మౌని అమావాస్య రోజు ఇలా చేసి కష్టాలను దూరం చేసుకోండి

0
మౌని అమావాస్య రోజు
మౌని అమావాస్య రోజు

మౌని అమావాస్య రోజు 2022 : శక్తివంతమైన మౌని అమావాస్య  – ఇంట్లో కష్టాల్లో ఉన్న వారు గుమ్మానికి ఇది కడితే చాలు!!
మీ కష్టాలన్నీ తీరి కుబేరులు అవుతారు!!!

ఫిబ్రవరి ఒకటో తేదీ వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున తప్పకుండా మీ ఇంటి సింహద్వారానికి వీటిని కడితే చాలు. మీ మీద ఉన్న నరపీడ మరియు ఇతరుల దృష్టి అన్ని తొలగిపోతాయి.

ఎందుకు కట్టాలి

  • ఇంట్లో గొడవలు
  • అనుకున్నవి జరగకపోవడం
  • ఆరోగ్య సమస్యలు
  • ఆర్థిక సమస్యలు
  • పిల్లలకు పెళ్లి కాకపోవడం
  • ఉద్యోగం రాక పోవడం
  • వ్యాపారంలో నష్టాలు రావడం
  • మానసికంగా భయం ఆందోళన ఉండటం ఇతరుల అసూయ మనమీద ఉండడం

పై సమస్యలను తగ్గించుకోవడానికి మీరు ఈ క్రింది పరిహారాలు తప్పకుండా పాటించాలి.

ఈ పరిహారానికి “పటిక” తప్పనిసరిగా కావాలి. శుభ్రంగా ఉన్న పటికను తీసుకుని, దానిమీద పసుపు, కుంకుమ వేసి ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, తర్వాత దీనిని ఇంటి సింహద్వారానికి అమావాస్య రోజు కట్టాలి.
నల్ల గవ్వలు గురించి వినే ఉంటారు. వీటివల్ల నరదృష్టి, ఇరుగుపొరుగు దృష్టి వంటివి తొలగిపోతాయి.
ఎరుపు రంగు వస్త్రము లో వీటి నుంచి ఇంటి సింహద్వారానికి కట్టాలి.

పరిహార ఫలితాలు

పటిక ను ఇలా కట్టడంవల్ల మీ ఇంటిలో ఉండే నెగటివ్ ఎనర్జీ తీసివేయబడుతుంది. ఇరుగుపొరుగు వారి యొక్క కుళ్లు, అసూయలు పనిచేయవు. మీకు మరియు మీ ఇంట్లో ఉండేవారికి, మీ ఇంటికి కూడా అంతా మంచే జరుగుతుంది.

ఎలా కట్టాలి

ఇందుకోసం మీరు ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో పటిక నుంచి కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఐదు నల్ల గవ్వలు ఉంచి మూట కట్టాలి. ఇలా కట్టిన మూట కు సామ్రాణి పొగ వెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఈ మూటకు అతీంద్రియ మైన శక్తి వచ్చి చేరుతుంది.

దీనిని ఫిబ్రవరి ఒకటో తేదీ వస్తున్న మౌని అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఇలా చేయడం వల్ల, చాలావరకు దిష్టి వల్ల కలిగే అశుభ ఫలితాలను తొలగిస్తుంది. చీటికి మాటికి గొడవలు జరగవు.

ఇతరుల దృష్టి మీ మీద పని చేయదు. ఇలా మూటను కట్టిన తర్వాత కొన్ని రోజులకి పటిక అనేది దాని యొక్క సైజు చిన్నగా మారిపోతుంది. ఈ విధంగా మీరు కట్టిన మూట సైజు చిన్నగా మారినప్పుడు, ఆ మూటను జాగ్రత్తగా తొలగించి ఎవరూ తొక్కని ప్రదేశములో వదిలి రావాలి.

ఆ తర్వాత వచ్చే ఏదైనా ఒక అమావాస్య రోజున మరల ఇదేవిధంగా పటిక మరియు ఐదు నల్ల గవ్వలు ఉంచి మూటగా కట్టి సింహద్వారానికి వేలాడదీయడం చాలా మంచిది. నల్ల గవ్వలు పూజా వస్తువులు అమ్మే షాపులలో లభిస్తాయి.

ఇది కూడా చదవండి :-

  1. 2022 కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికీ ఎలా ఉండబోతోంది ..?
  2. బల్లి శాస్త్రం – దోషలేంటి ?