శని త్రయోదశి 2022 ఈ 6 రాశుల కాసుల పండగే

0
శని త్రయోదశి 2022 తేదీ విశిష్టతలు

180 ఏళ్ల తర్వాత వస్తున్న శని త్రయోదశి జనవరి 15 నుండి ఈ 6 రాశుల వారికి ఊహించని ధన యోగం ఎలా ఉండబోతోంది అన్న వివరాలు ఇపుడు  విపులంగా తెలుసుకోండి.

జనవరి 15వ తేదీ రాబోతున్న శని త్రయోదశి ఎంతో ప్రత్యేకత కలిగిన రోజు. సంక్రాంతి పండుగ దినాలలో వస్తున్న ఈ శని త్రయోదశి కి ఎంతో విశిష్టత కలదు. 180 ఏళ్ల తర్వాత మాత్రమే ఇలాంటి శని త్రయోదశి విశిష్టత రాబోతుంది. కార్తీక, మాఘ వంటి పవిత్రమైన మాసాల్లో మాత్రమే ఈ శని త్రయోదశి వస్తుంది.

సాధారణంగా శని త్రయోదశి తిథులు వస్తూ ఉంటాయి కానీ ఈ అరుదైన శని త్రయోదశి కేవలం 180 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన రోజు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయిన మొదటి రోజునే ఈ శని త్రయోదశి ఏర్పడుతుంది. ఈ శని త్రయోదశి మరణ భయాన్ని పోగొడుతుంది. ఈ శని త్రయోదశి రోజున వారు కోరుకునే కోర్కె లేదా సంకల్పాన్ని బట్టి దైవారాధన చేస్తే తప్పకుండా నెరవేరుతుంది.

సాధారణంగా శని త్రయోదశి అంటే శని దేవునికి సంబంధించినది అని అనుకుంటారు కానీ ఇది నిజం కాదు. శని త్రయోదశి కేవలం శివకేశవులకు సంబంధించిన రోజు. ఎలాగంటే శనివారానికి అధిపతి నారాయణుడు. ఈ నారాయణుడు లక్ష్మీ సమేతుడై త్రయోదశి రోజున రావిచెట్టు లోకి ప్రవేశించడం జరుగుతుంది.

అందుకే శనివారం రోజున రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక త్రయోదశి తిథి కి అధిపతి కాముడు అంటే శంకరుడు. ఈశ్వరునికి ఉన్న అనేక పేర్లలో ఇది కూడా ఒకటి.

శని త్రయోదశి సంధ్యా సమయాన ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు. దీన్ని ప్రదోషం కాలంగా చెబుతారు. ఈ ప్రదోష కాలంలో మనం చేసే పరిహారాల వల్ల వందల రెట్ల ఫలితాలను పొందుతామని పురాణాలు చెబుతున్నాయి. శని త్రయోదశి సంధ్యా సమయాన కర్కాటక లగ్నం ఉంటుంది. ఈ ప్రదోష కాలం చాలా విశేషమైనది.

శని త్రయోదశి ఏ రాశుల వారికి శుభ ఫలితం

గత జన్మల కర్మ దోషాలకు అధిపతి శని దేవుడు. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్టనష్టాలు బాధలకు కారణం గత జన్మలో మనం చేసిన కర్మ పనులు. చాలామంది శనిదేవుని నిందిస్తూ ఉంటారు, కానీ ఇది తప్పు ఎందుకంటే శనిదేవుని ఫలితంగా కర్మబంధాలు కలుగుతాయి.

వివాహం మరియు ఇల్లు కట్టడం వంటివి శని దేవుని అనుగ్రహం వల్ల కలిగేవి. శని దేవుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి 2022 అంతట శని ప్రభావానికి గురి అయ్యేటువంటి కొన్ని రాశులు ఉన్నాయి.

మకర రాశి వారికి జన్మశని, మేష రాశి వారికి కంటక శని, మిధున రాశి వారికి అష్టమ శని, తులా రాశి వారికి అర్దాష్టమ శని, వృషభ మరియు కన్యరాశి వారికి యోగ శని, కర్కాటక రాశి వారికి దాంపత్య శని, మేష, వృషభ, కర్కాటక, మిధున, తుల, ధనుస్సు, మకర మరియు కుంభ రాశుల వారు ఈ శని దేవుని ప్రభావానికి గురి అవుతారు.

కాబట్టి శని సంచారం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇందులో ముఖ్యంగా మేష రాశి వారికి కంటక శని ఉంటుంది కాబట్టి ప్రదోష కాలంలో దైవారాధన చేయవలసి ఉంటుంది. శనిదేవుని ఆగ్రహం పొందకుండా అనుగ్రహం పొందాలంటే తప్పకుండా అతనిని ఆరాధించ వలసి ఉంటుంది.

శనిదేవుని దుష్ప్రభావాలకు పరిహారాలు

నువ్వుల నూనెతో తైల అభ్యంగనం అంటే స్నానం చేసి ప్రధానంగా శివుని ఆలయం లో ఉన్న నవగ్రహాలలో శని దేవునికి తైలాభిషేకం చేయాలి. తర్వాత శివాయ నమః అంటూ 108 సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అన్నం, నల్ల నువ్వులు కలిపిన ఉండలను నైవేద్యంగా పెట్టి, ఆ వుండలను కాకులకు తినిపించాలి.

శని త్రయోదశి రోజున శని దేవుని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసాను 27 సార్లు పఠించాలి.
శనివారం నాడు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ అర్చన మరియు అభిషేకం చేయించాలి.
ముఖ్యంగా ఆ రోజున బ్రాహ్మణులకు దానం చేయాలి.

ఇంట్లో ఉన్న పెద్ద వయసు వారితో గొడవ పడకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నువ్వులు, మేకు, నల్లబట్ట, ఇనుప ముక్కలు, ఉప్పు, బెల్లం మరియు గింజలతో సహా పత్తిని దానం చేయాలి. అంటే ఈ వస్తువులతోపాటు స్తోమతను బట్టి దక్షిణ కూడా సమర్పించాలి. వారి ఆశీర్వాదాలు పొందాలి.

శని దోష పరిహారానికి మార్గంగా ఈశ్వర దేవాలయాన్ని సందర్శించి అర్చన మరియు అభిషేకం చేయాలి.
శనీశ్వర మంత్ర జపం, శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, లక్ష్మీ హోమం వంటివి అన్ని చేయించుకుంటే కనుక మీ యొక్క శని దోషాలు అన్ని తొలగిపోతాయి.

ఇది కూడా చదవండి :-

  1. 2022 కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికీ ఎలా ఉండబోతోంది ..?
  2. బల్లి శాస్త్రం – దోషలేంటి ?