శ్రీ రామ నవమి రోజు ఏప్రిల్ 10 న ఈ ఒక్క మాట మనసులో తప్పకుండ అనుకోండి.

0
శ్రీ రామ నవమి రోజు
శ్రీ రామ నవమి రోజు

ఏప్రిల్ 10వ తేదీ శ్రీ రామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ శ్రీరామ నవమి రోజున ఎవరైతే ఈ ఒక్క మాట( మంత్రం) మూడు సార్లు మనసులో అనుకొని స్మరిస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారుతాడు.

శ్రీరాముడు త్రేతాయుగంలో నవమి రోజున జన్మించాడు. ఈ శ్రీరామ నవమి రోజున ఎవరైతే మేము చెప్పే ఈ మాటను స్మరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. వారి కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఈమాటను మూడు సార్లు స్మరిస్తే వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు.

లక్ష్మీదేవి సంతోషంతో ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. వారు తప్పకుండా కుబేరులు గా మారతారు.
ఈ శ్రీరామనవమి రోజు మనసులో ఈ మాటలు తప్పకుండా మూడుసార్లు స్మరించుకోవాలి. అతి రహస్యమైన ఆ శ్లోకం ఏమనగా,

శ్రీరామ రామ రామేతి ,

రమే రామే మనోరమే;

సహస్ర నామ తతుల్యం,

రామ నామ వరాననే

ఇది నిజమని నమ్మడానికి పురాణం లో జరిగిన కథను తెలుసుకోండి. కొలనులో జలకాలాడుతున్న గజేంద్రుని మొసలి తన నోటితో, ఆ గజేంద్రుని కాళ్లు పట్టుకుని వదలకుండా ఉన్నప్పుడు, ఆ గజేంద్రుడు విష్ణువుని శరణు కోరుతాడు.

సరిగ్గా అదే సమయంలో శ్రీహరి లక్ష్మీదేవి యొక్క చీర కొంగు తో ఆడుకుంటూ ఉంటాడు.
గజేంద్రుని ప్రార్థన విని, ఆ శ్రీ మహా విష్ణువు తన చేతిలో ఉన్న చీర కొంగుతో అలాగే గజేంద్రుని కాపాడడానికి భూలోకానికి వస్తాడు. అప్పుడు శ్రీ విష్ణువు తో పాటు గరుత్మంతుడు మరియు సుదర్శన చక్రం అతన్ని అనుసరించి వస్తాయి.

భూలోకానికి రాగానే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో మొసలి గొంతును ఖండించారు.
మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంచి, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు ఎవరూ లేరు అనే సంకల్పంతో ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు.

కాబట్టి ప్రతి రోజు ఈ విష్ణు సహస్ర నామాన్ని మూడు సార్లు జపిస్తే, ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది.
ఎవరైతే ప్రతిరోజు ఈ విష్ణు సహస్రనామాన్ని మూడు సార్లు స్మరిస్తే వారికి, వారు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

ఇంతటి ప్రత్యేకమైన ఈ తారక మంత్రాన్ని శ్రీరామనవమి రోజున స్మరిస్తే వారు అనుకున్నవన్నీ జరుగుతాయి. వారి పాపాలన్నీ అగ్నిలో దహించుకొని పోతాయి. ఈ తారక మంత్రాన్ని జపిస్తే మంచి జ్ఞానాన్ని అందిస్తుంది. మొట్టమొదటగా ఈ తారక మంత్రాన్ని పరమశివుడు పార్వతీదేవికి రహస్యంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చదవండి :- తెలుగు భక్తుల కోసం సరస్వతి శ్లోకం