రాశిఫలాలు | Rashi Phalalu
Rashi Phalalu In Telugu: రాశి ఫలాలు అనేవి ప్రతి ఒక్క మనిషి అవసరం, ప్రతి రోజు వారి యొక్క రాశి ఫలం ఎలా ఉంది, అని బుక్స్, న్యూస్ పేపర్స్, టీవీ లో చూసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసు కొందాం. జ్యోతిష్యం ప్రకారం ఇవాళ ఎ ఎ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరికి అనుకూలంగా ఉందో లేదు? జ్యోతిష్య పండితులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఆ వివరాలను ఇక్కడ ఇప్పుడు తెలుసుకొందం.
ఇవాళ పలు రాశుల వారికి చాలా బాగుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. మరికొందరికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పలు రాశుల వారు మోసపోయే ప్రమాదముంది. జాగ్రత్తగా ఉండాలి. ”మేషం” నుంచి ”మీనం” వరకు నేటి దిన ఫలాలు.
మేష రాశి
గురు, శనుల బలం ఉన్నందువల్ల ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తిలో ఒత్తిడి ఉన్నా ఫలిత౦ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలు పాటించాలి.
వృషభ రాశి
అనుకోకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తు౦ది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. దాదాపు అన్నిటా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కొద్దిగా మోసపోయే ప్రమాదం ఉంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.
మిథున రాశి
ఉద్యోగంలో మార్పునకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆదాయం పెరిగీ అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి.
కర్కాటక రాశి
ఒక ప్రధాన కుటుంబ సమస్యకు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పరవాలేదు.
సింహ రాశి
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, తిప్పట ఎక్కువగా ఉంటుంది.
కన్య రాశి
ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి కూడా అవకాశ౦ ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నమ్మించి మోసగించేవారితో జాగ్రత్త. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
తుల రాశి
ఉద్యోగంలో కొన్ని అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. సొంత నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబపరంగా సమస్యలున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. డబ్బు జాగ్రత్త.
వృశ్చిక రాశి
ఉద్యోగ, వివాహపరంగా కొంత కాలంగా చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి బంధువులతో అనందంగా గడుపుతారు. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండొద్దు.
ధనస్సు రాశి
ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో, ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంటా బయటాబాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
మకర రాశి
అదృష్ట యోగం ఉంది. తలచిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటా బయటా శుభమే జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. వివాదాలకు ఇది సమయం కాదు. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంది.
కుంభ రాశి
ఆర్థిక సంబంధమైన విషయాలకు అనుకూలమైన సమయం ఇది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ద పెంచాలి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. భాగస్వామ్యం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి, పని ఒత్తిడి ఉంటుంది. చెడు ఆలోచనలను దగ్గరకి రానివ్వవద్దు.
మీన రాశి
ఉద్యోగపరంగా మంచి సమాచారం అందుకుంటారు. అనుకోకుండా ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆరోగ్యం మీద కాస్తంత శద్ధ పెంచాలి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సన్నిహితులు, మిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి.
ఇవి కూడా చదవండి :