కోరమీను చేప గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం!

0
korameenu fish in telugu

కోర మీను చేప పరిచయం | Korameenu Fish In Telugu 2022

Korameenu Fish In Telugu : కోర మీను అనేది మన భారతదేశంలో అందరూ ఇష్టపడి తినే చేప. దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. కోర మీను యొక్క పులుసును మన ఆంధ్రప్రదేశ్ లో ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు.

ఈ చేపలు మంచి నీటి గుంతలలో, చెరువులలో, ఏరులలో  మనకు బాగా కనిపిస్తాయి. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది.  దీని యొక్క ప్రొటీన్ శాతం అన్నిచేపలతో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది.

ఇది ఎక్కువగా లోతైన ప్రాంతంలో, బురదలో కూరుకుని చిన్న చిన్న పురుగులను తింటూ జీవనం సాగిస్తుంది. ఇది సర్వ భక్షక జీవి కాబట్టి చిన్నపాటి చేపలను కూడా ఆహారంగా తింటుంది. ఇది చాలా ధృడమైన చేప. నీటిలో నుంచి బయటకు తీసినా కూడా కొన్ని గంటల పాటు బ్రతికే ఉంటుంది. దీని తల చూడటానికి పాము తలలా ఉంటుంది.

Korameenu Fish In Telugu

ఈ చేపని మీరు కొనాలి అనుకొంటే ఇద్దకడ ఇచ్చిన లింక్ ద్వారా ఈ చేపని మీరు కొనవచ్చు :-Korameenu Fish Site Link

కోర మీను చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు

మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటుంది.అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్ ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో మనకి లభిస్తాయి. ఇది చాలా డిమాండ్ కలిగిన చేప. దీని ఖరీదు కూడా కొన్ని ప్రాంతాలలో మనకు మాములుగా దొరికే చేపలతో పోలిస్తే చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ చేప ధర సుమారు కేజీ 500 నుండి ప్రారంభం అవుతుంది.

కోర మీను చేప తినడం వలన కలిగే  ఉపయోగాలు 

గాయాలు మాన్పుటకు :

ఇందులో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకు గాయం తగిలినప్పుడు దీనిని ఆహారంగా తీసుకుంటే మన గాయాలు త్వరగా మానిపోతాయి. ఆల్బుమిన్ అనేది మన శరీరంలో ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఇది గాయాలను మాన్పడానికి  ఉపయోగపడుతుంది.

కండరాల దృడత్వనికి సహయంచేస్తుంది 

ఇది ప్రోటీన్ శాతాన్ని కలిగి ఉండడం వల్ల మన కండరాలలో శక్తి పెరుగుతుంది. ఈ చేపలో ఉన్న ప్రోటీన్ శాతం మనకు మార్కెట్లో దొరికే మాంసం అంటే చికెన్ మరియు మటన్ తో పోలిస్తే ఇందులో ఎక్కువగానే ఉంటుంది.

రక్త ప్రసరణ 

ఇందులో ఉన్న లవణాలు కొవ్వు పదార్థాలు మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరంలోని రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్థాయి. అందుకని కనీసం నెలకు రెండు సార్లు ఈ చేపను ఆహారంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాల ఉపయోగాలు కలుగుతాయి.

మధుమేహ నివారణ 

ఈ చేపను మనం తరుచుగా తీసుకొంటే మన శరీరంలో ఉండే చెక్కర స్థాయిని తగ్గిస్తుంది. ఈ చేప మాంసంలో ఉన్నా లవణాలు, మంచి ప్రొటీన్లు మరియు కొవ్వులు వల్ల దీని మాసం తింటే చాలా ఫలితాలను కల్గుతాయి. అలాగే ఈ చేపను తినడం వలన మన మధుమోహ స్థాయిని పెంచకుండా తగ్గకుండ ఒక నిర్ణిత స్థాయిలో ఉంచుతుంది.

కోర మీను చేప తినడం వలన కలిగే  దుష్ప్రభావాలు 

  • ఈ చేపలు గర్భవతులు తీనకూడదు.
  • అలాగే పాలు ఇచ్చే తల్లులు  కూడా ఈ చేపను తీనకూడదు.
  • ఒక్కోసారి ఈ చేపను తినడం వలన తిమ్మిరిగ ఉండడం జరుగుతుంది.
  • ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బురం ,నొప్పి వంటిది వస్తుంది.
  • ఈ చేపలు తినడం వలన వాంతులు కూడా అయ్యే ఆవకాశం ఉంది.

FAQ:

  1. Is Korameenu fish good for health?
    కొరమీను చేప యొక్క పోషక విలువలు గొప్పవి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఖనిజాలు మరియు విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది ఒమేగా -3 మరియు ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం మరియు జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది.
  2. What is Korameenu fish called in English?
    ఈ చేపను ఆంగ్లంలో  రెడ్ స్నాపర్ అని పిలుస్తారు.
  3. Is Korameenu fish good for pregnancy?
    ఈ చేపలు గర్భవతులు తీనకూడదు. అలాగే పాలు ఇచ్చే తల్లులు  కూడా ఈ చేపలను తీనకూడదు.
  4. Is murrel a fatty fish?
    ముర్రెల్ చేప ఒమేగా కొవ్వు ఆమ్లాలు మరియు ప్రోటీన్లకు మంచి మూలం. ఒమేగా కొవ్వు ఆమ్లాలు మరియు ప్రోటీన్లు వైద్యం ప్రక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడతాయి.
  5. What is Korameenu fish?
    ఆంధ్ర ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో వేసవిలో మాంసాహారం తినడానికి స్థానికంగా కోరమేను అని పిలువబడే బుల్‌సీ స్నేక్‌హెడ్ చేపలకు  వర్షాకాలంలో కూడా మంచి డిమాండ్ ఉంది.

ఇవి కూడా చదవండి