తెల్ల జుట్టు పోవాలంటే ఎం చేయాలి ? తెల్ల జుట్టు రావడానికి కారణం ఏమిటి !

0
తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఎం చేయాలి

తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే ఏం చేయాలి | What To Do If White Hair Turns Black 

తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఎం చేయాలి : ప్రస్తుతం యువత నుంచి ముసలి వాళ్ల వరకు ఎంతో మంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది హెయిర్ క్రీమ్ వాడుతున్నారు. దీని కారణంగా చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు.

మారుతున్న కాలాలు, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టుపై ప్రభావం పడుతుంది. దీంతో జుట్టు బలహీనంగా మారడం సహా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం కాలంలో చాలా మంది జుట్టుకు రంగును వేసుకుంటున్నారు.

దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశం ఉన్నదీ, అయితే నేచురల్ గా జుట్టు నల్లగా మారాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

తెల్ల జుట్టు నల్లగా మారటానికి చిట్కాలు | Tips To Turn White Hair Black 

చాల మంది తెల్ల జుట్టు తో భాధపడుతుంటారు. అయ్యితే తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్ లో రకరకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని రకాల నూనెలను అప్లై చేయడం వల్ల జుట్టు చాలా ఫాస్ట్ గా నల్లగా మారుతుంది.

మారుతున్న జీవన శైలి కారణంగా నేడు చాలా మంది తెల్ల  జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో పోషకాల లోపం ఉంటే కూడా తెల్లజుట్టు రావడం మొదలవుతుంది. నిజానికి తెల్ల జుట్టు వయసు మీద పడుతున్న వారికి చిహ్నంగా ఉండేది. కానీ ప్రస్తుతం యువత కూడా తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఈ తెల్ల జుట్టు నుండి నల్ల జుట్టుగా మారడానికి కొన్ని చిట్కాలు తెలుసుకొందం.

Tips 1: 

మీరు ముందుగా కొంత కొబ్బరి నూనె లో మెహందీ ఆకులను కలపండి.. కొబ్బరి నూనెలో మెహందీ ఆకులను కలిపి జుట్టురు రాస్తే కూడా మంచి ఫలితం ఉంటది. దీనిని జుట్టుకు అప్లై చేయడం ద్వారా.. మీ జుట్టు మూలాల నుంచి నల్లగా మారడం ప్రారంభమవుతాయి.

Tip 2 :

 ముందుగా మీరు చేయాల్సింది ఏమంటే.. 3 నుంచి 4  టీ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి స్టవ్ పై పెట్టండి. ఈ నూనె మరుగుతున్నప్పుడు అందులో కొన్ని హెన్నాఆకులను వేయండి. ఈ ఈ నూనె గోధుమ రంగులోకి మారేంత వరకు అలాగే మరిగించండి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి .. చల్లారిన తర్వాత జుట్టు మూలాలకు ఈ నూనెను అప్లై చేయండి. ఈ నూనెను జుట్టుకు పెట్టిన తర్వాత  40 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీట్ గా కడిగేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే తెల్ల జుట్టు చాలా తొందరగా నల్లగా మారుతుంది.

Tip 3 :- 

మీరు తలస్నానం చెసె ముందుగా ఆవ నూనె మీ తలకు రాసుకొంటే తెల్ల జుట్టు నుండి నల్ల జుట్టుగా మారడానికి అవకాశం ఉన్నదీ.

Tip 4 :- 

మీరు ఒక గుడుని తీసుకొని, గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్ ని తలకు ప్యాక్ గా వేసుకోవాలి.ప్యాన్ ని 2 గంటల పాటు ఉంచుకుని గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి.రసాయనాల్లేని షాంపూలనే ఉపయోగించాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు.వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది.

Tip 5:-

మీరు కొంచెం మందార ఆకు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి ప్యాక్ లా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ని జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.ఇలా వారానికి 2సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు నుండి నల్లగా జుట్టుగా గా మారుతుంది.

Tip 6 :- 

మీరు ఒక  హెన్నా పౌడర్ ని తీసుకొని, ఆ హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి.ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి.

తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. హెర్బల్ హెన్నా లో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి నలుపు రంగు వస్తుంది.

Tip 7 :-

మీరు ఒక గ్లాసు నిరు తీసుకొని అందులోకి కొంత కాఫీ పొడిని వేసి మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన తెల్ల జుట్టు వెళ్లి నల్ల జుట్టుగా మారుతుంది.

తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది |  Why White Hair Falls 

వెంట్రుకలు నల్లగా ఉంటే ఏ సమస్యా ఉండదు, అవి తెల్లబడితే, చుట్టుపక్కల వాళ్లు కామెంట్లు చేస్తే అది మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. సహజంగా వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం వయసుతో సంబంధం లేకుండా కలర్ మారిపోతుంది.

