ప్రజా సాధికార సర్వే అయిందా లేదా తెలుసుకునే విధానం ఏంటో తెలుసా ?

0

ప్రజా సాధికార సర్వే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. దీన్నే సాధారణంగా పి ఎస్ ఎస్ అంటారు. ఈ సర్వే మన గ్రామ వార్డు వాలంటీర్లు చేపడతారు. ఈ సర్వేలో గనక మీ పేరు లేకుండా అయితే గవర్నమెంట్ అందించే ఇలాంటి పథకానికి మీరు అర్హులు కారు. ఈ సర్వే లో లో మీ పేరు ఉన్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డులు, పింఛను, జగన్ చేదోడు ఇలాంటి మరెన్నో పథకాలను పొందవచ్చు.

ఏపీ ప్రజా సాధికారిక సర్వే ఇప్పుడు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త రేషన్ కార్డులు కోసం అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కోసం అవకాశం కల్పించారు. మరి ఎవరైనా రేషన్ కార్డులో చేర్చాలన్న లేదా కొత్త రేషన్ కార్డులను పొందాలన్నా ప్రజాసాధికారిక సర్వేలో కచ్చితంగా భాగమై ఉండాలి.మీరు గనుక ఇంకా ప్రజా సాధికారిక సర్వే లో పేరు నమోదు చేయించకపోతే వెంటనే మీ గ్రామ వాలంటీర్లు కలిసి నమోదు చేసుకోండి.

మరి ఈ ప్రజా సాధికారిక సర్వే మీకు అయిందో లేదో ఈ కింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

https://epds2.ap.gov.in/epdsAP/epds/pulseserveysearch.epds