కట్ కట్ మని శబ్దం చేసే మీ కిళ్ళ నొప్పులు ఇలా మాయం చేయండి

0
home remedies for for joint pain in knee in telugu
home remedies for for joint pain in knee in telugu 2021

Home remedies for for joint pain in knee in telugu

మీ శరీరంలో మీయొక్క మోచేతుల నుంచి, మోకాలు నుంచి మరియు కీళ్ళ భాగాల నుండి కట్ కట్ మని శబ్దం వస్తుందా? మోకాళ్ళ లో గుజ్జు రావాలంటే ఏం చేయాలి ?

అయితే ఈ వ్యాసంలో మేము తెలియజేస్తున్న ఆహార పదార్థాలను వెంటనే తినడం ప్రారంభించండి నిర్లక్ష్యం చేయకండి. సాధారణంగా ఎముకల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక విధమైన లూబ్రికెంట్ ఉంటుంది.

ఈ లూబ్రికెంట్ లో గ్యాస్ చేరడం వల్ల మనం నడిచేటప్పుడు, ఒంగినప్పుడు, లేచినప్పుడు కీళ్ల నుండి కట్ కట్ మని శబ్దం వస్తుంది.ఇలాంటి శబ్దం వచ్చినప్పటికీ మీరు శ్రద్ధ చూపకపోతే భయంకరమైన ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఈ సమస్య నుండి శాశ్వతంగా విముక్తి కావాలంటే ఈ ఆహార పదార్థాలను మీరు తప్పకుండా ఆహారముగా తీసుకోవాలి. మన యొక్క మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకోవాలి. మంచి పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి.

పాలు:- 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది.ఈ కాల్షియం ఎక్కువగా మనకు పాల ఉత్పత్తుల నుండి లభిస్తుంది. కాల్షియం వల్ల దంతాలు దృఢంగా ఉంటాయి ఎముకలు బలంగా మారుతాయి.

నువ్వులు:- వెయ్యి గ్రాముల నువ్వుల లో వంద మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.నువ్వుల లలో ఉండే ఫైటో స్టిరాన్ అనే కెమికల్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

నువ్వులను దోరగా వేయించి నేరుగా తినవచ్చు లేదా బెల్లం పొడి కలిపి ఉండలు చేసుకొని తినవచ్చు. నువ్వులు జీర్ణ శక్తిని అభివృద్ధి చేస్తాయి ఐరన్ ను పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ను కరిగించి వేస్తాయి.

బాదం పప్పు:- 100 గ్రాముల బాదం పప్పు లో 260 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.అయితే బాదంపప్పును రోజుకు ఐదు లేదా ఆరు గింజలు మాత్రమే తినాలి.

రాత్రి నానబెట్టుకుని ఉదయం పొట్టు తీసేసి తినాలి. బాదం పప్పు క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం, గోళ్ళు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. బాదం పప్పులో పొటాషియం తో పాటు బి1, బి2, బి3 వంటి విటమిన్లు అన్నీ ఉంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

బెల్లం:- మనిషి శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది. 100 గ్రాముల బెల్లంలో 2.6 మిల్లీగ్రాముల ఐరన్, 8 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్త్రీలు పీరియడ్స్ ద్వారా కోల్పోయిన రక్తాన్ని తిరిగి పొందాలంటే ప్రతి రోజు బెల్లం ని వాడాలి. అన్నం తిన్న తర్వాత ఒక బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకోవాలి.

శనగలు:- ఈ శనగలలో జింక్, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్, ఫైబర్ కూడా అధిక శాతంలో ఉంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇంకా శనగలు లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడంవల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి.

పైన తెలియజేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీయొక్క కాళ్లు, చేతులు మరియు వీపు నుండి కట్ కట్ శబ్దం రాకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :-

  1. నిమ్మకాయతో పాటు ఈ పండ్లు తింటే ఇక చావు తప్పదు
  2. మగవారికి ఈ విషయం తెలిస్తే ఇక జీవితంలో వదిలిపెట్టరు
  3. ఒక్క రోజులో జుట్టు పెరగాలంటే ఏం చేయాలి