తెలుగు లో హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడం ఎలా?

0
తెలుగు లో హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్డే అంటే  అది పెద్ద వారితో పోలిస్తే చిన్న పిల్లలకు ఎంతో సంతోషంగా జరుపుకొంటాం. ఎందుకంటే ఇది ఏడాదికి ఒక సారి వచ్చే పుట్టిన రోజు కాబట్టి మనం అ రోజు పిల్లలకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుడి కి వెళ్లి అబ్భాయి పేరు మీద అర్చన చేయించి అ తర్వాత అందరికి స్వీట్స్ పంచి సంతోషముగా జరుపుకోనేదే ఈ జన్మ దిన వేడుక.

ఈ విధముగా తెలుగు లో పిల్లలకు మరియు పెద్దలకు  మరియు  మీ స్నేహితులకు, మీ బంధువులకు మరియు మీ కుటుంబ సభ్యులకు  శుభాకాంక్షలు తెలియ చేయాలి అని చూస్తునారా అయితే ఈ క్రింద ఉన్న తెలుగు లో ఉన్న హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు చూడండి.

తెలుగు లో హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలు (HAPPY BIRTH DAY QUOTES IN  TELUGU) 

    1. అమ్మ! నువ్వు ఇలాగే ఎన్నో సంతోషకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ జన్మ దిన శుభాకాంక్షలు!
    2. ఉప్పొంగిన ఉత్తేజంతో ముందుకు సాగాలని మనసారా కోరుకొంటూ! పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    3. నువ్వు ఎల్లపుడు హాయిగా నవ్వుతు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొంటూ! ప్రియమైన అక్కకి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
    4. చక్కని అందమైన జీవితం గడపాలని ఈలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని జన్మ దిన శుభాకాంక్షలు.
    5. జీవితం లో ధైర్యం అంటే నిన్ను చూసి నేర్చుకొన్న నాన్న, దైర్యం గా బ్రతకడానికి  పరిచయం చేసిన నాన్న. జన్మ దిన శుభాకాంక్షలు.
    6. భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!
    7. నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది… నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    8. ఈ పుట్టినరోజు నీ జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలి అని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
    9. నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
    10. నా పుట్టినరోజు నాడు నీవు ఇచ్చిన బహుమతి ఎప్పటికీ నాకు ఫేవరెట్ గా నిలిచిపోతుంది. అలాంటి ఒక బహుమతే నీకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నాను.
    11. నాకు తెలియని ఎన్నో విషయాలను నా భర్త ద్వారా తెలుసుకోగలిగాను. నాకున్న సమస్యలని సులువుగా తొలగించే భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
    12. జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా.. దానిని నీవు తట్టుకుని నిలబడగలగాలి అని నాలో ధైర్యాన్ని నింపిన నా భర్తకి జన్మదిన శుభాకాంక్షలు.
    13. నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
    14. నా ప్రియమైన స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు మీ జీవితములో ప్రతి రోజు ఆనందిస్తారని ఆశిస్తున్నాను. దేవుడు ఎల్లపుడు మిమల్ని ఆశిర్వదిస్తాడు.
    15. రంగు రంగు ల పూలు విరేసేదే వసంతంలోనే, అందరికి ఆనందాన్ని ఇచ్చేది మన స్నేహమే. అందుకే నీ పుట్టిన రోజు అంటే అందరికి చాల ఇష్టం.
    16. నీవు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో  జరుపుకోవాలని మస్పుర్తిగా   కోరుకొంటూ జన్మ దిన శుభాకాంక్షలు.
    17. నిన్నటి కంటే రేపు బాగుండాలి రోజును మించి రోజు సాగాలి దిగులు నీడలు తాకకుండాలి జీవితం ఆనందమయం కావాలి.
    18. ఈ ఏడాది నువ్వు తలపెట్టిన అన్ని పనులో విజయం లభించాలని  ఆధ్యాత్మికంగా వ్యక్తిగతముగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తిని ప్రసాదించమని అ దేవున్ని కోరుతూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    19. ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ప్రేమ తో జన్మదిన శుభాకాంక్షలు.
    20. నీ జీవితములో ప్రతి క్షణము సంతోషముగా సాగాలని కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    21. నిండు నూరేళ్ళు హాయిగా మనసారా నవ్వుతు జీవించాలని కోరుకొంటూ జన్మ దిన శుభాకాంక్షలు.
    22. కొవ్వోతులను వెలిగించి  మీ  జీవితములో ని ప్రత్యక వెలుగుని కోరుకొంటూ జన్మదిన శుభాకాంక్షలు.
    23. నువ్వు అనుకొన్నది సాదిస్తూ నిండు నూరేళ్ళు సంతోషముగా ఉండాలని కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    24. గత జ్ఞాపకాలు నెమరు వేస్తూ, కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ, అభ్యుదయం ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు.
    25. నీ రాకతో నా జీవితానికి అర్థం వచ్చింది. నా పైన అంతటి అర్థం చూపిన ప్రియసఖి నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    26. కోటి కాంతుల చిరునవ్వులతో, భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుతు జన్మదిన శుభాకాంక్షలు.
