పుట్టు మచ్చలు వాటి ఫలితాలు | Puttumachalu Vati Phalithalu In Telugu
పుట్టు మచ్చలు వాటి ఫలితాలు :- పుట్ట మచ్చలు వల్ల చాల మందికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి మచ్చల వల్ల చెడు జరుగుతుంది. పుట్ట మచ్చలు అనేవి సహజంగా ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికి పుట్ట మచ్చలు ఉంటాయి. పుట్ట మచ్చలు మన పుట్టుకతోనే వస్తాయి. మరికొన్ని మనం పెద్దగా అయ్యే కొద్ది మచ్చలు పుడుతాయి.
అయితే ఈ పుట్ట మచ్చలు శరీరంలో ఏ చోట ఉండడం ద్వారా ఫలితం వస్తుంది. పుట్ట మచ్చలు ఏ చోట ఉంటె మనకి చెడు జరుగుతాయి. మగవారికి ఎటువైపు ఉండాలి, ఆడవారికి ఎటువైపు ఉండాలి అనే అన్ని విషయాలు తెలుసుకుందాం.
పుట్టు మచ్చల ఫలితాలు ఏమిటి | Puttu Machala Phalithalu Telugu Lo
పుట్ట మచ్చలు రావడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
- ఎడమ కన్ను మీద :- స్వార్జిత ధనార్జన
- కుడికన్ను :– అనుకూల దంపత్యము
- ముక్కు మీద :- కోపము, వ్యాపార దక్షత
- గడ్డము :- విశేష ధన యోగము
- నుదిటి మీద :- మేధావి, ధనవంతులు
- దవడ యందు :- ఏడిచే వారు
- ముక్కు పక్కన :- దేశ సంచారి
- గడ్డ మందు :- ధనము కీర్తి
- పెదవుల మీద :- చమత్కారులు
- ముక్కు మీద :- కార్య సిద్ధి
- చెక్కిలి మీద :- సకల భోగాలు
- ఎడమకన్ను బొమ్మ :- దూరదృష్టం
- కుడి కన్ను బొమ్మ :- ధవంతులతో వివాహం
- ఎడమ కనత :- అపజయాలు, దూరదృష్టం
- ఎడమ కనత :- ధన లాభం, కీర్తి, ప్రతిష్టలు.
ఇంత వరకు పుట్ట మచ్చలు వాటి ఫలితాలు తెలుసుకొన్నారు కదా ఇప్పుడు మరికొన్ని శరీరంలో ఏ చోట ఉంటె ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.
- తోడ :- పురుషులలో మరియు స్త్రీల్లో తొడ మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వస్తుంది. అంతేకాక వారికీ ఆనందంతో పాటు గొప్ప సంపద వస్తుంది అని అర్థం.
- ముక్కు మీద :- చాలా మంది పురుషులు మరియు మహిళల్లో ముక్కు మీద పుట్టుమచ్చ ఉండటం సర్వ సాధారణం. వారిలో ఎక్కువ ఆలోచన, సృజనాత్మకత మరియు చాలా అనూహ్య లక్షణాలను సూచిస్తుంది.
- కాళ్ళు:- పురుషులు మరియు మహిళల్లో కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే వారు వారి సొంత కాళ్ళ మీద నిలబడతారు.
- భుజాలు :- పురుషులు మరియు మహిళల్లో ఎడమ భుజం మీద ఉంటే ఆర్థిక సంక్షోభంను సూచిస్తుంది. అదే కుడి భుజం మీద ఉంటే అదృష్టాన్ని సూచిస్తుంది.
- పాదాలమీద :- పురుషులు మరియు మహిళల్లో ఎడమ, కుడి పాదాల మీద ఉంటే కార్యసాధన ఎక్కువ. అదే విధంగా ఒకరి పట్ల ఎక్కువ ఒకరు ఇష్టం కలిగి ఉంటారు.
- వ్రేళ్ళ మీద :- పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో ఎడమ,కుడి వెళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే, వారు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు.
- వీపు మీద :- పురుషులు మరియు మహిళలలో వీపు మీద పుట్ట మచ్చ ఉంటె వారు ఎక్కువ నిజాయితీ మరియు ఒక ఓపెన్ మైండెడ్ వ్యక్తి అని సూచిస్తుంది.
- దవడ :- పురుషులు మరియు మహిళలలో దవడ మీద పుట్ట మచ్చ ఉంటె వారికి చెడు ఆరోగ్యం మరియు క్రమరహితమైన జీవనశైలిని సూచిస్తుంది.
- చేతులు మీద :- పురుషుల భుజాల మీద పుట్టుమచ్చ ఉంటే అతడు కుటుంబం పట్ల ప్రేమతో కలిగి ఉంటాడు అని, అదే మహిళల్లో భుజాల మీద మచ్చ ఉంటె ఇతరుల పాట్ల కేరింగ్ గా ఉంటారు అని అర్థం.
- నుదురు మీద :- మగవారిలో మరియు మహిళలలో నుదురు మీద పుట్ట మచ్చ ఉంటె వారు జీవితాల్లో అనేక ప్రేమ వ్యవహారాలు ఉంటారు.
- నుదురు ఎడమ వైపు :- ఈ పుట్టుమచ్చ స్థానం పురుషులు మరియు మహిళలకు ఒక అవరోధంగా ఉంటుంది. మీ మార్క్ మీ నుదిటి ఎడమవైపు ఉంటే మీరు డబ్బును బాగా ఖర్చు పెట్టె ధోరణి కలిగి ఉంటారు.
- నుదురు కుడి వైపు :- పురుషులు మరియు స్త్రీలలో పుట్టుమచ్చ నుదురు కుడి వైపు ఉంటే వారు గొప్ప మానసిక శక్తి కలిగి ఉంటారని అర్ధం.
- గడ్డం మీద :- పురుషులలో పుట్టుమచ్చ గడ్డం మీద ఉంటే, వారు చాలా నిగ్రహం కలిగిన వ్యక్తి అని సూచిస్తుంది. ఒక మహిళ గడ్డం మీద ఒక పుట్టుమచ్చ ఉంటే, వారు కుటుంబం యొక్క బెస్ట్ విజేత అని అర్థం.
- ఛాతీ మీద :- ఛాతి యొక్క మధ్యలో ఛాతీ యొక్క మధ్యలో పుట్టుమచ్చ ఉంటే మగవారికి మరియు ఆడవారికి వారికి ఎటువంటి ఆనందం మరియు భాగ్యం ఉండవు.
- కుడి రొమ్ము కింద:- కుడి రొమ్ము కింద పుట్టుమచ్చ ఉన్న ఆ వ్యక్తులకి అదృష్టంతో ఆనందిస్తారని సూచిస్తుంది.
- నోరు దగ్గర :- పురుషులకి పుట్టుమచ్చ నోటి దగ్గర ఉంటే వారు గొప్ప సంపద మరియు ఆనందాన్ని కలిగి ఉంటారని అర్థం. మహిళలు అయితే వారు చాలా సున్నితమైన స్వభావం మరియు చురుకుగా ఉంటారు.
గమనిక :- పైన ఇచ్చిన సమాచారం మాకి అందిన information ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే. మీకు పుట్ట మచ్చల వలన ఎలాంటి సందేశం ఉన్న వెంటనే పండితుడిని కలవండి.
ఇవి కూడా చదవండి :-