జుట్టుకు నల్ల రంగును తెచ్చే మెలనిన్ తలలోని చర్మం కింది భాగంలో, వెంట్రుకల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపు రంగులో కనిపిస్తుంది. అంటే తెలుపు అనేది రంగు కాదు. ప్రతీ వెంట్రుకా పారదర్శకంగా, ఓ గొట్టంలా ఉంటుంది. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. మెలనిన్ లేకపోతే గొట్టం ఖాళీగా ఉండి వెంట్రుక తెలుపుగా కనిపిస్తుందంతే.

తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది, ఈ తెల్ల జుట్టు రావడానికి కారణాలు ఏమిటి, తెల్ల జుట్టు ఎందువలన వస్తుంది. ఈ జుట్టువరడానికి కారణం ఏమిటో తెలుసుకొంధం.

 •  జన్యువులు ప్రభావం : తల్లిదండ్రులకూ, తాత ముత్తాతలకు త్వరగా వైట్ హైయిర్ వస్తే వాళ్ల పిల్లలకూ, మనవళ్లకు కూడా అలా జరిగే అవకాశాలుంటాయి. అందువలన తెల్ల జుట్టు వస్తుంది.
 •  టెన్షన్లు వలన: పని ఒత్తిళ్లు, టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, నిద్రలేమి, ఆహార మార్పులు, హైబీపీ వంటివి మన తలలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం వలన తెల్ల జుట్టు రావడానికి కారణం అవుతుంది.
 • ఆటో ఇమ్యూన్ డిసీజ్ : ఒక్కోసారి మన శరీరంలోని వ్యాధి నిరోధకత తన సొంత కణాలపైనే దాడి చేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మెలనిన్ ఉత్పత్తి అనేది తగ్గి పోయి తెల్ల జుట్టు వస్తుంది.
 • థైరాయిడ్ సమస్య : మన గొంతులో సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది శరీరంలోని చాలా అవయవాలు సరిగా పనిచేసేలా చేస్తుంది. ఇది సరిగా పనిచెయ్యకపోతే… మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి నల్ల జుట్టు రావడానికి అవకాశం ఉన్నదీ.
 • విటమిన్ B-12 తగ్గిపోవడం వలన  : త్వరగా జుట్టు నెరిసిపోయిందంటే దానర్థం మనలో విటమిన్ B-12 సరిపడా లేనట్లే. ఇది జుట్టుకు ఎంతో మేలు చేసే విటమిన్. ఇది ఆక్సిజన్‌ను తీసుకెళ్లే ఎర్రరక్తకణాలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ బీ-12 సహకరిస్తుంది.

అది లేనప్పుడు ఎర్రరక్తకణాలు దెబ్బతిని… జుట్టు కణాలకు సరైన ఎర్రరక్తకణాలు చేరవు. ఫలితంగా జుట్టు కణాలు దెబ్బతిని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. విటమిన్ B-12 కోసం చేపలు, బాదం, పీతలు, పాలు, వెన్న, గుడ్లు, చికెన్ తినాలని ఈ పదార్థాలు తినడం వలన తెల్ల జుట్టు రాకుండా ఉంటది.

 • స్మోకింగ్ : పొగతాగడం త్రాగడం వలన కూడా తెల్ల జుట్టు రావడానికి అవకాశం ఉన్నదీ. పొగ త్రాగడం వలన ఎర్రరక్తకణాల్ని దెబ్బతీస్తుంది. దాని వలన జుట్టు వస్తుంది.

తెల్ల జుట్టు రాకుండా ఎం తినాలి | Eat To Prevent White Hair 

తెల్ల జుట్టు రాకుండా ఉండనికి ఎలాంటి ఆహరం తీసుకోవడం వలనా తెల్ల జుట్టుని నివారణ చేయవచ్చు.

 • జుట్టుకి కావలసిన పోషకాలు ఉన్న ఆహరం తీసుకోవాలి.
 • తాజా ఆకుకూరలు బాగా తినాలి.
 • తాజా పండ్లు తినాలి.
 • తెల్ల జుట్టుకి కావాల్సిన విటమిన్ బి 12 ఫుడ్ ని తీసుకోవాలి.
 • పండ్డ్లు రసాలు తాగాలి అది మీ ఇంటిలోనే చేసుకొని తాజాగా తీసుకోవాలి, బయట రసాలు తగకుడదు.
 • కరివేపాకు పల్లిల పొడిగా చేసుకొని రోజు వారిగా తీసుకోవాలి.

మీకు తెల్ల జుట్టు నుండి నల్ల జుట్టుగా మార్చుకోవాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Hair Oil Online Link  

ఇవి కూడా చదవండి :-