50 బెస్ట్ అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు

0
Baby Girl Names In Telugu
Baby Girl Names In Telugu

Top 50 Baby Girl Names In Telugu With Meaning

ప్రస్తుతం ఉన్న జనరేషన్ తమ పిల్లలు ప్రత్యేకంగా ఉండాలని ఉవ్వుళ్లూరుతారు. తల్లిదండ్రులు కాబోతున్నాం అని తెలిసినప్పటి నుండి పిల్లల పేరు మొదలు చదువు, దుస్తులు ఇలా అన్నింటిలో ప్రత్యేకత ఉండాలని అనుకుంటారు.

అందరూ పిలిచే పేరు విషయంలో ఏదో ఒకటిలే అనుకునేవాళ్ళు చాలా తక్కువ. కానీ కొన్ని పేర్లలో అర్థం ఉండటం లేదనేది పెద్దల వాదన. అందుకే ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టు, ఫాషన్ గానూ, మంచి అర్థాలు ఇమిడి ఉన్న పేర్లు అందరికోసం. మరి టాప్ 50 అబ్బాయిల పేర్లు కూడా ఇక్కడ ఇచ్చాము, ఒక్కసారి లుక్ వేసుకోండి.

వీటిలో ఏముంది?? స్టైల్ ఉంది, మీనింగ్ ఉంది, ఎవరైనా వినగానే ఫిదా అవ్వడం ఖాయం.

అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు

S.NOBABY NAMEMEANING IN TELUGU
1భావిక (bhaavika)నమ్మకమైనది, సందేహం  లేకుండా  వ్యక్తం చేయగలిగినది.
2ఆద్య (aadya)దుర్గ దేవి, మొదటిది
3దక్ష (daksha)భూమి, పార్వతి దేవి మరొక పేరు
4ధృతి (dhruthi)ధైర్యం కలది, శాసించగలది.
5చక్రిక (chakrika)లక్ష్మీదేవి
6ఇషాని ( ishani)శివుడి భార్య,  పార్వతి దేవి
7మిహిర (mihira)సూర్యుడి నుండి ప్రసరించే వెలుగు
8ఊర్వి (oorvi)భూమి, నది
9అన్విక ( anvika)శక్తివంతమైనది, సంపూర్ణమైనది
10శ్రీనిక (sreenika)విష్ణువు హృదయం నుండి పుట్టిన తామర.
11అద్విక(advika)ప్రపంచం, భూమి
12ద్విజ(dwija)మంచి ప్రతిభ కలది
13అనిక(anika)దుర్గాదేవి
14అవ్యక్త(avyaktha)వ్యక్తం చేయలేనిది, స్వఛ్చమైనది
15ధృవి(dhruvi)చురుకైనది
16మనస్వి(manaswi)తెలివైనది, ఆత్మాభిమానం మెండుగా కలది.
17దివిజ(divija)స్వర్గంలో పుట్టినది
18నైనిక(nainika)ఆకర్షణ కలది, అందమైన కళ్ళు కలిగినది
19సహస్ర(sahasra)కొత్తదనానికి మూలమయ్యేది, వెయ్యిరెట్లు బలమైనది
20ప్రణిక(pranika)పార్వతీదేవి
21సమన్విత(samanvitha)అన్ని మంచి గుణాలు కలిగినది
22ఋషిక(rushika)శివుడి అంశంతో పుట్టినది
23దర్శిక (dharshika)నేర్పు కలిగినది, తెలివైనది
24మోక్షిత(mokshitha)స్వేచ్ఛను కోరుకునేది.
25యశిక(yashika)విజయాన్ని సాదించేది
26రితిక(rithika)తెలివైనది, నిజమైనది, సరదాగా ఉండేది.
27అక్షర(akshara)సరస్వతి, విద్యను ఒడిసిపట్టేది.
28స్వస్తి(swasthi)నక్షత్రం పేరు, ప్రశాంతమైనది
29సాత్విక(satwika)దుర్గాదేవి శాంత రూపం
30అనుకృతి(anukruthiఅనుకరణ కలిగినది, 
31మౌక్తిక(moukthika)లక్ష్మీ దేవి మరొక పేరు, స్వఛ్చమైనది, ముత్యం
32తనీష(taneesha)అందానికి మూలమైనది, గొప్ప ఆశయాలు కలది.
33శర్మిష్ఠ(sharmishta)తెలివైనది, అందమైనది, యయతి భార్య పేరు.
34శ్రేష్ఠ(shreshta) ఉత్తమమైనది
35పూర్విక(poorvika)సాంప్రదాయమైనది.
36తనుశ్రీ(tanusree)అందమైనది, చురుకైనది
37నిషిత(nishitha)వెలుగుతూ ఉండేది, తెలివైనది
38ప్రణిష(pranisha)జీవితం మీద ప్రేమ గలది.
39లోహిత(lohitha)ఎరుపు రంగు గలది. లక్ష్మీదేవికి ఇష్టమైనది.
40కృతిక(krithika)నక్షత్రం
41ప్రఖ్య(prakhy)అలరించేది, ఆకర్షించేది
42శతాక్షి(shathakshi)దుర్గాదేవి, పార్వతి, రాత్రి, వంద కళ్ళు గలది
43కేతన(kethana)లక్ష్మీదేవి నివాసం ఉండే చోటు
44నక్షత్ర(nakshatra)వెలుగు పంచేది, నక్షత్రం, ముత్యం
45యుక్తి(yukthi)తెలివైనది, సమస్యను పరిష్కరించే నేర్పు కలది
46సారిక(sarika)కోకిల, ప్రకృతికి అందాన్ని ఇచ్చేది
47తరుణిక(tarunika)యవ్వనం కలది.
48సంహిత(samhitha)కలసిపోయేది, అందరి మంచి కోరుకునేది
49ఖ్యాతి(khyathi)పేరు ప్రతిష్టలు కలది.
50వియ(viya)కావ్యం, రచన, సృజనాత్మకత కలిగినది.

 

ఇవి కూడా తెలుసుకోండి :-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here