How to make teeth white naturally from yellow in telugu
కేవలం రెండు నిమిషాలలో పసుపు పచ్చగా ఉండే పళ్ళు తెల్లగా మెరిసిపోవాలంటే? మీ పళ్ళు పసుపు పచ్చగా ఉన్నాయా? మీ పళ్ళు గార పట్టి ఉన్నాయా?
మీకోసం ఇక్కడ ఒక చిట్కాను తెలియజేస్తున్నాను. ఇందుకోసం ప్రధానంగా అవసరమైనవి లవంగాలు. మన పళ్ళు పసుపు పచ్చగా మారాయి అంటే దానికి కారణం మన పళ్ళు డ్యామేజ్ కు గురి అవుతున్నాయని ఒక వార్నింగ్ లాంటి సూచన అని చెప్పవచ్చు.
మన పళ్ళ పై బ్యాక్టీరియా క్రమేణా పెరిగిపోవడం వల్ల పసుపు పచ్చగా మారుతాయి. ఇలా పసుపు పచ్చగా మారిన పళ్ళు నిదానంగా పుచ్చి పోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పసుపు పచ్చ గారను తొలగించుకోవాలి.
Cloves benefits in telugu : లవంగాల ద్వారా ఈ పసుపుపచ్చగార ను తొలగించవచ్చు. లవంగాలు యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి.
ఇందుకోసం మొదటగా లవంగాలను బాగా ఎండబెట్టి ఆ తర్వాత గరుకు పొడిగా తయారు చేయాలి. ఇలా గరుకు పొడిగా తయారు చేసుకుని దీనిని బ్రష్ మీద వేసుకుని బ్రష్ చేయడం వల్ల పసుపు పచ్చని గారను సులభంగా తొలగించవచ్చు.
కొన్ని లవంగాలు తీసుకుని గరుకు పొడి తయారు చేసుకుని గిన్నెలో పోసుకోవాలి. తర్వాత రెండు వెల్లుల్లి ముక్కలు వేయాలి. వీటిని బాగా దంచి లవంగాల పొడి ఉన్న గిన్నెలోకి వేయాలి. వెల్లుల్లి మన దంతాలను శుభ్రం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి.
వెల్లుల్లి మన దంతాల మీద ఉన్న పసుపు పచ్చ రంగు గార పోగొట్టడమే కాకుండా మన కంటికి కనిపించకుండా ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తుంది. తర్వాత ఈ గిన్నె లో కి అరచెంచా ఉప్పు చేర్చాలి.
ఉప్పు కూడా పళ్ళ మీద ఉన్న పసుపు పచ్చ రంగు గార పోయే విధంగా చేసి, బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. చివరగా ఈ గిన్నె లోకి మీ ఇంట్లో ఉపయోగించే టూత్ పేస్ట్ రెండు చెంచాలు వేయండి. ఒక చెంచా తో ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలియబెట్టాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక రోజే కాకుండా రెండు నుంచి మూడు రోజులపాటు ఉపయోగించుకోవచ్చు. చాలా రోజుల పాటు మొండిగా ఉన్న ఈ గారను ఈ మిశ్రమం తొలగిస్తుంది. మామూలుగా మీరు ఉదయం పూట ఎలా బ్రష్ చేసుకుంటారో అలాగే బ్రష్ చేసుకోవడానికి ఈ మిశ్రమాన్ని వాడాలి.
క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని బ్రష్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటే నిదానంగా పళ్ళ మీద ఉన్న పసుపుపచ్చగార తొలగిపోయి మీ దంతాలను తెల్లగా మార్చుతుంది. కేవలం రెండు వారాల్లోనే మీ పళ్ళ మీద ఉన్న గార తొలిగిపోవడమే కాకుండా పళ్లు పుచ్చిపోకుండా ఉండటం మీరు గమనిస్తారు.
ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వాడితే, పళ్ళ మీద ఉండే గార మరియు బ్యాక్టీరియా వల్ల కలిగిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తొలిగిపోతాయి.
ఇవి కూడా చదవండి :-
- ఈ ఒక్క ఆకుతో ఒబెసిటీ,గుండెవ్యాధులు,షుగర్,గ్యాస్ పూర్తిగా మాయం
- ఇలా చేస్తే పుచ్చి పోయిన పళ్ళ నుండి పురుగులు వెంటనే పోతాయి
- ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి
- ఇలాంటి వారికి నిద్ర లోనే ప్రాణం పోతుంది
- ఈ రసం తాగితే 50 రకాల జబ్బులు మీ దరి చేరవు
- ఒక్క నిమిషంలో మీ దురదను ఇలా పోగొట్టండి !