Table of Contents
How To Apply SBI Credit Cards Online In Telugu
SBI Credit Cards : ఫ్రెండ్స్ SBI బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకు. మన దేశంలోనే అతి పెద్ద బ్యాంకు. SBI బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల సేవలను అందిస్తుంది. వాటిలో క్రెడిట్ కార్డ్స్ ఒకటి. ఈ క్రెడిట్ కార్డు లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి.
ఈ SBI బ్యాంకు మనకి 72 రకాల క్రెడిట్ కార్డ్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. వీటిలో కొన్ని క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్స్, లైఫ్ స్టైల్ కార్డ్స్, ట్రావెల్ కార్డ్స్, షాపింగ్ కార్డ్స్, బిజినెస్ కార్డ్స్ ఉంటాయి. మనకి ఏ టైప్ క్రెడిట్ కార్డు కావాలంటే ఆ కార్డు ని అప్లై చేసుకోవచ్చు.
ఈ క్రింద మనం ఆన్లైన్ లో క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి?, అప్లై చేయాలి అంటే ఏ డాకుమెంట్స్ ఉండాలి, అర్హత ఏమి ఉండాలి. అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
SBI Credit Cards Eligibility In Telugu
sbi క్రెడిట్ కార్డ్స్ ని మనం అప్లై చేసుకోవాలి అంటే ఈ క్రింది అర్హతలు మనకు ఉండాలి.
- భారతీయ పౌరులై ఉండాలి.
- వయస్సు 18 ఏళ్ళ పైన ఉండాలి.
- నెలకు కనీస ఆదాయం ఉండాలి.
- సిబిల్ స్కోర్ 750 ఉండాలి.
SBI Credit Cards Required Documents In Telugu
ఫ్రెండ్స్ SBI బ్యాంకు లో మనం క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డ్.
- పాన్ కార్డు.
- 3 నెలల బ్యాంకు స్టేట్ మెంట్
- మీరు బిజినెస్ పర్సన్ అయితే 2 సంవత్సరాల ITR
- మీరు స్యాలరి పర్సన్ అయితే 3 నెలల స్యాలరి స్లిప్స్
How To Apply SBI Credit Cards Online In Telugu
ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు sbi క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఏ డాకుమెంట్స్ ఉండాలి, అర్హత ఏమి ఉండాలి అనే విషయాలు గురించి తెలుసుకున్నాం.
క్రింద మనం ఆన్లైన్ లో sbi క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా sbi బ్యాంకు వెబ్సైట్ వెళ్ళండి.
- sbi లో ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డు వస్తాయి. వాటిలో మీకు కావాల్సిన క్రెడిట్ కార్డు ని సెలెక్ట్ చేసుకొని apply ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ పేరు, పాన్ నెంబర్, ఆధార్, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
- మీ మొబైల్ కి otp వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- మీ డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయండి.
- వీడియో kyc చేసుకోండి.
- కార్డు అప్లై చేసిన 20 రోజుల లోపు కార్డు మీ ఇంటికి వస్తుంది.