మంకీ పాక్స్‌‌‌‌ వైరస్ యొక్క లక్షణాలు ఏమిటి !

0
monkey pox symptoms in telugu

Monkey pox symptoms in telugu :- ఇన్ని రోజుల నుండి  కారోనా వైరస్ వల్ల ప్రజలందరు ఇబ్బంది పడ్డారు. ఇపుడు మరో కొత్త వ్యాధి ఇబ్బంది పెడుతోంది, అదే మంకి పాక్స్. Monkey Pox వైరస్ కొంత మందికి సోకడం వల్ల మరణించారు. మరికొందరు వ్యాధి నుండి కోలుకొన్నారు. 

వైరస్  చాల ప్రమాదకరమైనది. ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలకి కూడా ఈ వ్యాధి సోకడం  జరిగింది. మొదటిగా కేరళలో  Monkey Pox కేస్ వెలుగుచూసింది. ఇప్పటి దాక 65 దేశాలకు ఈ వైరస్ సోకడం జరిగింది.

Monkey Pox కేసులు ఎక్కువగా ఆఫ్రికా మరియు యూరప్ లో నమోదు అయ్యాయి.  Monkey Pox అంటే ఏంటి ?  Monkey Pox యొక్క లక్షణాలు ఏంటో ఇపుడు వివరంగా తెలుసుకుందాం.

Monkey Pox అంటే ఏమిటి ? 

 Monkey Pox ఒక వైరల్‌ డిసీజ్. మంకీపాక్స్‌‌ స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినది. ఇది ఒక జెనెటిక్ వ్యాధిగా గుర్తించడం జరిగింది. ఈ వైరస్ కోతుల నుండి మనుషులకి సోకడం జరుగుతుంది. అలాగే ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకి కూడా సోకుతుంది. ఒక కోతులు నుండే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువుల నుండి కూడా వ్యాధి సోకుతుంది.

ఈ వైరస్ శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సుమారు ఆరు రోజుల నుంచి 13 రోజులు దాకా సమయం పడుతుంది. మంకీ ఫాక్స్ మొదటి సారిగా 1958 కోతుల్లో గుర్తించడం జరిగినది. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరుని కూడా పెట్టారు. ఆ తర్వాత 1970 సం. లో మొదటిసారిగ మనుషుల్లో కూడా వైరస్ బయటపడింది.

Monkey Pox లక్షణాలు ఏంటి ?

 Monkey Pox వైరస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం.

 తలనొప్పి, నడుము నొప్పి, జ్వరం, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్  లక్షణాలుగా చెప్పవచ్చు. స్మాల్‌పాక్స్‌ లాగే ముఖం, చేతులు, కాళ్ళ పై దద్దుర్లు, బొబ్బలు సంభవిస్తాయి. ఒక్కోసారి బాడీ అంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా రావడం వల్ల ప్రాణాలకి  ప్రమాదకరంగా మారుతుంది. 

 Monkey Pox ఎలా వ్యాపిస్తుంది ?

మంకీపాక్స్‌ అనేది క్లోజ్‌ కాంటాక్ట్‌ ద్వారా వ్యాపిస్తుంది. దగ్గరగా ఉన్నా, కలిసి కూర్చొన్న, ఒకే కంచెం లో ఆహరం తిన్న, శారీరక సంబంధం కలిగి ఉన్నా కూడా సోకుతుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన జంతువులకు దగ్గరగా ఉన్నా కూడా సోకుతుంది. మొదటిగా జంతువులకి సోకినా తర్వాతే మానవులకి వ్యాపిస్తుంది.

Monkey Pox రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

  • ఎక్కువగా ఏ కార్యక్రమాలకు పోకూడదు.
  • ఏ సమయంలో అయిన సరే హెల్త్ ఫుడ్ ను మాత్రమే తినాలి.
  • ఆహరం తినే సమయంలో వేడి నీరు తీసుకోవాలి.
  • ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి దూరం పాటించాలి.
  • ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించి ఉండాలి.
  •  ఎక్కడ కూడా ఏ వస్తువుని టచ్ చేయరాదు.
  • ఎక్కువగా బయట ఆహరం తినరాదు.

Monkey Pox  వైరస్ సోకినపుడు ఏం చేయాలి ?

  • వ్యాధి సోకిన వారు ఇతర వ్యక్తులకి దూరంగా ఉండాలి.
  • తప్పని సరిగా ఎప్పుడు మాస్క్ ధరించి ఉండాలి.
  • మీరు ఎల్లపుడు శుభ్రంగా ఉండాలి.
  • అవసరమైన ఆహరం మాత్రమే తీసుకోవాలి.
  • వేరొక గ్రామానికి ప్రయాణం చేయకూడదు.
  • వివిధ కార్యక్రమాలకు హాజరు అవ్వరాదు.
  • నీ తోటి వ్యక్తులతో మాట్లాడరాదు.
  • ఇతర మనుషులని ఎవరిని ముట్టుకోకూడదు.

ఇవి కూడా చదవండి :-