    27. నీ జీవితమున ప్రతి క్షణం సంతోషముగా ఉండాలని కోరుతూ హ్యాపీ బర్త్ డే.
    28. మీ ప్రేమ మరియు ఆప్యాయతతో నన్ను మరియు నా కుటుంబాన్ని ఆశిర్వదించండి.
    29. నీవు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో  నిండు నూరేళ్ళు సంతోషముగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    30. నీతో స్నేహం నేను ఎన్నటికి మరిచిపోలేని జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం ఇచ్చిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    31. మీరు అనుకొన్నది జరిగి మీకు అంతా మంచే జరగాలని కోరుకొంటూ … జన్మదిన శుభాకాంక్షలు.
    32. పుట్టిన రోజు గడిచి పోయిన కాలన్ని గుర్తుంచుకోవడానికి కాదు చేయవలసిన కార్యములను గుర్తుంచుకొని సమయని తగు జాగ్రత్త చేసుకోవడం కోసం. జన్మదిన శుభాకాంక్షలు.
    33. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి, చిన్న మాట చాలు పెను యుద్ధాలు ఆపడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి . జన్మదిన శుభాకాంక్షలు.
    34. వికసించే పుష్పం వేదజేల్లె పరిమేళమూలా జీవితం అంతు లేని అవకాశాలను ముందుకు తెస్తుంది. అవధులు లేని ఆనందాన్ని పంచుతుంది. ఈ అవకాశాలను అంది పుచ్చుకొని రాబోయే ఏడాదిని సుఖమయం చేయాలనీ కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    35. సులభముగా లభించేది మోసం, కష్టముగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్ది లభించేది స్నేహం. మిత్రమా! హృదయ పూర్వక శుభాకాంక్షలు.
    36. బాష లేనిది, బంధం ఉన్నది సృష్టి లో అతి మధురమైనది. జీవితములో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే. హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రెండ్.
    37. బాల్యం నుండి నేటి వరుకు నా వెంట ఉండి, నా తప్పులను సరిదిద్దుతు ఒప్పులను మెచ్చుకొంటూ, ప్రతి అడుగులో నాతో కల్సి ఉన్న మిత్రమా, నీవు నిండు నూరేళ్ళు ఆనందంతో మరియు చెరుగని చిరునవ్వుతో ఉండాలని కోరుకొంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    38. దేవుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. అనుక్షణం మన అభివృది మరియు శ్రేయస్సు గురించి ఆలోచించే అమ్మ నీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    39. పసిపాపల నవ్వులో, వెండి వెన్నెల వెలుగులో, కనువిందు చేసే బంధాల మధ్యలో, చిరునవ్వు సాక్ష్యంగా గా చెపుతున్న హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    40. ఇలాగే మరెన్నో  పుట్టిన రోజు శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆశిస్తూ ప్రేమతో మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
    41. నీతో స్నేహం నేను ఎన్నటికి మరిచిపోలేని ఒక జ్ఞాపకం, అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతునాను.
    42. నా జీవిత ప్రేమకు  పుట్టిన రోజు  శుభాకాంక్షలు మీ భార్య కావడం చాల అదృష్టంగా బావిస్తునాను. నా జీవితాన్ని మీతో పంచు కోవడం నాకు చాల ఇష్టం.
    43. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు.
    44. పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో, జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులు ఎన్నో, నా ఈ చిన్ని జీవితములో ఎన్ని పరిచయాలు ఉన్న, కలకాలం ఉండే తియ్యని స్నేహం నీది. అలాంటి నా ప్రియ నేస్తానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    45. సంవస్తరాల జీవితయానములో పరిబ్రమించి తిరిగి రావడానికి  ప్రయాణం అవుతున్న రోజు జన్మదినం, మీ ప్రయాణం సుఖమయముగాక.  నా హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు.
    46. ప్రతి పుట్టిన రోజు నీకు రెట్టింపు సంతోషాన్ని అందించాలని కోరుకోన్నవి అన్ని జరగాలని ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, నా హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు.
    47. మీ ముఖం మీద తప్పుడు కోపాన్ని చూసినపుడు అదే ప్రశ్నను పది సార్లు  అడగడం ఆనందాన్ని ఇస్తుంది. ప్రపంచములోని అత్యంత్ అందమైన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
    48. జీవితములోని ప్రతి సవాలులో బలంగా ఉండండి,  మీరు మరింత బలంగా ఉంటారు,  అప్పుడు మీరు అనుకొంటారు. జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమా!
    49. నా చేతులకు చేయూతనిచ్చి తొలి నడకలు నేర్పించిన నా సరి జోడి… నాన్న ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ,  నా హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు.
    50. అడుగుని ఆపే అవరోధాలే, నీ గెలుపుకు తొలి సోపానలు కావాలి, అలజడి రేపే ఆలోచనలు, నీ ఆఖరి గమ్యాన్ని నిర్దేశించాలి, కలతను పంచె కన్నీరు అయిన, నీ స్పర్శ తో చిరునవ్వుగా మారాలి, తలపెట్టే ప్రతి పనిలో నువ్వే విజయ బహుటా ఎగరవేయాలి అని ఆశిస్తూ, నా హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు.