదు.
  • ఎందుకంటే ఇది శరీరంలో ఉండే కొవ్వును కరిగించి వేస్తుంది.
  • అల్లం అతిగా వాడితే కొన్ని రకాల జీర్ణాశయ సమస్యలు ఎదుర్కొంటారు.
  • టాబ్లెట్స్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు మరియు ఆపరేషన్ చేయించుకున్నవారు అల్లం అధికంగా తీసుకోకూడదు.
  • ఎందుకంటే ఇది మీరు వాడే మందులను పనిచేయకుండా చేస్తుంది.
  • ఇన్సులిన్ ఇంజక్షన్ మరియు బిపి టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు అల్లాన్ని ఎక్కువగా వాడకూడదు.
  • రక్తహీనత సమస్యతో బాధపడేవారు అల్లాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.
  • హైబీపీతో బాధపడేవారు అల్లాన్ని అతిగా తీసుకోకూడదు.
  • ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు అల్లంతో తయారుచేసిన క్రీములను పూతగా పూయకూడదు
  • ఎందుకంటే ఇది మంటను ఇంకా అధికం చేస్తుంది.
  • విటమిన్ C B3 B6 విటమిన్లు, మెగ్నీషియం సల్ఫర్ వంటి పోషకాలు అల్లం నుండి లభిస్తాయి.
  • కూరలలో అల్లం ఉపయోగించి తీసుకోవచ్చు.
  • కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
  • ప్రతి ఒక్కరూ రోజుకు 5 నుంచి 6 గ్రాములు అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే.
  • అల్లాన్ని ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • అల్లం తేనె కలిపి ఎక్కువసార్లు తాగుతూ ఉంటే ఛాతిలో మంట, గుండెలో మంట వంటివి కలుగుతాయి.
  • రాత్రిపూట నిద్రకు ముందు అల్లం టీ తాగితే నిద్ర సరిగా రాదు.

ఇవి కూడా చదవండి :-

  1. పీరియడ్స్ టైం కి రావాలంటే ఏం చేయాలి ? ఇంటి చిట్కాలు ఇవే !
  2. రణపాల ఆకు తో ఎన్ని లాభాలో – తెలిస్తే వదలరు
  3. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు