మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు

0
Tamalapaku benefits in telugu -betel leaf benefits for male
Tamalapaku benefits in telugu -betel leaf benefits for male

Tamalapaku benefits in telugu -betel leaf benefits for male

సమాజం లో అనేక మంది అనేక రకాల జబ్బులు, రోగాలతో బాధ పడుతుంటారు. రోగాలకు మందుల కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. చాలావరకు రోగాలు మరియు జబ్బులకు మన ఇంటి పెరటిలోన లేదా టెర్రస్ మీద పెరుగుతున్న మొక్కలు లేదా ఆకుల నుండి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు.

అలాంటి ఆకులలో ముఖ్యమైనది తమలపాకు. సహజంగా ఎదుర్కొనే సమస్యలు అయిన తలనొప్పి, జ్వరం, కాళ్ల నొప్పులు మరియు కీళ్ల నొప్పులు వంటి రోగాలకు ఈ తమలపాకు సంజీవని లాగా పనిచేస్తుంది.

తమలపాకులు ఔషద గుణాలు ( Tamalapaku benefits in telugu )

  • మీకు ఆకలిగా లేదు అని అనిపించినప్పుడు రెండు తమలపాకులు తీసుకుని నేరుగా వాటిని నమిలి మింగడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దీని వల్ల ఆకలి శక్తి పెరుగుతుంది మరియు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
  • ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఏమిటంటే మీరు ఎప్పుడూ కూడా తమలపాకు తొటిమ తో పాటు తినకూడదు.
  • ఎందుకంటే తమలపాకు తొటిమ తినడం వల్ల స్త్రీలలో సంతాన సమస్యలు, పురుషుల్లో లైంగిక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు రావడానికి అనేక రసాయనాలు ఇందులో ఉంటాయి.
  • కాబట్టి సంతానం కావాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా తొడిమలు తీసి వేసి తమలపాకు తినాలి.
  • తమలపాకులు ఎప్పుడూ కూడా లేతగా తాజాగా ఉన్న వాటిని మాత్రమే తినాలి. పది లేత తమలపాకులు తీసుకుని వీటిని బాగా రుబ్బి ఆ రసాన్ని తీసుకుని, ఆ రసం లో కి తేనె కలిపి ఉదయాన్నే తీసుకోవాలి.
  • ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా శ్వాస బాగా ఆడుతుంది.
  • అలాగే ఒక లేత తమలపాకులో మిరియాలు తేనె కలిపి బాగా నమిలి మింగాలి. ప్రతి రోజు రెండు పూటలా ఇలా చేస్తే గొంతు లో కఫం పూర్తిగా మాయమవుతుంది.
  • ఇది ఒక టానిక్ వలే పనిచేస్తుంది గొంతులో దగ్గు మరియు గరగర వంటి సమస్యలు దూరమవుతాయి.
  • రెండు తమలపాకులను మెత్తగా పేస్ట్ లా చేసి అందులో నుండి రసాన్ని వడగట్టి దానికి పాలు కలిపి తాగాలి.
  • అందులో కొన్ని చుక్కల తేనె కూడా కలిపి తీసుకోవడం వల్ల మీకు తెలియకుండానే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
  • తమలపాకు లో ఉండే రసాయనాలు శరీరంలో ఉండే బ్యాక్టీరియాలను చంపుతుంది. అలాగే విషజ్వరాలు, వైరస్లు, ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడుతాయి.
  • తమలపాకు ఆముదం లో గోరువెచ్చగా చేసి ఛాతీ మీద ఉంచడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ప్రధానంగా వర్షాకాలంలో వచ్చే ఆస్తమా లక్షణాలను దూరంగా ఉంచుతాయి.
  • పది తమలపాకులను తీసుకుని రెండు గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగించాలి చివరకు ఒక గ్లాసు నీరు మిగిలేలా, అంతవరకు మరిగించిన తర్వాత ఆ నీటికి తేనె కలిపి వేడిగా ఉన్నట్లే ప్రతి రోజు పరగడుపున తాగితే ఎలాంటి దగ్గు ఉన్నా తగ్గిపోతుంది.
  • ఈ తమలపాకు రసానికి పటిక బెల్లం కూడా కలిపి తాగవచ్చు.
  • మీ శరీరం నుండి ఏదైనా దుర్వాసన వస్తుంటే ప్రతిరోజు మధ్యాహ్నం రెండు తమలపాకులను బాగా మరిగించి ఆ రసానికి తేనె కలిపి తాగుతూ ఉంటే శరీరం దుర్వాసన తొలగించవచ్చు.
  • ముక్కు నుండి రక్తం కారే సమస్య :- లేత తమలపాకు బాగా నూరి ముక్కు నుండి రక్తం కారే సమస్య ఉన్నప్పుడు ముక్కు దగ్గర పెట్టుకొని బాగా వాసన చూడాలి.
  • గజ్జి తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది. శరీరం మీద వచ్చిన పొక్కులు కూడా తమలపాకులు నూరి ఆ పేస్ట్ను పూతగా పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • లేత తమలపాకులు బాగా మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత కళ్లను కడిగితే కళ్ళలో ఉండే దురదలు, మంటలు తగ్గిపోతాయి. కళ్ళు ఎర్రగా ఉండకుండా మామూలుగా ఉంటాయి.
  • జననేంద్రియ ప్రాంతాలు, మర్మాంగాల చోట దుర్వాసన మరియు దురదలు ఉంటే, తమలపాకులు మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ దురదలు ఉండే ప్రాంతంలో కడుగుతూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.
  • తమలపాకు మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతిరోజు పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
  • కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు తమలపాకును బాగా నలిపి దానితోపాటు పాలు కలుపుకొని తాగడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.
  • మైగ్రేన్ వంటి తలనొప్పితో బాధపడేవారు తమలపాకు నుదుటిమీద ఉంచడం ద్వారా లేదా తమలపాకు రసాన్ని నుదుటి మీద మసాజ్ చేయడం ద్వారా మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.
  • డిప్రెషన్ సమస్యతో బాధపడేవారు తమలపాకులు నమలడం ద్వారా డిప్రెషన్ తగ్గుతుంది.
  • తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉంటే తమలపాకులు నమలడం ద్వారా అందులో ఉండే రసాయనాలు జీర్ణశక్తి మీద ప్రభావం చూపిస్తాయి దీనిద్వారా తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
  • శరీరం మీద ఏర్పడిన గాయము ఏదైనా వాపులు వంటి వాటి మీద తమలపాకులు పట్టులాగా వేయడం ద్వారా లేదా తమలపాకు రసాన్ని పూయడం ద్వారా గాయాలు, వాపులు తగ్గించవచ్చును.
  • తమలపాకులను పేస్టులా చేసుకుని ఆ పేస్ట్ ను కీళ్ల నొప్పులు మరియు మోకాలు నొప్పులు ఉండేచోట మసాజ్ చేయడం ద్వారా నొప్పులు తగ్గుతాయి.
  • ఊపిరితిత్తులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే, తమలపాకు రసం లోకి అల్లం రసం కలిపి దీనిని తాగుతూ ఉంటే ఊపిరితిత్తుల సమస్యలు నివారించవచ్చును.
  • కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారు పరగడుపున తమలపాకులు నమిలి మింగాలి.
  • తమలపాకులను క్రమం తప్పకుండా తింటూ ఉండే వారికి ముఖం మీద ఎలాంటి మచ్చలు, మొటిమలు, ముడుతలు లేకుండా యవ్వనంగా కనిపిస్తారు.
  • తమలపాకులు ఆముదంతో వేడి చేసి ఛాతీ మీద ఉంచితే జలుబు తగ్గుతుంది.
  • తమలపాకులను పేస్టులాగా బాగా నూరి తలకు పట్టించి తలస్నానం చేస్తూ ఉంటే వెంట్రుకల సమస్యలు అన్ని తొలగిపోతాయి.
  • మగవారు లైంగిక సామర్థ్యం పెంచుకోవాలనుకుంటే తమలపాకును తింటూ ఉండాలి.
  • నోటిలో పుళ్ళు, చిగుళ్ల సమస్యలు మరియు దంత సమస్యలు వంటివి నివారించడానికి తమలపాకులను క్రమం తప్పకుండా తింటూ ఉండాలి.

గమనిక:- తమలపాకులను అధికంగా తింటూ ఉంటే క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రక్తపోటు కూడా పెరుగుతుంది. తమలపాకులను ఔషధం లాగా మితంగా మాత్రమే తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి :-

  1. ఒక్క నిమిషంలో పసుపు పచ్చగా ఉండే మీ పళ్ళను తెల్లగా మార్చుకోండి
  2. రాత్రి పూట ఎక్కువగా మూత్రం రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
  3. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
  4. ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
  5. ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
  6. ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !