బిళ్ళ గన్నేరు మొక్క మీ ఇంట్లో ఉంటె జరిగేది ఇదే ! వెంటనే తెలుసుకోండి.

0
Billa ganneru plant uses in telugu
Billa ganneru plant uses in telugu

Billa ganneru plant uses in telugu | బిళ్ళ గన్నేరు చెట్టు ఉపయోగాలు

బిళ్ళ గన్నేరు మొక్క మీ ఇంట్లో ఉందా?
ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలు, మూలికలను అందించింది. కొన్నిరకాల మొక్కల్లో ప్రతి ఒక భాగము మన శరీరం యొక్క అనారోగ్య సమస్యలను తొలగించడానికి ఉపయోగపడుతుంది.

బిళ్ళ గన్నేరు మొక్క ప్రయోజనాలు

బిళ్ళ గన్నేరు మొక్క ను నిత్య కళ్యాణి , నిత్య పుష్పి అనే పేరుతో పిలుస్తారు. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఈ మొక్కలోని పువ్వులు, ఆకులు, వేర్లు అనేక రకాల రోగాలకు మందుగా ఉపయోగపడతాయి.

*క్యాన్సర్, షుగర్ వంటి భయంకరమైన వ్యాధులను ఈ మొక్క అడ్డుకుంటుంది. ఈ మొక్క యాంటీ ఫంగల్, యాంటీ బయోటిక్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలను కలిగి ఉంటుంది.

*ఈ మొక్కలు నాలుగు వందలకు పైగా ఆల్కలాయిడ్ కెమికల్స్ ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్ మన శరీరంలో రక్తాన్ని పలుచగా ఉండేటట్లు చేస్తుంది.

*జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. ఆయుర్వేదంలో రక్తప్రసరణకు ఉపయోగించే వారని శాస్త్రం చెబుతున్నది.

*షుగర్ వ్యాధికి బిల్లగన్నేరు రామ బాణం లాగా పనిచేస్తుంది. బిల్లగన్నేరు వేర్లను నీటిలో బాగా కడిగి ఎండబెట్టి పొడిచేసుకుని, గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకోవాలి.

ఉదయం పరగడుపున ముఖ్యంగా ఆహారానికి ముందు ఒక స్పూన్ పొడి, ఒక స్పూన్ తేనె కలుపుకుని తినాలి. ఒక నెలరోజులు ఇలా చేస్తే షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. కేవలం షుగర్ మాత్రమే కాకుండా క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది.

*బిల్ల గన్నేరు వేర్లను టీ చేసుకుని తాగితే క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది.

*హైబీపీ తో బాధపడేవారు ఈ ఆకులను కడిగి రసం తీసుకుని తాగితే బిపి కంట్రోల్ అవుతుంది.

*8 బిల్లగన్నేరు ఆకులను ఒక గ్లాసు నీళ్ళలో బాగా మరిగించి, అర గ్లాసు నీళ్ళు మిగిలే వరకు మరిగించాలి. ఈ నీటిని స్త్రీలు పీరియడ్స్ టైం లో తాగితే పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

*గాయాలు, పుండ్లకు ఈ ఆకులను పేస్టులాగా అప్లై చేస్తే తగ్గిపోతాయి. నోట్లో పుండ్లు, అల్సర్లకు ఈ ఆకుల రసాన్ని నోట్లో ఉంచుకుని నోరు శుభ్రం చేస్తే తగ్గిపోతాయి.

*ముఖం మీద మచ్చలు, మొటిమలు పోగొట్టుకోవడానికి బిళ్ళ గన్నేరు ఆకులను ఎండబెట్టి పొడి చేసి, దీనికి వేపాకు మరియు పసుపు కలిపి పేస్టులాగా చేసి ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

*కీటకాలు కుట్టిన చోట బిల్ల గన్నేరు ఆకు రసం పూస్తే ఫలితం ఉంటుంది.

*మానసిక సమస్యలతో బాధపడే వారు నిద్రలేమి సమస్య ఉండేవాళ్ళు ఆకుల రసాన్ని తాగితే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

*కిడ్నీ సమస్యలు ఉన్న వారు బిళ్ళగన్నేరు వేర్లను కషాయంలాగా మరిగించి, మిరియాలపొడి వేసుకుని తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి :-

  1. తెల్ల జుట్టు నల్లగా రావడానికి ఏం చేయాలి ?
  2. ఈ డ్రింక్ తాగితే చాలు ఒంట్లో వేడి ఉండదు, మూత్రంలో మంట ఉండదు
  3. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  4. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here